Bigg Boss 8 Telugu Voting: బిగ్‌బాస్‌లో ఈ వీక్ షాకింగ్ ఎలిమినేష‌న్ - డేంజ‌ర్‌లో జోన్‌లో ముగ్గురు కంటెస్టెంట్స్‌!-bigg boss 8 telugu shocking elimination this week abhay and nainika are in danger zone ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 8 Telugu Voting: బిగ్‌బాస్‌లో ఈ వీక్ షాకింగ్ ఎలిమినేష‌న్ - డేంజ‌ర్‌లో జోన్‌లో ముగ్గురు కంటెస్టెంట్స్‌!

Bigg Boss 8 Telugu Voting: బిగ్‌బాస్‌లో ఈ వీక్ షాకింగ్ ఎలిమినేష‌న్ - డేంజ‌ర్‌లో జోన్‌లో ముగ్గురు కంటెస్టెంట్స్‌!

Nelki Naresh Kumar HT Telugu
Sep 20, 2024 06:19 AM IST

Bigg Boss 8 : ఈ వీక్ నామినేష‌న్స్‌లో ఆరుగురు కంటెస్టెంట్స్ డేంజ‌ర్ జోన్‌లో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ సారి షాకింగ్ ఎలిమినేష‌న్ ఉండొచ్చ‌ని అంటున్నారు. నైనిక‌, అభ‌య్‌ల‌లో ఒక‌రు హౌజ్ నుంచి వెళ్లిపోయే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. మ‌రోవైపు గురువారం నాటి ఎపిసోడ్‌లో బిగ్‌బాస్‌పైనే చీఫ్ అభ‌య్ ఫైర్ అయ్యాడు.

బిగ్‌బాస్ 8 తెలుగు ఓటింగ్
బిగ్‌బాస్ 8 తెలుగు ఓటింగ్

Bigg Boss 8 Telugu Voting: బిగ్‌బాస్ 8 తెలుగులో గురువారం నాటి ఎపిసోడ్ మొత్తం గొడ‌వ‌ల‌తోనే సాగింది. లేడీ కంటెస్టెంట్స్ ఒక‌రినొక‌రు బూతులు తిట్టుకుంటూ తోసుకున్నారు. హౌజ్‌లో ర‌చ్చ‌ర‌చ్చ చేశారు. బిగ్‌బాస్‌ ఇచ్చిన గుడ్ల టాస్క్‌లో మొద‌ట‌ కాంతార టీమ్ వెనుక‌బ‌డిపోయింది. తాము తీసుకొచ్చిన గుడ్ల‌ను శ‌క్తి టీమ్ దొంగిలిస్తున్న‌ చీఫ్ అభ‌య్ ఏం చేయ‌లేక‌పోయాడు.

త‌న టీమ్‌మేట్స్ హెచ్చ‌రిస్తున్న ప‌ట్టించుకోలేదు. య‌ష్ని, ప్రేర‌ణ మాత్రం శ‌క్తి టీమ్‌తో గ‌ట్టిగా పోరాడారు. ఆ త‌ర్వాత న‌బీల్ త‌న‌ను అభ్యంత‌ర‌క‌రంగా ట‌చ్ చేశాడ‌ని ర‌చ్చ చేసిన విష్ణుప్రియ అదంతా ఉట్టిదే తూచ్ అని అన్న‌ది. న‌బీల్ మంచోడు అంటూ అత‌డికి సారీ చెప్పేసింది.

కిచెన్ విష‌యంలో బిగ్‌బాస్ రూల్స్‌...

కిచెన్ విష‌యంలో బిగ్‌బాస్ కొత్త రూల్స్ తీసుకొచ్చాడు. ఒక్కో టీమ్ నుంచి కేవ‌లం ముగ్గురు కంటెస్టెంట్స్ మాత్ర‌మే కిచెన్‌లో వంట చేయాల‌ని, వారు వెళ్లిపోయిన మ‌రో టీమ్ మెంబ‌ర్స్ కిచెన్‌లోకి ఎంట‌ర్ కావాల‌ని అన్నాడు. బిగ్‌బాస్ పెట్టిన కొత్త రూల్స్‌పై అభ‌య్ ఫైర్ అయ్యాడు. బిగ్‌బాస్‌ను బూతులు తిట్టాడు. దిమాక్ లేదు...సైకోగాళ్లు అంటూ రెచ్చిపోయాడు. స‌రిగ్గా తిండికూడా తిన‌నివ్వ‌డం లేద‌ని కోపంగా మాట్లాడాడు.

