Gemini Tv Serials: ఒకేరోజు జెమిని టీవీలో రెండు కొత్త సీరియ‌ల్స్ షురూ - బిగ్‌బాస్ కీర్తీ భ‌ట్ సీరియ‌ల్ టైటిల్ ఇదే!-radha and moodu mullu telugu tv serials to telecast on gemini from today onwards ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gemini Tv Serials: ఒకేరోజు జెమిని టీవీలో రెండు కొత్త సీరియ‌ల్స్ షురూ - బిగ్‌బాస్ కీర్తీ భ‌ట్ సీరియ‌ల్ టైటిల్ ఇదే!

Gemini Tv Serials: ఒకేరోజు జెమిని టీవీలో రెండు కొత్త సీరియ‌ల్స్ షురూ - బిగ్‌బాస్ కీర్తీ భ‌ట్ సీరియ‌ల్ టైటిల్ ఇదే!

Nelki Naresh Kumar HT Telugu
Sep 30, 2024 01:30 PM IST

Gemini Tv Serials: జెమిని టీవీలో సోమ‌వారం (నేటి) నుంచి రెండు కొత్త సీరియ‌ల్స్ మొద‌లుకానున్నాయి. రాధ‌, మూడుముళ్లు సీరియ‌ల్స్ బుల్లితెర ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. రాధ సీరియ‌ల్‌లో కీర్తి భ‌ట్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోండ‌గా...మూడుముళ్లు సీరియ‌ల్‌లో శ్రీదివ్య‌, ఆకాష్ జంట‌గా క‌నిపించ‌బోతున్నారు.

జెమిని టీవీ సీరియ‌ల్స్‌
జెమిని టీవీ సీరియ‌ల్స్‌

Gemini Tv Serials: ఒకే రోజు రెండు కొత్త సీరియ‌ల్స్‌ను ప్రారంభించి బుల్లితెర ఆడియెన్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేయ‌బోతున్న‌ది జెమిని టీవీ. సెప్టెంబ‌ర్ 30 సోమ‌వారం (నేటి) నుంచి జెమిని టీవీలో రాధ‌, మూడుముళ్లు సీరియ‌ల్స్ టెలికాస్ట్ కాబోతున్నాయి. రాధ సీరియ‌ల్ సోమ‌వారం నుంచి శ‌నివారం వ‌ర‌కు రాత్రి ఎనిమిదిన్న‌ర గంట‌ల నుంచి తొమ్మిది గంట‌ల వ‌ర‌కు టెలికాస్ట్ కానుంది. ఈ సీరియ‌ల్‌లో బిగ్‌బాస్ బ్యూటీ కీర్తి భ‌ట్ టైటిల్ రోల్‌లో క‌నిపించ‌బోతున్న‌ది.

రాధ క‌థ ఇదే...

ఖుషి చిన్న‌త‌నంలోనే త‌ల్లికి దూర‌మ‌వుతుంది. అమ్మ‌ జ్ఞాపకాలు లేకుండా పెరుగుతుంది. అమ్మ ప్రేమ‌ను పొందాలని ఆరాటపడే ఖుషి జీవితంలోకి అనుకోకుండా రాధ వ‌స్తుంది.త‌న‌కు దూర‌మైన అమ్మ‌ను గుర్తుచేస్తుంది. రాధే తనకి అమ్మలా రావాలని ఖుషి పట్టు పడుతుంది . మరి రాధ ఖుషి కి అమ్మ కాగలిగిందా? రాధ ఎన్ని ఒడిదుడుకులని ఎదుర్కొంది? దేవుడు తనకి ఇచ్చిన బాధ్యతనిఎలా నిర్వర్తించింది ? అన్న‌దే రాధ మూవీ క‌థ‌.

నాలుగో సీరియ‌ల్‌...

తెలుగులో కీర్తిభ‌ట్ న‌టిస్తోన్న నాలుగో సీరియ‌ల్ ఇది. రాధ కంటే ముందు మ‌న‌సిచ్చి చూడు, కార్తీక దీపం, మ‌ధురాన‌గ‌రిలో సీరియ‌ల్స్ చేసింది కీర్తిభ‌ట్‌. బిగ్‌బాస్ సీజ‌న్ 6లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న కీర్తిభ‌ట్ సెకండ్ ర‌న్న‌ర‌ప్‌గా నిలిచింది.

మూడుముళ్లు సీరియ‌ల్‌...

రాధ‌తో పాటు సోమ‌వారం నుంచి ప్రారంభంకానున్న మ‌రో సీరియ‌ల్ మూడుముళ్లు రాత్రి తొమ్మిది గంట‌ల నుంచి తొమ్మిదిన్న‌ర వ‌ర‌కు టెలికాస్ట్ కాబోతోంది. మూడుముళ్లు సీరియ‌ల్‌లో శ్రీదివ్య‌, ఆకాష్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తోన్నారు.

మూడుముళ్లు సీరియ‌ల్ క‌థ ఇదే...

పల్లెపాలెం అనే ఒక చిన్న గ్రామంలో నీల‌వేణి ఇద్దరు చెల్లెళ్లే తన ప్రపంచంగాబతుకుతుంటుందిమూడు ముళ్ళు వేసేవాడు తన జీవితంలోకి వస్తేతన చెల్లెళ్ల జీవితాలు ఏమైపోతుందో అనుకుని పెళ్లే వద్దనుకుంటుంది.అలాంటి నేలవేణి జీవితంలోకి తన ప్రమేయమే లేకుండా ఓ వ్యక్తి ప్రవేశిస్తాడు.

ఆమె మెడలో మూడు ముళ్ళు వేస్తాడు?తనది కాని ప్రపంచంలోకి ఏడు అడుగులు వేసిన నీలవేణికి అడుగడుగునా సమస్యలే ఎదుర‌వుతాయి? ఆ స‌మ‌స్య‌ల‌ను నీల‌వేణి ఎలా ఎదుర్కొంది? భిన్న మ‌న‌స్త‌త్వాలు క‌లిగిన ఆ జంట కాపురం ఎలా సాగింది అన్న‌దే మూడుముళ్లు సీరియ‌ల్ క‌థ‌.

మూడు సీరియ‌ల్స్‌కు శుభంకార్డ్‌...

ఇటీవ‌లే జెమిని టీవీలో నువ్వే కావాలి అనే కొత్త సీరియ‌ల్ మొద‌లైంది. కొత్త సీరియ‌ల్స్ కోసం మూడు పాత సీరియ‌ల్స్‌కు జెమిని టీవీ త్వ‌ర‌లో ముగింపు ప‌ల‌క‌బోతుంది. ఆ ఒక్క‌టీ అడ‌క్కు, శ్రావ‌ణ సంధ్య‌, ఒంట‌రిగులాబీ సీరియ‌ల్స్‌కు త్వ‌ర‌లోనే ఎండ్‌కార్డ్ ప‌డ‌నుంది.