Fashion trends: స్టైలిష్‌గా అదరగొట్టిన రష్మిక మందన్న
మిషన్ మజ్ను టీమ్‌తో కలిసి సిద్ధార్థ్ మల్హోత్రా, రష్మిక మందన్న తమ మూవీ స్పెషల్ షో తిలకించారు. ఈ కార్యక్రమానికి కియారా అద్వానీ, నోరా ఫతేహి, కరణ్ జోహార్, మృణాల్ ఠాకూర్, రియా చక్రవర్తి, మరికొంత మంది ప్రముఖులు హాజరయ్యారు. వారి ఫ్యాషన్ స్టైల్స్ ఒకసారి మీరూ ఒకసారి చూడండి.
సిద్ధార్థ్ మల్హోత్రా, రష్మిక మందన్నల రాబోయే చిత్రం మిషన్ మజ్ను. చిత్ర నిర్మాతలు ముంబైలో స్పెషల్ షో ప్రదర్శించారు. కియారా అద్వానీ (సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారంలో ఉంది), నోరా ఫతేహి, కరణ్ జోహార్, మనీష్ మల్హోత్రా, మృణాల్ ఠాకూర్, రియా చక్రవర్తి, పలువురు ప్రముఖులు సహా పలువురు బాలీవుడ్ తారలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తారలంతా సాధారణ దుస్తులే ధరించారు. కొందరు మాత్రం తమ స్టైలిష్ డ్రెస్‌తో అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు.
స్టైలిష్‌గా సిద్దార్థ్ మల్హోత్రా, కియార అద్వానీ
పెళ్లి చేసుకోబోతున్న జంట సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ మిషన్ మజ్ను స్క్రీనింగ్‌కు స్టైల్‌గా వచ్చారు. సిద్ధార్థ్ ప్రింటెడ్ షర్ట్, ఫుల్-లెంగ్త్ స్లీవ్‌లతో ఓపెన్ జిప్పర్ జాకెట్, కాంట్రాస్ట్ వైట్ లైనింగ్ ఉన్న బ్లాక్ డెనిమ్ ప్యాంట్ ధరించారు. కియారా ఆల్-వైట్ స్లీవ్‌లెస్ కార్సెట్ ట్యాంక్ టాప్, ప్లీటెడ్ ఫ్లేర్డ్ ప్యాంట్‌లో అద్భుతంగా కనిపించింది. స్లింగ్ బ్యాగ్, హై హీల్స్, సొగసైన కేశాలంకరణ, నో మేకప్ లుక్‌తో కియారా తన దుస్తులను మరింత స్టైలిష్‌గా మార్చేసింది.
తగ్గేదేలే అంటున్న రష్మిక మదన్న
రష్మిక మందన్న మిషన్ మజ్ను స్క్రీనింగ్‌లో ముదురు నీలం రంగు డెనిమ్ బ్రాలెట్, ఆలివ్ గ్రీన్ హై-వెయిస్ట్ ఫ్లేర్డ్ ప్యాంట్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె సొగసైన చైన్, ఆకట్టుకునే చెవిపోగులు, స్టైలిష్ బ్రాస్‌లెట్, బ్లాక్ హీల్స్, న్యూడ్ లిప్ షేడ్, బ్లష్‌డ్ గ్లోయింగ్ స్కిన్, సొగసైన కేశాలంకరణ, మస్కారా అలంకరించిన కనురెప్పలతో ఆకట్టుకుంది.
నోరా పతేహీ
నోరా ఫతేహి పొడవాటి కుర్తీ, చుడీదార్, షిఫాన్ దుపట్టాతో కూడిన తెల్లటి చికంకారీ ఎంబ్రాయిడరీ సూట్ సెట్‌లో సిద్ధార్థ్, రష్మిక మూవీ స్పెషల్ షో కోసం సంప్రదాయంగా వచ్చింది. హీల్స్, టాప్ హ్యాండిల్ మినీ బ్యాగ్, అందమైన చెవిపోగులు, సైడ్ పార్టెడ్ ఓపెన్ ట్రెస్, బ్లష్-టోన్డ్ మేకప్‌తో ఆకట్టుకుంది.
మృణాల్ ఠాకూర్
మృనాల్ ఠాకూర్ ముదురు నీలం రంగులో మోకాలి వరకు ఉండే దుస్తులు ధరించింది. ఫిట్ - ఫ్లేర్డ్ ఫిట్టింగ్, ప్లంగ్ వి నెక్‌లైన్, మల్టీ కలర్డ్ పోల్కా డాట్ ప్రింట్‌తో తన లుక్‌ని సింపుల్‌గా ఉండేలా చేసింది. సైడ్-పార్టెడ్ ఓపెన్ ట్రెసెస్, పింక్ లిప్ షేడ్, బ్లష్డ్ స్కిన్, మస్కారా అలంకరించిన కనురెప్పలు, మైక్రో ఐ షాడో ఆకట్టుకున్నాయి.