Fahadh Faasil Pushpa 2 Still: పుష్ప-2లో ఫహాద్ ఫాజిల్ వర్కింగ్ స్టిల్ రిలీజ్.. కీలక సన్నివేశాల చిత్రీకరణ
Fahadh Faasil Pushpa 2 Still: పుష్ప చిత్రంలో తన నటనతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన నటుడు ఫహాద్ ఫాజిల్. తాజాగా ఈ మూవీకి సీక్వెల్‌గా రానున్న పుష్ప-2కు సంబంధించి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఈ సినిమా సెట్స్ నుంచి ఫహాద్ వర్కింగ్ స్టిల్ విడుదలైంది.
Fahadh Faasil Pushpa 2 Still: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటిస్తున్న పుష్ప-2 కోసం అభిమానులే కాకుండా సగటు సినీ ప్రియులు కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల స్టైలిష్ స్టార్ బర్త్ డే సందర్భంగా విడుదలైన టీజర్‌కు భారీగా రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అల్లు అర్జున్ నటనకు, సుకుమార్ టేకింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. తాజాగా పుష్ప-2 నుంచి మరో సరికొత్త అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్న మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్‌కు(Fahadh Faasil) సంబంధించిన ముఖ్య సన్నివేశాలు పూర్తయ్యయాని తెలిపింది.
పుష్ప చిత్రంలో భన్వర్ సింగ్ షెకావత్‌గా ఫహాద్ ఫాజిల్ అద్భుతంగా చేశారు. ఆయన చెప్పిన పార్టీ లేదా పుష్ప అనే డైలాగ్ బాగా పాపులరైంది. మొదటి భాగంలో ఆయన నిడివి కొంత భాగమే ఉండగా.. పుష్ప-2(Pushpa 2)లో మాత్రం ఎక్కువ సేపు కనిపించనున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఫహాద్ ఫాజిల్‌పై సుకుమార్ కొన్ని కీలక ఘట్టాలను తెరకెక్కించారు. ఇటీవలే ఆ షెడ్యూల్ పూర్తయింది. దీంతో ఆయనకు సంబంధించిన ముఖ్య సన్నివేశాలు పూర్తయినట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సందర్భంగా ఫహాద్ సెట్‌లో ఉన్నప్పటి వర్కింగ్ స్టిల్‌ను విడుదల చేసింది.
"భన్వర్ సింగ్ కీలక సన్నివేశాలు పూర్తయ్యాయని, ఈ సారి ఆయన ప్రతీకారం తీర్చుకోవడానికి రాబోతున్నాడని" చిత్రబృందం వర్కింగ్ స్టిల్‌తో పాటు క్యాప్షన్‌ను జోడించింది. ఇప్పటికే పుష్ప-2లో అల్లు అర్జున్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేశాయి. మూవీపై అంచనాలను భారీగా పెంచేశాయి.
సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేనీ, వై రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఫహాద్ ఫాజిల్, అనసూయ, సునీల్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు.