Star Maa Serials TRP Ratings: స్టార్ మా, జీ తెలుగు సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే.. ఆ రెండు సీరియల్స్ పోటాపోటీ
Star Maa Serials TRP Ratings: స్టార్ మా, జీ తెలుగు సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. ఎప్పటిలాగే ఆ రెండు సీరియల్స్ మధ్య టాప్ ప్లేస్ కోసం హోరాహోరీ పోరు నడుస్తోంది. ఇక ఓవరాల్ గా స్టార్ మాదే స్పష్టమైన పైచేయిగా కనిపిస్తోంది.
Star Maa Serials TRP Ratings: తెలుగు సీరియల్స్ లో కొంత కాలంగా పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్నాయి స్టార్ మా, జీ తెలుగు. వీటిలోనూ స్టార్ మా సీరియల్స్ కు ఉన్నంత క్రేజ్ మరే ఛానెల్ సీరియల్స్ కూ లేదు. ప్రతి వారం రిలీజయ్యే టీఆర్పీ రేటింగ్సే దీనికి నిదర్శనం. తాజాగా 37వ వారానికి గాను రిలీజైన రేటింగ్స్ లోనూ ఇదే ధోరణి స్పష్టంగా కనిపించింది.
టాప్ 5లో అన్నీ స్టార్ మా సీరియల్సే..
చాలా కాలంగా తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ లో స్టార్ మా ఛానెల్ కు చెందినవే టాప్ లో నిలుస్తున్నాయి. తాజా రేటింగ్స్ లోనూ టాప్ 5లో మొత్తం ఈ ఛానెల్ సీరియల్సే ఉన్నాయి. ఇక ఎప్పటిలాగే ఇందులో వచ్చే బ్రహ్మముడి, కార్తీకదీపం 2 సీరియల్స్ మధ్య టాప్ ప్లేస్ కోసం హోరాహోరీ పోరు నడుస్తోంది.
తాజా రేటింగ్స్ లో బ్రహ్మముడికి అర్బన్, రూరల్ కలిపి 12 రేటింగ్ నమోదైంది. అంటే ఈసారి కూడా అదే టాప్ లో నిలిచింది. అటు కార్తీకదీపం 2 కూడా తానేమీ తక్కువ కాదన్నట్లు 11.6 రేటింగ్ తో దూసుకెళ్తోంది. ఈ రెండింటి తర్వాత గుండెనిండా గుడిగంటలు సీరియల్ 10.63 రేటింగ్ తో మూడో స్థానంలో నిలవగా.. 10.31తో ఇంటింటి రామాయణం నాలుగో స్థానంలో ఉంది. ఇక ఐదో స్థానంలోనూ స్టార్ మా సీరియలే చిన్ని 8.93 రేటింగ్ తో ఉంది.
జీ తెలుగు సీరియల్స్ రేటింగ్స్ ఇవీ..
జీ తెలుగు సీరియల్స్ ఈసారి కూడా టాప్ 5లో చోటు సంపాదించలేకపోయాయి. ఆ ఛానెల్లో అత్యధికంగా 7.48 రేటింగ్ తో మేఘసందేశం టాప్ లో నిలవగా.. ఓవరాల్ గా ఇది ఆరోస్థానంలో ఉంది. ఇక ఆ తర్వాత పడమటి సంధ్యారాగం 7.29తో ఏడో స్థానంలో, నిండు నూరేళ్ల సావాసం 7.16తో 8వ స్థానంలో, జగద్ధాత్రి 6.74తో పదో స్థానంలో ఉన్నాయి.
మధ్యలో 7.09 రేటింగ్ తో స్టార్ మాకు చెందిన మగువ ఓ మగువ సీరియల్ 9వ స్థానంలో ఉంది. అంటే మొత్తంగా చూసుకుంటే.. టాప్ 10లో 6 స్టార్ మా సీరియల్స్, నాలుగు జీ తెలుగు సీరియల్స్ ఉన్నాయి. జెమిని, ఈటీవీ సీరియల్స్ వీటికి దరిదాపుల్లో కూడా లేవు.
అడ్రెస్ లేని జెమిని, ఈటీవీ సీరియల్స్
తెలుగు సీరియల్స్ పోటీలో స్టార్ మా, జీ తెలుగుతో పోలిస్తే జెమినీ టీవీ, ఈటీవీ సీరియల్స్ అడ్రెస్ లేకుండా పోయాయి. జెమిని టీవీలో వచ్చే శ్రీమద్ రామాయణం 1.21తో ఆ ఛానెల్లో బెస్ట్ రేటింగ్ సాధించింది. ఇక ఈటీవీ విషయానికి వస్తే.. 3.30 రేటింగ్ తో రంగులరాట్నం టాప్ లో నిలిచింది.
అయితే ఆ రెండు ఛానెల్స్ తో పోలిస్తే.. ఈ ఛానెల్స్ లోని సీరియల్స్ రేటింగ్స్ మరీ దారుణంగా ఉన్నాయనడంలో సందేహం లేదు. టీవీ షోల విషయంలో స్టార్ మాతో గట్టిగానే పోటీ పడే ఈటీవీ.. సీరియల్స్ విషయంలో మాత్రం వెనుకబడిపోతోంది.