తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2 Update: పుష్ప-2 నుంచి క్రేజీ అప్డేట్.. అతిథి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో..!

Pushpa 2 Update: పుష్ప-2 నుంచి క్రేజీ అప్డేట్.. అతిథి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో..!

22 May 2023, 15:42 IST

google News
    • Pushpa 2 Update: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప-2 నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ కీలక పాత్రలో నటించనున్నారని ఫిల్మ్ వర్గాల సమాచారం. అయితే ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
పుష్ప-2లో రణ్‌వీర్ సింగ్
పుష్ప-2లో రణ్‌వీర్ సింగ్

పుష్ప-2లో రణ్‌వీర్ సింగ్

Pushpa 2 Update: భారత్‌లో ప్రస్తుతం సినీ ప్రేక్షకులు ఎక్కువగా ఎదురు చూసే సినిమా పుష్ప-2. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగ జరుగుతోంది. ఇటీవలే ఇందులో విలన్‌గా చేస్తున్న మలయాళ నటుడు ఫహాద్ ఫాజిక్‌కు సంబంధించిన కీలక షెడ్యూల్ పూర్తయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం ఫొటోను కూడా విడుదల చేసింది. తాజాగా పుష్ప-2కు సంబంధించి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఇందులో ఓ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్‌ను తీసుకోనున్నట్లు టాక్.

సుకుమార్ విషయానికొస్తే ఆయన చిత్రాల్లో చిన్న పాత్రలకు కూడా గుర్తుండి పోయే నటులను తీసుకుంటారు. తాజాగా బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌ను పుష్ప-2లో ఓ ప్రత్యేక పాత్ర కోసం తీసుకున్నారని టాక్ నడుస్తోంది. మూవీలో కీలకమైన అతిథి పాత్రను ఆయన చేత చేయించాలని భావిస్తున్నారట. అయితే రణ్‌వీర్ ఆల్రెడీ ఉత్తరాది ప్రేక్షకులకు పోలీసు పాత్రలో తెలుసు. దీంతో పుష్ప-2లోనూ పోలీసు పాత్రలో ఈ బాలీవుడ్ స్టార్ చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ మీడియా వర్గాల్లో సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.

ఇప్పటిలే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప-2కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా సినిమాపై భారీగా హైప్ క్రియేట్ అయింది. పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా రాబోతున్న ఈ మూవీలో రణ్‌వీర్ సింగ్ కేమియో రోల్‌లో కనిపించే వార్త నిజమైతే.. ఈ అంచనాలు మరింత పెరుగుతాయి. ముఖ్యంగా ఉత్తరాది ప్రేక్షకుల నుంచి హైప్ బాగా పెరుగుతుంది. మరోపక్క అల్లు అర్జున్‌తో పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎపిసోడ్ ఇంకా చిత్రీకరించాల్సి ఉంది.

సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేనీ, వై రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఫహాద్ ఫాజిల్, అనసూయ, సునీల్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు.

తదుపరి వ్యాసం