అభ‌య్ చీఫ్ గా ఫెయిల్‌...

గుడ్ల టాస్క్‌లో త‌మ టీమ్ సంపాదించిన ఎగ్స్‌కు కాంతార టీమ్ చీఫ్ అభ‌య్ స‌రిగ్గా కాప‌లా కాయ‌లేక‌పోయాడు. శ‌క్తి టీమ్ గుడ్ల‌ను దొంగిలిస్తుంటే చూస్తూ ఉండిపోయాడు. చివ‌ర‌కు ఏం చేయ‌లేక త‌న టీమ్ మెంబ‌ర్స్‌నే త‌ప్పు ప‌ట్టాడు. శ‌క్తి టీమ్ దొంగిలించిన గుడ్ల‌ను తిరిగి తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నించిన ప్రేర‌ణ‌, య‌ష్మిల‌కు అభ‌య్ స‌పోర్ట్ చేయ‌లేదు. త‌మ చీఫ్‌పై కాంతార టీమ్ అసంతృప్తిని వ్య‌క్తం చేసింది.

చివ‌ర‌లో గుడ్ల టాస్క్ మొత్తం సీరియ‌స్‌గా మారిపోయింది. ప్రేర‌ణ‌పై విష్ణుప్రియ సీతా ఎటాక్ చేసి ఆమెను కింద‌ప‌డేశారు. నిఖిల్‌, పృథ్వీ కూడా గేమ్‌ను ఇష్టానుసారం ఆడారు. ముందు వెన‌క చూసుకోకుండా త‌మ‌కు అడ్డొచ్చిన వారిని తోసుకుంటూ తిట్ట‌డం మొద‌లుపెట్టారు. య‌ష్మి, ప్రేర‌ణ ఎంత పోరాడిన త‌మ టీమ్ ద‌గ్గ‌ర ఉన్న గుడ్ల‌ను మొత్తం కోల్పోయారు.

ఇద్ద‌రిలో ఒక‌రు ఎలిమినేట్‌...

ఈ సారి ఎలిమినేష‌న్‌లో మొత్తం ఎనిమిది ఉన్నారు. ఓటింగ్‌లో టాప్‌లో విష్ణుప్రియ‌, మ‌ణికంఠ ఉన్నారు. వీరిద్ద‌రు సేఫ్ కానున్నారు. అయితే సీత‌, నైనిక‌, పృథ్వీ, అభ‌య్, య‌ష్మి, ప్రేర‌ణ మాత్రం డేంజ‌ర్ జోన్‌లో ఉన్నారు. అయితే ఈ వీక్ టాస్కుల్లో నైనిక యాక్టివ్‌గా లేదు. నైనిక షాకింగ్ ఎలిమినేష‌న్ ఉండొచ్చ‌ని అంటున్నారు.

బిగ్‌బాస్‌ను తిట్ట‌డం, త‌న మాట‌తీరు, చీఫ్ బాధ్య‌త‌ల‌ను స‌రిగ్గా నిర్వ‌ర్తించ‌లేక నెగెటివిటీని ఎదుర్కొన్న అభ‌య్ కూడా ఎలిమినేష‌న్‌లో ఉండొచ్చ‌ని అంటున్నారు. అభ‌య్‌, నైనిక‌...ఈ ఇద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రు బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ కావ‌చ్చున‌ని అంటున్నారు. డేంజ‌ర్ జోన్‌లో ఉన్న పృథ్వీ, య‌ష్మి, ప్రేర‌ణ‌ల‌ను త‌మ ఆట‌తీరు కార‌ణంగా సేఫ్ అయ్యే ఛాన్సెస్ క‌నిపిస్తోన్నాయి.