Kannada Bigg Boss: క‌న్న‌డ బిగ్‌బాస్‌లో తెలుగు సీరియ‌ల్ యాక్ట‌ర్స్ - కంటెస్టెంట్‌గా వంట‌ల‌క్క సీరియ‌ల్ హీరో ఎంట్రీ!-telugu serial actress shishir shastry bhavya gowda and aishwarya shindogi enters bigg boss kannada 11 as contestents ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kannada Bigg Boss: క‌న్న‌డ బిగ్‌బాస్‌లో తెలుగు సీరియ‌ల్ యాక్ట‌ర్స్ - కంటెస్టెంట్‌గా వంట‌ల‌క్క సీరియ‌ల్ హీరో ఎంట్రీ!

Kannada Bigg Boss: క‌న్న‌డ బిగ్‌బాస్‌లో తెలుగు సీరియ‌ల్ యాక్ట‌ర్స్ - కంటెస్టెంట్‌గా వంట‌ల‌క్క సీరియ‌ల్ హీరో ఎంట్రీ!

Nelki Naresh Kumar HT Telugu
Sep 30, 2024 10:02 AM IST

Kannada Bigg Boss: క‌న్న‌డ బిగ్‌బాస్ సీజ‌న్ 11 ఆదివారం ప్రారంభ‌మైంది. ఈ షోకు కిచ్చా సుదీప్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్నాడు. క‌న్న‌డ బిగ్‌బాస్‌లోకి తెలుగు సీరియ‌ల్ యాక్ట‌ర్స్ ఎంట్రీ ఇచ్చారు. వంట‌ల‌క్క సీరియ‌ల్ హీరో శిశిర్ శాస్త్రితో పాటు భ‌వ్య గౌడ‌, ఐశ్వ‌ర్య షిండోగి బిగ్‌బాస్ హౌజ్‌లో అడుగుపెట్టారు.

క‌న్న‌డ బిగ్‌బాస్
క‌న్న‌డ బిగ్‌బాస్

Kannada Bigg Boss: తెలుగు బిగ్‌బాస్ సీజ‌న్ 8లో క‌న్నడ న‌టీన‌టుల‌దే డామినేష‌న్ కొన‌సాగుతోంది. ఈ సీజ‌న్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌గా కొన‌సాగుతోన్న నిఖిల్‌, య‌ష్మి, ప్రేర‌ణ క‌న్న‌డ భాష‌కు చెందిన వారే కావ‌డం గ‌మ‌నార్హం. సీరియ‌ల్స్ ద్వారా ఈ ముగ్గురు తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువ‌య్యారు. నిఖిల్‌, ప్రేర‌ణ‌, య‌ష్మి ల‌లో ఒక‌రు బిగ్‌బాస్ విజేత‌గా నిలిచే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

క‌న్న‌డ బిగ్‌బాస్ లాంఛ్‌...

కాగా క‌న్న‌డ బిగ్‌బాస్ సీజ‌న్ 11 ఆదివారం ప్రారంభ‌మైంది. ఈ షోకు క‌న్న‌డ అగ్ర హీరో కిచ్చా సుదీప్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్నాడు. క‌న్న‌డ బిగ్‌బాస్‌లోకి 17 మంది న‌టీన‌టులు, సోష‌ల్ మీడియా స్టార్స్ కంటెస్టెంట్స్‌గా ఎంట్రీ ఇచ్చారు. అందులో ముగ్గురు తెలుగు సీరియ‌ల్స్‌తో పాపుల‌ర్ అయిన యాక్ట‌ర్స్ ఉండ‌టం గ‌మ‌నార్హం.

వంట‌ల‌క్క సీరియ‌ల్ హీరో...

వంట‌ల‌క్క సీరియ‌ల్ హీరో శిశిర్ శాస్త్రితో పాటు ఐశ్వ‌ర్య షిండోగి, భ‌వ్య గౌడ‌ క‌న్న‌డ బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టారు. వంట‌ల‌క్క సీరియ‌ల్ శిశిర్ శాస్త్రికి తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టింది.

ఈ సీరియ‌ల్ ప్ర‌స్తుతం స్టార్ మాలో టెలికాస్ట్ అవుతోంది. సీరియ‌ల్ కంటిన్యూ అవుతోండ‌గానే అత‌డు బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ సీరియ‌ల్‌ను ఎండ్ చేస్తారా? లేదంటే? శిశిర్ శాస్త్రి ప్లేస్‌లో మ‌రో యాక్ట‌ర్ లీడ్ రోల్ చేస్తాడా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. వంట‌ల‌క్క‌తో పాటు తెలుగులో ఇంటిగుట్టు సీరియ‌ల్ చేశాడు శిశిర్ శాస్త్రి. క‌న్న‌డంలో శ్రీ బాలాజీ ఫొటో స్టూడియో, బిల్ గేట్స్‌తో పాటు మ‌రికొన్ని సినిమాలు, సీరియ‌ల్స్ చేశాడు శిశిర్ శాస్త్రి.

క‌లిసి ఉంటే క‌ల‌దు సుఖం...

మ‌రో కంటెస్టెంట్ భ‌వ్య గౌడ స్టార్ మాలో ప్ర‌సార‌మైన క‌లిసి ఉంటే క‌ల‌దు సుఖం సీరియ‌ల్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైంది. ఈ సీరియ‌ల్‌లో ఆమె నిఖిల్‌కు జోడీగా న‌టించ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం నిఖిత్ తెలుగు బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా కొన‌సాగుతోండ‌గా...భ‌వ్య గౌడ క‌న్న‌డ బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టింది. మోడ‌ల్‌గా కెరీర్‌ను ప్రారంభించిన భ‌వ్య గౌడ మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్న‌ది.

నాగిని 2 సీరియ‌ల్‌...

తెలుగులో నాగిని 2, భైర‌వి సీరియ‌ల్స్‌తో ఫేమ‌స్ అయినా ఐశ్వ‌ర్య షిండోగి కూడా క‌న్న‌డ బిగ్‌బాస్‌లో ప‌దిహేడు మంది కంటెస్టెంట్స్‌లో ఒక‌రిగా ఎంట్రీ ఇచ్చింది. భైర‌వి సీరియ‌ల్ ప్ర‌స్తుతం జెమిని టీవీలో టెలికాస్ట్ అవుతోంది. టీఆర్‌పీ ప‌రంగా టాప్‌లో ఉంది. ఐశ్వ‌ర్య బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా మార‌డంతో ఆమె క్యారెక్ట‌ర్‌ను మ‌రొక‌రితో రీప్లేస్ చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

ఈ ముగ్గురితో పాటు క‌న్న‌డ బిగ్‌బాస్‌లో చైత్ర కుంద‌పుర‌, గోల్డ్ సురేష్, ఉగ్రం మంజు, త్రివిక్ర‌మ్‌, హంస నారాయ‌ణ‌స్వామి, ధ‌ర్మ కీర్తిరాజ్‌తో పాటు మ‌రికొంద‌రు బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌గా మారారు.