Rajinikanth: రజనీకాంత్ లాల్ సలామ్ ఓటీటీ రిలీజ్ లేనట్లే? - తెలుగులోనూ డైరెక్ట్‌గా టీవీలోనే టెలికాస్ట్
17 December 2024, 6:06 IST
Rajinikanth: రజనీకాంత్ లాల్ సలామ్ తెలుగు, తమిళ వెర్షన్స్ త్వరలో టీవీలో టెలికాస్ట్ కాబోతున్నట్లు సమాచారం. ఈ స్పోర్ట్స్ యాక్షన్ మూవీ శాటిలైట్ రైట్స్‌ను సన్ నెట్‌వర్క్ సొంతం చేసుకున్నది. న్యూ ఇయర్ లేదా పొంగల్‌కు రజనీకాంత్ మూవీ టీవీలోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
రజనీకాంత్
Rajinikanth: రజనీకాంత్ లాల్ సలామ్ మూవీ థియేటర్లలో రిలీజై పది నెలలు దాటింది. ఇప్పటివరకు ఓటీటీలో రిలీజ్ కాలేదు. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీ డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. థియేటర్లలో మూవీ డిజాస్టర్ కావడం, రజనీకాంత్ నటించిన సీన్స్ తాలూకు హార్డ్ డిస్క్ మిస్సయినట్లు డైరెక్టర్ ఐశ్వర్య రజనీకాంత్ చెప్పడం లాంటి అంశాల కారణంగా ఓటీటీ రిలీజ్ డిలే అవుతూ వచ్చింది.
ఇటీవలే హిందీలో...
ఓటీటీ కంటే ముందే లాల్ సలామ్ హిందీ వెర్షన్ ఇటీవల టీవీలోప్రీమియర్ అయ్యింది.లాల్ సలామ్ హిందీ వెర్షన్ డిసెంబర్ 14న జీ సినిమా ఛానెల్‌లో, డిసెంబర్ 15న జీ జీవీలో టెలికాస్ట్ అయ్యింది. తాజాగా తమిళం, తెలుగు భాషల్లో కూడా తొందరలోనే ఈ మూవీ టీవీల్లోకి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సన్ నెట్‌వర్క్...
ఈ సినిమా దక్షిణాది భాషల శాటిలైట్ రైట్స్‌ను సన్ నెట్‌వర్క్ సంస్థ సొంతం చేసుకున్నది. హిందీ ప్రీమియర్ నేపథ్యంలో తెలుగు, తమిళ భాషల్లో లాల్ సలామ్ మూవీని టెలికాస్ట్ చేయాలని సన్ నెట్‌వర్క్ సంస్థ నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. న్యూ ఇయర్ లేదంటే పొంగల్‌కు రజనీకాంత్ మూవీ టీవీలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు. త్వరలోనే లాల్ సలామ్ తెలుగు ప్రీమియర్‌పై క్లారిటీ రానున్నట్లు సమాచారం. జెమిని టీవీలో ఈ మూవీ టెలికాస్ట్ కానున్నట్లు సమాచారం.
లైకా ప్రొడక్షన్స్...
లాల్ సలామ్ మూవీకి రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించింది. ఈ సినిమాలో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటించారు. లైకా ప్రొడక్షన్ సంస్థ ప్రొడ్యూస్ చేసింది. దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 17 కోట్ల లోపే కలెక్షన్స్ రాబట్టింది. తెలుగు వెర్షన్ కోటి కూడా వసూళ్లను దక్కించుకోలేకపోయింది.
రజనీకాంత్ రీసెంట్ మూవీస్‌లో అతి తక్కువ కలెక్షన్స్ దక్కించుకున్న సినిమాగా లాల్ సలామ్ చెత్త రికార్డ్‌ను మూటగట్టుకుంది. లాల్ సలామ్ మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు. ఈ క్రికెట్ బ్యాక్‌డ్రాప్ మూవీలో టీమిండియా మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ గెస్ట్ పాత్రలో కనిపించాడు. సీనియర్ హీరోయిన్లు జీవిత, నిరోషా కీలక పాత్రల్లో నటించారు.
లోకేష్ కనగరాజ్ కూలీ...
ఇటీవలే వేట్టయన్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు రజనీకాంత్ టీజే జ్ఞానవేళ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో కూలీ మూవీ చేస్తోన్నాడు రజనీకాంత్. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీలో ఆమిర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.