తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mukesh Khanna: “అమ్మాయి సెక్స్ కావాలని అడిగితే.. ఆమె ఆ బిజినెస్ చేస్తున్నట్లే”

Mukesh Khanna: “అమ్మాయి సెక్స్ కావాలని అడిగితే.. ఆమె ఆ బిజినెస్ చేస్తున్నట్లే”

10 August 2022, 9:05 IST

    • శక్తిమాన్ ఫేమ్ ముఖేశ్ ఖన్నా మహిళల జీవితాలపై బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరైనా అమ్మాయి అబ్బాయిని సెక్స్ కావాలని అడిగితే తాను బిజినెస్ చేస్తుందని అనుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
ముఖేశ్ ఖన్నా
ముఖేశ్ ఖన్నా (HT)

ముఖేశ్ ఖన్నా

ముఖేశ్ ఖన్నా అంటే మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. అదే శక్తిమాన్ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. ముఖ్యంగా 90వ దశకంలో పుట్టిన వారికి ఈ పేరు ఎంతో సుపరిచితం. బుల్లితెరపై కనిపించిన ఇండియన్ మొదటి సూపర్ హీరో ఎవరైనా ఉన్నారంటే అది శక్తిమాన్. ఓ తరం పిల్లలను ఈ పాత్ర బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే అందులో అతిశయేక్తి లేదు. ఇప్పటికీ ఆ పాత్ర పోషించిన ముఖేష్ ఖన్నా టీవీలోనో, పేపర్లోనే కనిపిస్తే శక్తిమాన్ అంటూ కేరింతలు పెడతారు. తాజాగా ముఖేశ్ ఖన్నా తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. అమ్మాయి బహిరంగంగా ఎవరైనా అబ్బాయిని సెక్స్ కావాలని అడిగితే.. ఆమె అమ్మయే కాదని.. ఆ బిజినెస్(Sex Rocket) నిర్వహిస్తోందని అర్థం చేసుకోవాలని స్పష్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Kiara Advani: గేమ్‍ ఛేంజర్ ‘జరగండి’ పాటపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెెప్పిన కియారా.. ఈ సాంగ్‍కు ఎన్ని రోజుల షూటింగ్ అంటే..

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

ముఖేశ్ ఖన్నా ఇటీవలే తన యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో మహిళల సెక్స్, సోషల్ మీడియా పోస్టుల గురించి కొన్ని విషయాలను ఆసక్తికర పంచుకున్నారు. కొంతమంది అమ్మాయిలు సోషల్ మీడియా ద్వారా శృంగారంలో పాల్గొనడానికి వారిని ఆహ్వానించడం ద్వారా అమాయక పురుషులను ఆకర్షిస్తున్నారని తెలిపారు.

"ఇప్పుడు ఎవరైనా అమ్మాయి, ఓ అబ్బాయిని సెక్స్ కావాలని అడిగినట్లయితే మొదట ఆమె అమ్మాయి కాదని తెలుసుకోవాలి. తను వాస్తవానికి ఓ సెక్స్ రాకెట్ నడిపిస్తోందని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నాగరిక సమాజంలోని మంచి అమ్మాయి ఇలాంటి మాటలు బహిరంగంగా ఎప్పుడూ మాట్లాడదు. మీకు అలాంటి మెసేజుల వాట్సాప్, ఫోన్లు, సోషల్ మీడియాలో వస్తే వాటిని నమ్మకండి. నిజంగా ఆ మెసేజులను అమ్మాయి పంపుతున్నప్పటికీ ఆమె సెక్స్ రాకెట్ నడుపుతోందని తెలుసుకోవాలి." అని ముఖేష్ ఖన్నా స్పష్టం చేశారు.

స్త్రీలు ఇలాంటి మాటలు బహిరంగంగా మాట్లాడితే సమాజం పతనమైనట్లేనని ముఖేశ్ ఖన్నా తెలిపారు. గతంలో మహిళలకు మాత్రమే నో చెప్పే హక్కు ఉండేదని, ఇప్పుడు పురుషులకు కూడా నో చెప్పే అధికారముందని స్పష్టం చేశారు.

మన శక్తిమాన్ పోస్ట్ చేసిన ఈ వీడియోపై సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు. శక్తిమాన్ అద్భుతమైన లాజిక్ చెప్పాడని ఓ యూజర్ పోస్ట్ చేయగా.. ఏ అమ్మాయి తనతో ఈ విధంగా అనలేదని, కాబట్టి అతడు జీవితాంతం ఓ మాయలో ఉండటం గొప్పే ఇంకో యూజర్ తెలిపారు. మరో యూజర్ శక్తిమాన్ సిరీయల్‌లో ఫేమస్ డైలాగ్ అంధేరా కాయం రహే(చీకటి ప్రబలంగా ఉండవచ్చు) అనే లైన్‌ను పోస్ట్ చేశాడు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం