Pushpa 2 Srivalli Death : పుష్ప 2లో శ్రీవల్లి పాత్ర చనిపోతుందా? నిజమేంటి?-rashmika mandanna role srivalli dies in pushpa 2 gossip goes viral in social media ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2 Srivalli Death : పుష్ప 2లో శ్రీవల్లి పాత్ర చనిపోతుందా? నిజమేంటి?

Pushpa 2 Srivalli Death : పుష్ప 2లో శ్రీవల్లి పాత్ర చనిపోతుందా? నిజమేంటి?

Anand Sai HT Telugu
May 21, 2023 06:08 AM IST

Pushpa 2 Srivalli Death : పుష్ప 2 సినిమా గురించిన ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. రష్మిక మందన్న పాత్రలో శ్రీవల్లి ఈ సినిమాలో కనిపించనుంది. అయితే ఆ పాత్ర చనిపోతుందనే న్యూస్ వైరల్ అవుతుంది.

పుష్ప 2
పుష్ప 2

నటి రష్మిక మందన్న(Rashmika mandanna)ను ఓ వర్గం నెటిజన్లు ఎప్పుడూ ట్రోల్ చేస్తూ ఉంటారు. దీనిపై ఆమె కూడా ఘాటుగా స్పందిస్తుంది. కానీ ప్రతిదానికీ ఒక పరిమితి ఉంటుంది. ఇటీవల ఓ ఫొటోను కొంతమంది వైరల్ చేశారు. పుష్ప 2లో శ్రీవల్లి(Sri Valli) పాత్ర చనిపోతుందని చెబుతున్నారు. అయితే ఇందులో నిజమేంత అని తెలుసుకోకుండా చాలా మంది కూడా నమ్మేస్తున్నారు. కొందరు మరో నటి ఫోటోను పోస్ట్ చేసి అది పుష్ప 2(Pushpa 2)లో శ్రీవల్లి పాత్ర అని తప్పుడు వార్తలను ప్రచారం చేశారు. నటి శవంలా పడి ఉన్న ఫోటో ఇది. 'పుష్ప 2' చిత్రంలో కథానాయిక పాత్ర చనిపోతుందని ప్రచారం జరుగుతోంది. ఈ ఫోటో వైరల్‌గా మారింది. కానీ దాని వాస్తవికత వేరు. ఇది మరాఠీ సినిమాలోని ఓ సన్నివేశానికి సంబంధించిన షాట్ అని తెలిసింది. ఆ సీన్‌లో నటించిన నటి.. రష్మిక మందన్నాలా కనిపించడం వల్ల ఇదంతా జరిగిందట. శ్రీవల్లి పాత్ర చనిపోవడానికి(Pushpa 2 Srivalli Death) సంబంధించిన ఫొటో మాత్రం కాదట.

అల్లు అర్జున్‌(Allu Arjun)తో పాటు పుష్ప 2 చిత్రంలో ఫహద్ ఫాసిల్, కన్నడ డాలీ ధనంజయ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళం నుంచి విజయ్ సేతుపతి కూడా ఉంటాడని అంటున్నారు. కథానాయకుడు కొన్ని రోజులకు అడవుల్లోకి వెళ్తాడని.. తర్వాత మళ్లీ వస్తాడని చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ పుకార్లపై చిత్ర బృందం స్పందించలేదు.

'పుష్ప' సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు పుష్ప 2 సినిమా కూడా గ్రాండ్‌గా రెడీ అవుతోంది. మెుదటి పార్ట్ గా దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్స్ ఉన్నారు. అన్ని భాషల్లోనూ సినిమా హిట్ అయింది. దీంతో పుష్ప 2పై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాతో రష్మిక మందన్నకు మంచి పాపులారిటీ వచ్చింది.

టాలీవుడ్‌(Tollywood)లో ఫేమస్ అయిన తర్వాత రష్మిక మందన్న హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆమె ఇప్పటికే సిద్ధార్థ్ మల్హోత్రా, అమితాబ్ బచ్చన్‌లతో స్క్రీన్ షేర్ చేసుకుంది. రణ్‌బీర్‌ కపూర్‌తో 'యానిమల్‌' చిత్రంలో నటిస్తోంది. విక్కీ కౌశల్‌తో ఓ సినిమా చేస్తుంది. ఛత్రపతి శివాజీ కోడలు పాత్రలో రష్మిక కనిపించనుందని సమాచారం. దీంతో పాటు మరో సినిమా చర్చల్లో రష్మిక బిజీగా ఉన్నట్లు సమాచారం. షాహిద్ కపూర్ కొత్త సినిమా అంగీకరించింది.

Whats_app_banner