తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rajinikanth: సగర్వంగా జాతీయ జెండాను ఎగురవేయండి.. రజినీ పిలుపు

Rajinikanth: సగర్వంగా జాతీయ జెండాను ఎగురవేయండి.. రజినీ పిలుపు

13 August 2022, 20:33 IST

    • సూపర్ స్టార్ రజినీ కాంత్.. 75వ స్వాతంత్ర్య దినోత్సవానికి గుర్తుగా హర్ ఘర్ తిరంగా ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా పోస్ట్ పెట్టారు.
రజినీ కాంత్
రజినీ కాంత్ (Twitter)

రజినీ కాంత్

75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ప్రచారం ఊపందుకుంది. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును అందరూ స్వాగతించాలని, ప్రతి ఒక్కరూ ఈ విధానాన్ని ఆచరించాలని సర్వత్రా క్యాంపైన్ నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో సూపర్ స్టార్ రజినీ కాంత్ కూడా చేరిపోయారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులను గుర్తు చేసుకుంటూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఆయన కోరారు. ట్విటర్ వేదికగా ఈ మేరకు పోస్టు పెట్టారు.

ట్రెండింగ్ వార్తలు

Prabhas: ప్ర‌భాస్ చేతుల మీదుగా మొద‌లై రిలీజ్ కానీ దీపికా ప‌డుకోణ్ ఫ‌స్ట్ స్ట్రెయిట్ తెలుగు మూవీ ఏదో తెలుసా!

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలోకి 10 సినిమాలు.. కచ్చితంగా చూడాల్సినవి 3 మాత్రమే.. ఎక్కడ చూస్తారంటే?

Abhay Movie: థియేట‌ర్ల‌లో రిలీజైన 23 ఏళ్ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చిన క‌మ‌ల్‌హాస‌న్ సైకో థ్రిల్ల‌ర్ మూవీ!

Brahmamudi May 18th Episode: బ్రహ్మముడి- కిడ్నాపర్ల నుంచి బయటపడిన కావ్య.. భార్యను కొట్టబోయిన రాజ్.. మరదలిపై ఫైర్

"భారత దేశానికి ఇది 75వ స్వాతంత్ర్య దినోత్సవం. మన మాృతభూమి స్వేచ్ఛ కోసం నిస్వార్థం తమ జీవితాలను త్యాగం చేసిన వేలాది మంది ప్రజలందరికీ, ఎనలేని పోరాటాలు, కష్టాలు, బాధలు లక్షలాది ప్రజల గౌరవ సూచకంగా నివాళులర్పిద్దాం. అంతేకాకుండా ఐక్యతకు చిహ్నంగా స్వాతంత్ర్య సమరయోధులు, అమరవీరులు, నాయకులందరినీ సత్కరించి కృతజ్ఞతాపూర్వకంగా నివాళులర్పిద్దాం. కుల, మత, రాజకీయాలకు అతీతంగా, మన భారతీయ జెండాను రేపటి తరం చిన్నారులు, యువకులు గర్వపడేలా అందజేద్దాం. ఇళ్లు, కార్యాలయాలు, పని ప్రదేశాల వెలుపల జెండాను ఎగురవేస్తూ 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని సగర్వంగా జరుపుకుందాం. స్వాతంత్ర్య పోరాట వీరులకు సెల్యూట్ చేస్తూ మన జాతీయ జెండా ప్రతిచోటా రెపరెప లాడిద్దాం. హై హింద్" అటూ రజినీ కాంత్ ట్విటర్ వేదికగా కోరారు.

రజినీకాంత్ ఇప్పటికే తన ట్విటర్ ఖాతా డీపీని జాతీయ జెండా ఉండేట్లు మార్చారు. తాజాగా ఆయన ఇచ్చిన సందేశానికి ప్రజలు, అభిమానులు విపరీతంగా స్పందిస్తున్నారు. రజినీతో పాటు మోహన్ లాల్, అనుపమ్ ఖేర్, అక్షయ్ కుమార్, కంగనా రనౌత్, ఆమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ తదితరులు తమ ఇళ్ల వద్ద త్రివర్ణ పతాకాలను ఎగురవేశారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం