తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rashmika Mandanna Movies: రష్మిక మందన్నా రాబోయే ఆరు సినిమాలు ఇవే.. అన్నీ పాన్ ఇండియా మూవీసే

Rashmika Mandanna Movies: రష్మిక మందన్నా రాబోయే ఆరు సినిమాలు ఇవే.. అన్నీ పాన్ ఇండియా మూవీసే

Hari Prasad S HT Telugu

10 May 2024, 17:25 IST

    • Rashmika Mandanna Movies: రష్మిక మందన్నా ఒకేసారి ఏకంగా ఆరు సినిమాల్లో నటిస్తోంది. ఏడాది గ్యాప్ లో ఈ ఆరు పాన్ ఇండియా సినిమాలూ ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం విశేషం.
రష్మిక మందన్నా రాబోయే ఆరు సినిమాలు ఇవే.. అన్నీ పాన్ ఇండియా మూవీసే
రష్మిక మందన్నా రాబోయే ఆరు సినిమాలు ఇవే.. అన్నీ పాన్ ఇండియా మూవీసే

రష్మిక మందన్నా రాబోయే ఆరు సినిమాలు ఇవే.. అన్నీ పాన్ ఇండియా మూవీసే

Rashmika Mandanna Movies: నేషనల్ క్రష్ అని రష్మిక మందన్నాను ఊరికే అనలేదు. ఆ భాష, ఈ భాష అనే తేడా లేకుండా వరుస పాన్ ఇండియా సినిమాలతో ఆమె బిజీ బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె ఏకంగా ఆరు సినిమాల్లో నటిస్తుండటం విశేషం. గతేడాది చివర్లో యానిమల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె.. ఈ ఏడాది మరో భారీ బడ్జెట్ పాన్ ఇండియా పుష్ప 2తో రాబోతోంది. మరి ప్రస్తుతం రష్మిక చేస్తున్న ఆ సినిమాలేంటో చూడండి.

ట్రెండింగ్ వార్తలు

Swatantrya Veer Savarkar ott release date: స్వాతంత్య్ర వీర్ సావర్కర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ఆ ప్రత్యేకమైన రోజునే..

Gam Gam Ganesha Trailer: ఆనంద్ దేవరకొండ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

Payal Rajput: చిక్కుల్లో పాయల్ రాజ్‌పుత్.. నిర్మాతల మండలికి రక్షణ ప్రొడ్యూసర్ ఫిర్యాదు

Top 10 IMDb rating movies: ప్రపంచ సినిమాలో అత్యుత్తమ ఐఎండీబీ రేటింగ్ కలిగిన టాప్ 10 మూవీస్ ఇవే.. ఈ ఓటీటీల్లో చూడండి

పుష్ప 2: ది రూల్

రష్మిక మందన్నా అభిమానులే కాదు.. పాన్ ఇండియా లెవల్లో మోస్ట్ అవేటెడ్ మూవీస్ లో ఒకటైన పుష్ప 2: ది రూల్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పుష్ప తొలి పార్ట్ లో శ్రీవల్లి పాత్రలో అదరగొట్టిన ఆమె.. ఇప్పుడీ సీక్వెల్లోనూ నటిస్తోంది. ఈ మూవీ ఆగస్ట్ 15న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. రూ.400 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో ఐదు భాషల్లో రిలీజ్ కానుంది ఈ సినిమా.

సికందర్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పక్కన నటించే అవకాశం కూడా కొట్టేసింది రష్మిక మందన్నా. తమిళ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ డైరెక్షన్ లో రాబోతున్న యాక్షన్ మూవీ సికందర్ లో రష్మిక నటిస్తున్నట్లు ఈ మధ్యే అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ వచ్చే ఏడాది రంజాన్ సందర్భంగా రిలీజ్ కానుంది.

ఛావా

ఛావా ఓ హిస్టారికల్ పీరియడ్ డ్రామా. ఇందులో విక్కీ కౌశల్, అక్షయ్ ఖన్నాలతో కలిసి రష్మిక మందన్నా నటిస్తోంది. ఛత్రపతి శివాజీ తనయుడు ఛత్రపతి శంభాజీ మహరాజ్ కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 6నే రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లక్ష్మణ్ ఉటేకర్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు.

కుబేర

ఇది కూడా పాన్ ఇండియా మూవీనే. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తమిళ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ మన్మథుడు నాగార్జున నటిస్తున్న ఈ కుబేర మూవీలోనూ రష్మిక ఛాన్స్ కొట్టేసింది. ఈ మధ్యే టైటిల్ రివీల్ చేసిన ఈ సినిమాలో ధనుష్ ఓ బిచ్చగాడి పాత్రలో కనిపించనున్నాడు. నాగార్జున క్యారెక్టర్ ను కూడా ఈ మధ్యే పరిచయం చేశారు.

ది గర్ల్‌ఫ్రెండ్

రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ ది గర్ల్‌ఫ్రెండ్. ఈ రొమాంటిక్ డ్రామా కూడా ఈ ఏడాది చివర్లో రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే రష్మికకు సంబంధించిన గ్లింప్స్ వీడియో కూడా వచ్చింది. నీటిలో మునిగిపోతున్న ఆమెను ఇందులో చూడొచ్చు.

రెయిన్‌బో

రెయిన్‌బో మూవీలోనూ రష్మిక నటిస్తోంది. నిజానికి ఈ సినిమా అటకెక్కేసినట్లు మొదట భావించారు. కానీ షూటింగ్ నెమ్మదిగా సాగుతోంది. ఈ సినిమా చాలా స్పెషల్ అని గతంలో రష్మిక చెప్పింది. గతేడాదే ఈ మూవీని అనౌన్స్ చేశారు. రిలీజ్ డేట్ పై ఇంకా సమాచారం లేదు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం