Fahadh Faasil Top Gear: ఫహాద్ ఫాజిల్ సినిమాకు మాస్ టైటిల్ ఫిక్స్
Fahadh Faasil Top Gear: మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ మరో ప్రయోగాత్మక చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. తెలుగు,,తమిళం,,మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్‌తో పాటు ప్రీ లుక్ పోస్టర్‌ను గురువారం రిలీజ్ చేశారు.
Fahadh Faasil Top Gear: డిఫరెంట్ స్టోరీస్‌తో సినిమాలు చేస్తూ మలయాళంతో పాటు తెలుగు,,తమిళ భాషల ప్రేక్షకులకు చేరువయ్యాడు పహాద్ ఫాజిల్. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలో విలన్‌గా నటించాడు. తొలి భాగంలో కేవలం 30 నిమిషాలు మాత్రమే కనిపించిన అతడు సీక్వెల్‌లో ఫుల్ లెంగ్త్ రోల్‌లో కనిపించబోతున్నట్లు సమాచారం. అలాగే ఇటీవల విడుదలైన కమల్‌హాసన్ విక్రమ్ సినిమాలో స్పెషల్ ఏజెంట్‌గా చక్కటి నటనతో ఆకట్టుకున్నాడు.
తాజాగా ఫహాద్ ఫాజిల్ మరో ప్రయోగాత్మక సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాకు తెలుగు,,తమిళ భాషల్లో టాప్ గేర్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మలయాళంలో హనుమాన్ గేర్ అనే పేరును ఫిక్స్ చేశారు. ఈ చిత్రానికి సుధీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. శుక్రవారం నుంచి టాప్ గేర్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది.
గురువారం ఈ సినిమా ప్రీలుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో జీపుపై నిల్చొని తన చుట్టూ ఉన్నవందలాది మందికి అభయమిస్తూ ఫహాద్ ఫాజిల్ కనిపిస్తున్నాడు. అతడి ముఖం కనిపించకుండా డిఫరెంట్‌గా డిజైన్ చేసిన ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. టాప్ గేర్ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాల్ని త్వరలో వెల్లడించనున్నట్లు నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిల్మ్స్ ప్రకటించింది. సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న 96వ సినిమా ఇది.