Ved Collections: మరాఠీలో రికార్డులు కొల్లగొడుతున్న చై, సామ్ మజిలీ రీమేక్
Ved Collections: మరాఠీలో రికార్డులు కొల్లగొడుతోంది చై, సామ్ నటించిన మజిలీ మూవీ రీమేక్ వేడ్. మరాఠీలో రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా నటించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
Ved Collections: టాలీవుడ్‌లో ఒకప్పుడు చై, సామ్ జంటకు ఉన్న క్రేజ్ ఎంతో మనందరికీ తెలిసిందే. ఏ మాయ చేసావే, మనం, ఆటోనగర్ సూర్య, మజిలీలాంటి సినిమాల్లో వీళ్లు నటించారు. ఒక్క ఆటోనగర్ సూర్య తప్ప మిగతా సినిమాలు మంచి హిట్ అయ్యాయి. అందులోనూ వీళ్ల పెళ్లి తర్వాత చేసిన మజిలీ చై, సామ్ కెరీర్‌లలో స్పెషల్‌గా నిలిచిపోయింది.
ఇప్పుడీ మజిలీ సినిమాను మరాఠీలో వేడ్‌గా తెరకెక్కింది. ఇందులో బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా జంటగా నటించారు. ఈ సినిమా వచ్చిన కొత్తలో టాలీవుడ్ ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. చాలా మంది సోషల్ మీడియాలో వేడ్ మూవీని, అందులో జెనీలియా క్యారెక్టర్‌ను హేళన చేస్తూ ఎన్నో మీమ్స్ క్రియేట్ చేశారు.
అయితే ఈ వేడ్ సినిమా మరాఠీ ప్రేక్షకులకు మాత్రం బాగానే నచ్చింది. తాజాగా ఈ మూవీ కలెక్షన్లు చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. వేడ్ మూవీ ఇప్పుడు మరాఠీలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఇప్పుడు రెండోస్థానంలో నిలిచింది. మూడు వారాల్లో రూ.44 కోట్లు వేడ్ వసూలు చేయడం విశేషం. ఇప్పుడీ సినిమా జోరు చూస్తుంటే.. రూ.70 కోట్ల వరకూ వెళ్తుందని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం మరాఠీలో సైరాట్ మూవీ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఉంది. ఈ మూవీని బాలీవుడ్‌లో ధడక్ పేరుతో తీసిన విషయం తెలిసిందే. సైరాట్ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.110 కోట్ల వరకూ వసూలు చేసింది. ఇక వేడ్ సినిమా విషయానికి వస్తే ఇందులో సమంత క్యారెక్టర్‌లో జెనీలియా, నాగచైతన్య క్యారెక్టర్‌లో రితేష్ దేశ్‌ముఖ్ కనిపించారు.
సంబంధిత కథనం