Ram Charan | నెట్టింట రామ్ చరణ్‌పై ప్రశంసల వర్షం.. ఎందుకో తెలుసా?-kadambari kiran praised ram charan for halping baby girl ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ram Charan | నెట్టింట రామ్ చరణ్‌పై ప్రశంసల వర్షం.. ఎందుకో తెలుసా?

Ram Charan | నెట్టింట రామ్ చరణ్‌పై ప్రశంసల వర్షం.. ఎందుకో తెలుసా?

HT Telugu Desk HT Telugu
Apr 13, 2022 12:42 PM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌పై నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది. ఓ పాప కోసం ఆర్థిక సహాయం చేయడమే కాకుండా ఆమె యోగా క్షేమాలను ఆరా తీయడంపై అభినందిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాదంబరి కిరణ్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.

రామ్ చరణ్
రామ్ చరణ్ (AFP)

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టినప్పటికీ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రామ్ చరణ్. నటన విషయంలోనే కాదు సామాజిక సేవలోనూ తండ్రితో పోటీపడుతున్నారు మన చరణ్. గతంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బిడ్డ ఆసుపత్రిలో ఉండే చరణ్ పూర్తిగా బిల్లు కట్టి ఆదుకున్నారు. ఈ విషయం సదరు జానీ మాస్టర్‌నే తెలిపారు. తాజాగా మరోసారి తన సేవాగుణంతో వార్తల్లో నిలిచారు రామ్ చరణ్. ఈ విషయాన్ని ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ కాదంబరి కిరణ్ చెప్పారు.

"మనకు తెలిసి రామ్ చరణ్ మన మెగాస్టార్ తనయుడు, స్టార్ హీరో నేను తెలుసుకున్నా..ఆయన అంతకంటే పెద్ద మనసున్న మనిషని భక్తి , ప్రేమ, గౌరవం..ఇలాంటి విలువలు తెలిసిన మనిషి. సాటి మనిషిని మనిషిగా చూసే వ్యక్తిత్వం అతనిది. గతంలో ఓ అసిస్టెంట్ డెరెక్టర్ భార్య చనిపోతే ఆసుపత్రి ఖర్చులకు, ఆ బిడ్డ సంక్షణార్థం సుకుమార్ అన్న చొరవతో రామ్ చరణ్‌ను సాయం అడిగి రూ.2 లక్షలు తీసుకుని మనం సైతం ద్వారా ఆ కార్యక్రమం పూర్తి చేశాను. అవి కాకుండా సుక్కన్న, మనం సైతం, విజయ్ అన్న, రాము తదితరుల వద్ద లక్షా 20 వేలు పోగుచేసి చనిపోయిన మహిళ పాప పేరున ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశాను. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత నేను ఎదురుపడితే రామ్ చరణ్ ఆ పాప ఎలా ఉంది అని అడిగారు?. అతని వ్యక్తిత్వానికి నాకు గుండె నిండిపోయింది బంగారు చెంచాతో పుట్టడం వేరు, బంగారు మనస్సుతో బతకడం వేరు. ప్రియమైన చరణ్ మీకు భగవదాశీస్సులు." అని కాదంబరి కిరణ్ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.

ఈ ట్వీట్‌పై నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. రామ్ చరణ్ గొప్ప మనస్సుకు ఫిదా అవుతున్నారు. సాయం చేశామా లేదా అన్నట్లు కాకుండా గుర్తుపెట్టుకుని మరి వారి యోగక్షేమాలు అడిగిన చరణ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గోల్డెన్ హార్ట్ అంటూ చరణ్‌ను పొగుడుతున్నారు. తండ్రికి తగిన తనయుడు అంటూ మరోకరు స్పందించారు.

ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన రామ్ చరణ్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో తన తర్వాతి చిత్రాన్ని చేస్తున్నారు. అమృత్ సర్ షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సినిమాలో కియరా అద్వానీ, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్