తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ram Charan: రామ్ చరణ్-శంకర్ సినిమా ఆగిపోయిందా? ఏం జరిగింది?

Ram Charan: రామ్ చరణ్-శంకర్ సినిమా ఆగిపోయిందా? ఏం జరిగింది?

10 August 2022, 11:21 IST

    • రామ్ చరణ్-శంకర్ సినిమా ఆగిపోయిందా అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ వర్గాలు. ఎందుకంటే ఇండియన్ 2 సినిమా తిరిగి ప్రారంభించనున్న కారణంగా తాత్కాలికంగా ఈ సినిమా నిలిపివేసినట్లు సమాచారం.
రామ్ చరణ్
రామ్ చరణ్ (Twitter)

రామ్ చరణ్

లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా, శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఇండియన్ 2 సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా తిరిగి పునఃప్రారంభం కాబోతున్నట్లు సదరు చిత్రంలో నటిస్తోన్న కాజల్ అగర్వాల్ స్పష్టం చేసింది. దీంతో సినిమా తిరిగి ప్రారంభం కావడానికి అన్నీ ఏర్పాట్లు శరవేగంగా చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం శంకర్.. రామ్ చరణ్‌తో తీస్తున్న సినిమా తాత్కాలికంగా కొంతకాలం పాటు నిలిపివేయనున్నారని ఫిల్మ్ వర్గాల సమాచారం.

ట్రెండింగ్ వార్తలు

Samantha: ‘అది ఫేక్’: సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమంత ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..

Chitram Choodara OTT: నేరుగా ఓటీటీలోకి వస్తున్న వరుణ్ సందేశ్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Aditya Kapur Ananya Panday: బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆదిత్య కపూర్, అనన్య పాండే బ్రేకప్ చేసుకున్నారా? వివరాలివే

Aa Okkati Adakku Collections: బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్కటి అడక్కు మూవీ జోరు.. తొలి రోజు కంటే రెండో రోజు ఎక్కువగా..

ఇప్పటికే శంకర్.. ఇండియన్ 2 సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ పనులను పర్యవేక్షిస్తున్నారట. అంతేకాకుండా షూటింగ్ షెడ్యూల్స్‌కు సంబంధించి బిజీగా ఉన్నారట. ఈ కారణంగా రామ్ చరణ్‌తో సినిమా రెండు నెలల పాటు నిలిపివేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో కమల్‌తో ఇండియన్ 2కు సంబంధించిన పలు కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లు ఫిల్మ్ వర్గాల సమాచారం.

ప్రస్తుతం రామ్ చరణ్.. శంకర్‌తో సినిమా మినహా మరే చిత్రానికి పచ్చజెండా ఊపలేదు. ఈ సినిమా తాత్కాలికంగా నిలిపివేయడంతో తన ఫ్యూచర్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు చరణ్. ఇందుకోసం కొత్త కథలను వినేందుకు ఆసక్తి చూపుతున్నారట. చాలా మంది దర్శకులు ఆయనతో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో రామ్ చరణ్ తర్వాతి ప్రాజెక్టు ఎవరితో చేయబోతున్నారనేదానిపై ఆసక్తి నెలకొంది.

ఇప్పటికే రామ్ చరణ్.. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు గౌతమ్.. స్క్రిప్టు వర్క్‌ను సిద్ధం చేస్తున్నారు. చరణ్‌కు ఇప్పటికే బేసిక్ స్టోరీ లైన్ వినిపించారట. ఇది కాకుండా చరణ్ ఇతర దర్శకులతో కథా చర్చల కోసం సిద్ధపడుతున్నారని తెలుస్తోంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.