Ram Charan: రామ్ చరణ్, శంకర్ సినిమా కోసం అదిరిపోయే ట్యూన్స్ రెడీ అంటున్న తమన్....-thaman shares rc15 music composition pics ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Thaman Shares Rc15 Music Composition Pics

Ram Charan: రామ్ చరణ్, శంకర్ సినిమా కోసం అదిరిపోయే ట్యూన్స్ రెడీ అంటున్న తమన్....

HT Telugu Desk HT Telugu
Jun 25, 2022 06:58 AM IST

రామ్‌చ‌ర‌ణ్ హీరోగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ పాన్ ఇండియ‌న్ సినిమా రూపొందుతోంది. పొలిటిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ మొద‌లుపెట్టిన‌ట్లు త‌మ‌న్ పేర్కొన్నాడు.

శంకర్, తమన్
శంకర్, తమన్ (twitter)

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ చిత్రం న‌టుడిగా రామ్ చ‌ర‌ణ్ ను మ‌రో మెట్టు ఎక్కించింది. అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో అద్వితీయ నటనతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్నారు రామ్‌చ‌ర‌ణ్‌. అత‌డి కెరీర్‌లో ఓ మైలురాయిగా ఈ సినిమా నిలిచింది. ప్ర‌స్తుతం భారీ చిత్రాల ద‌ర్శ‌కుడు శంక‌ర్‌తో రామ్‌చ‌ర‌ణ్ ఓ సినిమా చేయ‌బోతున్నారు. పొలిటిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. రజనీకాంత్ 2.ఓ సక్సెస్ త‌ర్వాత శంక‌ర్ రూపొందిస్తున్న సినిమా ఇది. రామ్ చరణ్, శంకర్ కలయికలో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీగా అంచ‌నాలు నెలకొన్నాయి.

ఇందులో రామ్‌చ‌ర‌ణ్ డ్యూయ‌ల్ షేడ్స్ ఉన్న క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ జోరుగా సాగుతున్నట్లు త‌మ‌న్ పేర్కొన్నాడు. త‌న మ్యూజిక్ స్టూడియోలో ద‌ర్శ‌కుడు శంక‌ర్‌తో ముచ్చ‌టిస్తున్న ఓ ఫొటోను త‌మ‌న్ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు. ద‌ర్శ‌కుడు శంక‌ర్ సార‌థ్యంలో ఆర్ సీ 15 కంపోజిష‌న్స్ జ‌రుగుతున్నాయ‌ని, రామ్‌చ‌ర‌ణ్‌తో ఇప్ప‌టివ‌ర‌కు తాను సాగించిన ప్ర‌యాణం అద్భుత‌మంటూ ట్వీట్ చేశాడు. శంక‌ర్ సినిమాల్లో పాట‌ల‌న్నీ శ్రోత‌ల‌ను అల‌రిస్తుంటాయి. అదే త‌ర‌హాలో ఈ సినిమాకు సూప‌ర్ ట్యూన్స్‌ను సిద్ధం చేస్తున్న‌ట్లు స‌మాచారం.

ఇందులో రామ్‌చ‌ర‌ణ్‌కు జోడీగా కియారా అద్వాణీ న‌టిస్తోంది. శ్రీకాంత్‌, న‌వీన్‌చంద్ర‌, అంజ‌లి కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. ఈ పాన్ ఇండియ‌న్ సినిమాను తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రామ్ చ‌ర‌ణ్ హీరోగా న‌టిస్తున్న 15వ సినిమా ఇది. శంక‌ర్ సినిమా త‌ర్వాత గౌత‌మ్ తిన్న‌నూరి ప్రాజెక్ట్ ను మొద‌లుపెట్ట‌బోతున్నాడు రామ్‌చ‌ర‌ణ్‌. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్