Rashmika Mandanna: విజయ్ దేవరకొండతో రిలేషన్ షిప్ గురించి మరింత క్లారిటీ ఇచ్చిన రష్మిక మంధాన.. తోడు కావాలా కదా?
18 December 2024, 16:17 IST
Rashmika Mandanna: పుష్ప 2 తర్వాత దేశవ్యాప్తంగా రష్మిక మంధాన క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పటికే విజయ్ దేవరకొండతో డేటింగ్‌లో ఉన్న ఈ అమ్మడు.. కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పుకొచ్చింది.
రష్మిక మంధాన, విజయ్ దేవరకొండ
పుష్ప 2 సినిమాతో రష్మిక మంధాన క్రేజ్ మరింత పెరిగింది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ మూవీ డిసెంబరు 5న రిలీజై రికార్డు కలెక్షన్లతో దుమ్ముదులిపేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో మూడు సినిమాలు ఉండగా.. ఇందులో బాలీవుడ్ మూవీస్ రెండు.
కొన్నేళ్లుగా యంగ్ హీరోతో డేటింగ్
రష్మిక మంధాన గత కొన్నేళ్లుగా విజయ్ దేవరకొండతో ప్రేమాయణం నడుపుతోంది. తొలుత బుకాయించిన ఈ జంట.. ఈ మధ్య ఓపెన్‌గా ఒప్పుకుంటోంది. పుష్ప 2 ప్రమోషన్స్ ఈవెంట్‌లో కూడా విజయ్ దేవరకొండతో డేటింగ్‌పై క్లారిటీ ఇచ్చేసిన రష్మిక మంధాన.. తాజాగా మరోసారి తన భాగస్వామికి ఉండాల్సిన క్వాలిటీస్ గురించి పెదవి విప్పింది.
గౌరవానికే ప్రాధాన్యత
‘‘బంధంలో నా మొదటి ప్రాధాన్యత గౌరవానికి ఇస్తాను. ఒకరినొకరు గౌరవించుకున్నప్పుడు కదా బంధం బలంగా ఉంటుంది. ఆ తర్వాత నిజాయితీగా, శ్రద్ధతో ఉండాలి.. అలానే బాధ్యతతో వ్యవహరించాలి. ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తితో నేను ఉండాలనుకుంటున్నాను. నా భాగస్వామికి అటాచ్మెంట్ స్టైల్, కంఫర్ట్ జోన్ లేకపోతే కలిసి ఉండలేము’’ అని రష్మిక మంధాన చెప్పుకొచ్చింది.
తోడు లేకపోతే ఎలా?
‘‘ప్రేమలో ఉండటం అంటే నాకు ఇష్టం. ప్రతి ఒక్కరి జీవితంలో తోడు కావాలి. మనతో ఎవరూ లేకపోతే ఈ జీవితం గడపడంలో అర్థం ఏముంటుంది? నీ ఎత్తుపల్లాలన్నింటినీ చూడడానికి.. నీ పక్కన నిలబడి జీవితాన్ని సెలెబ్రేట్ చేసుకోవడానికి ఎవరో ఒకరు తోడు కావాలి కదా?’’ అని ఈ నేషనల్ క్రష్ నవ్వేసింది.
మూడు సినిమాల్లో రష్మిక
రష్మిక ప్రస్తుతం ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రంలో నటిస్తోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు. అలానే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో సికందర్, విక్కీ కౌశల్‌తో కలిసి చావా సినిమాలో ఆమె నటిస్తోంది. పుష్ప 2 తర్వాత సౌత్‌లోనూ ఈ అమ్మడికి అవకాశాలు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.