Rajinikanth| కొత్త సినిమాను ప్రకటించిన రజినీ.. సంచలన దర్శకుడితో ప్రాజెక్ట్ పక్కా-rajinikanth 169 movie official announcement and directed by belson dileep kumar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rajinikanth| కొత్త సినిమాను ప్రకటించిన రజినీ.. సంచలన దర్శకుడితో ప్రాజెక్ట్ పక్కా

Rajinikanth| కొత్త సినిమాను ప్రకటించిన రజినీ.. సంచలన దర్శకుడితో ప్రాజెక్ట్ పక్కా

HT Telugu Desk HT Telugu
Feb 11, 2022 07:44 AM IST

రజినీకాంత్ తన కొత్త సినిమాను షురూ చేశారు. డాక్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన నెల్సన్ దిలీప్ కుమార్‌తో ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడించనున్నారు.

రజినీకాంత్
రజినీకాంత్ (twitter)

పెద్దన్న సినిమా తర్వాత కొద్దిగా విరామం తీసుకున్న సూపర్‌స్టార్ రజినీకాంత్ ఇకపై సినిమాలు తీయరని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చ జరిగింది. పలువురు పెద్ద దర్శకులతో సినిమా చేయబోతున్నారనే వార్తలు కూడా వినిపించాయి. తాజాగా వీటిన్నింటికి ఫుల్‌స్టాప్ పెడుతూ తన కొత్త సినిమాను ప్రకటించారు రజినీ. శివకార్తికేయన్‌తో డాక్టర్ లాంటి సూపర్ హిట్‌ను తెరకెక్కించిన సంచలన దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్‌తో నూతన చిత్రాన్ని ప్రారంభించారు. ఈ విషయాన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసింది.

ఇందులో రజినీకాంత్‌తో పాటు దర్శకుడు నెల్సన్, సంగీత దర్శకుడు అనిరుధ్ స్టైలిష్‌ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు రజినీ నటించనున్న 169వ చిత్రం. ఏప్రిల్‌లో పూజా కార్యక్రమాలు నిర్వహించి, మే నెలలో చిత్రీకరణ మొదలుపెట్టనున్నారు.

కోలీవుడ్‌లో విభిన్న కథా చిత్రాల దర్శకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్‌కు మంచి పేరుంది. నయనతారతో తెరకెక్కించిన కొలమావు కోకిల సూపర్‌హిట్ అయింది. మొదటి చిత్రమే ఘన విజయం సాధించడంతో రెండో సినిమా శివకార్తికేయన్‌తో డాక్టర్ తెరకెక్కించారు. ఈ సినిమా కూడా గతేడాది విడుదలై అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. దీని తర్వాత విజయ్‌తో బీస్ట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది విడుదల కానుంది. తాజాగా ఆయన తన నాలుగో చిత్రాన్ని ఏకంగా సూపర్‌స్టార్ రజినీకాంత్‌తోనే పనిచేసే అవకాశాన్ని కొట్టేశారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం