Pushpa 2 first single: యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న పుష్ప 2 ఫస్ట్ సింగిల్.. వరల్డ్ వైడ్ నంబర్ వన్-pushpa 2 first single pushpa pushpa most viewed videos on youtube in last 24 hours worldwide allu arjun sukumar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2 First Single: యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న పుష్ప 2 ఫస్ట్ సింగిల్.. వరల్డ్ వైడ్ నంబర్ వన్

Pushpa 2 first single: యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న పుష్ప 2 ఫస్ట్ సింగిల్.. వరల్డ్ వైడ్ నంబర్ వన్

Hari Prasad S HT Telugu
May 02, 2024 04:11 PM IST

Pushpa 2 first single: పుష్ప 2 మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ యూట్యూబ్ లో దుమ్ము రేపుతోంది. తొలి 24 గంటల్లోనే ఈ పాటను ఎగబడి చూడటంతో రికార్డులు బ్రేక్ చేస్తోంది.

యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న పుష్ప 2 ఫస్ట్ సింగిల్.. వరల్డ్ వైడ్ నంబర్ వన్
యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న పుష్ప 2 ఫస్ట్ సింగిల్.. వరల్డ్ వైడ్ నంబర్ వన్

Pushpa 2 first single: అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 మూవీ నుంచి పుష్ప పుష్ప అంటూ ఫస్ట్ సింగిల్ రిలీజైన విషయం తెలుసు కదా. బుధవారం (మే 1) ఈ సాంగ్ రిలీజ్ కాగా.. యూట్యూబ్ లో దుమ్ము రేపుతోంది. తొలి 24 గంటల్లో తెలుగు రాష్ట్రాలు, ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం విశేషం.

yearly horoscope entry point

పుష్ప పుష్ప రికార్డు

పుష్ప 2: ది రూల్ మూవీ నుంచి ఈ ఫస్ట్ సింగిల్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. దీంతో ఈ సాంగ్ తెలుగు, హిందీ లిరికిల్ వెర్షన్లు గత 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ లో ఎక్కువ మంది చూసిన వీడియోలుగా నిలవడం విశేషం. ఈ విషయాన్ని పుష్ప 2 మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. పుష్ప పుష్ప వరల్డ్ వైడ్ చార్ట్‌బస్టర్ అంటూ ఓ సరికొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.

ఇందులో అల్లు అర్జున్ తనదైన స్టైల్లో నడుచుకుంటూ వెళ్తున్న ఫొటోను వెనుక నుంచి చూపించారు. పుష్ప 2 మూవీ ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుండగా.. నాలుగు నెలల ముందు నుంచే మేకర్స్ ప్రమోషన్లు మొదలుపెట్టారు. గత నెల 8వ తేదీన అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా పుష్ప 2 టీజర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

తాజాగా ఫస్ట్ సింగిల్ తో ప్రమోషన్లను మరో లెవల్ కు తీసుకెళ్లారు. పుష్ప మూవీకి మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్రసాదే ఈ సీక్వెల్ కు కూడా మ్యూజిక్ కంపోజ్ చేశాడు. పుష్ప మూవీలో సాంగ్స్ అన్నీ ఓ రేంజ్ లో హిట్టయ్యాయి. దీంతో సీక్వెల్ పైనా అదే రేంజ్ అంచనాలు ఉన్నాయి. ఫస్ట్ సింగిల్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే.. ఇది అభిమానులకు బాగానే నచ్చినట్లు కనిపిస్తోంది.

పుష్ప 2 ఫస్ట్ సింగిల్

పుష్ప 2 నుంచి పుష్ప పుష్ప అంటూ వచ్చిన ఈ ఫస్ట్ సింగిల్లో లిరిక్స్ తోపాటు మ్యూజిక్ కూడా అదిరిపోయింది. ఈ ఒక్క పాటతోనే సీక్వెల్ స్టోరీని కూడా మేకర్స్ చెప్పే ప్రయత్నం చేశారు. ఇక ఇందులో అల్లు అర్జున్ ఒకే ఒక్క స్టెప్పు చూపించినా.. అది ఇన్‌స్టాంట్ హిట్ అయింది. పుష్ప మూవీలోని శ్రీవల్లి సాంగ్ లో బన్నీ వేసిన స్టెప్పులాగే ఇది కూడా వైరల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అల్లు అర్జున్ ఇందులో వేసిన స్టెప్పుతో తనకు మరో పెద్ద పనే పెట్టినట్లు స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా సరదాగా ట్వీట్ చేయడం విశేషం. అతడు తరచూ బన్నీ స్టైల్స్ ను ఇమిటేట్ చేస్తుంటాడు. పుష్ప మూవీ తెలుగు రాష్ట్రాల్లో కంటే నార్త్ లో పెద్ద హిట్ అయింది. దీంతో సీక్వెల్ ను మరో రేంజ్ లో తీయడానికి మేకర్స్ బాగానే కష్టపడుతున్నారు. ఆ మూవీ కంటే ఈ సీక్వెల్ బడ్జెట్ ను భారీగా పెంచేశారు. అటు అల్లు అర్జున్, సుకుమార్ కూడా భారీ రెమ్యునరేషన్లు అందుకున్నారు.

Whats_app_banner