Telugu Cinema News Live September 20, 2024: Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్నార్ నేషనల్ అవార్డు.. అమితాబ్ ఇస్తారని చెప్పిన నాగార్జున
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Fri, 20 Sep 202404:20 PM IST
- Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిని ఏఎన్నార్ నేషనల్ అవార్డుతో సత్కరించాలని అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్ణయించింది. ఈ విషయాన్ని శుక్రవారం (సెప్టెంబర్ 20) నాగార్జున అనౌన్స్ చేశాడు. అమితాబ్ బచ్చన్ ఈ అవార్డు ఇవ్వనున్నాడు.
Fri, 20 Sep 202403:42 PM IST
- Rajinikanth: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ రిపోర్టర్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. తనను రాజకీయ సంబంధిత ప్రశ్న అడిగినందుకు అతడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Fri, 20 Sep 202402:49 PM IST
- OTT Comedy Movie: ఓటీటీలోకి నేరుగా రావాల్సిన కామెడీ మూవీ కొన్నాళ్ల కిందట వాయిదా పడి ఇప్పుడు మళ్లీ రాబోతోంది. ఈ సినిమా కొత్త స్ట్రీమింగ్ తేదీని ఆహా ఓటీటీ అనౌన్స్ చేసింది. నిజానికి గత వారమే ఈ సినిమా ఓటీటీలోకి రావాల్సి ఉన్నా.. చివరి నిమిషంలో వాయిదా వేశారు.
Fri, 20 Sep 202401:57 PM IST
- OTT Kannada Action Drama: ఓటీటీలోకి ఏడు నెలల తర్వాత ఓ కన్నడ యాక్షన్ డ్రామా మూవీ అడుగుపెట్టింది. థియేటర్లలో అంత మంచి రెస్పాన్స్ రాకపోయినా.. ఐఎండీబీలో మాత్రం మంచి రేటింగ్ సంపాదించిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది.
Fri, 20 Sep 202401:32 PM IST
- Biggest Flop Movie: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమాల్లో ఇదీ ఒకటి. కానీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది. మైఖేల్ జాక్సన్ మూవీని వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించిన ఈ మూవీ గురించి మీకు తెలుసా?
Fri, 20 Sep 202411:34 AM IST
- OTT Malayalam Crime Thriller: ఓటీటీలోకి మరో మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ వచ్చేసింది. ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్ ఉన్న ఈ సినిమా శుక్రవారమే (సెప్టెంబర్ 20) డిజిటల్ ప్రీమియర్ కు రావడం విశేషం.
Fri, 20 Sep 202409:20 AM IST
- OTT Crime Thriller Web Series: ఓ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇప్పుడు తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. ఇన్నాళ్లూ కేవలం హిందీలోనే ఉన్న ఈ సూపర్ హిట్ సిరీస్.. తెలుగుతోపాటు తమిళంలోకీ వచ్చినట్లు జీ5 ఓటీటీ వెల్లడించింది.
Fri, 20 Sep 202408:44 AM IST
- OTT Thriller Movie: ఓ తమిళ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం (సెప్టెంబర్ 20) నుంచి ఈ సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం. అసలు ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండా సడెన్ గా ఈ సినిమా వచ్చింది.
Fri, 20 Sep 202408:39 AM IST
Pawan Kalyan: హరిహరవీరమల్లు మూవీపై మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను శుక్రవారం రివీల్ చేశారు. సెప్టెంబర్ 23 నుంచి పవన్ కళ్యాణ్ ఈ మూవీ షూటింగ్‌ను మొదలుపెట్టనున్నట్లు వెల్లడించారు. హరిహరవీరమల్లుకు ఏఎమ్ జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తోన్నాడు.
Fri, 20 Sep 202407:50 AM IST
Crime Thriller OTT: కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ సత్య భామ ఇప్పటికే మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ మూవీ నాలుగో ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం సన్ నెక్స్ట్ ఓటీటీలో సత్యభామ మూవీ రిలీజైంది.
Fri, 20 Sep 202407:00 AM IST
Samantha: దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తర్వాత తిరిగి కెమెరా ముందుకొచ్చింది సమంత. హారర్ వెబ్‌సిరీస్ షూటింగ్ మొదలుపెట్టింది. రక్త్ బ్రహ్మాండ్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సిరీస్‌కు తుంబాద్ ఫేమ్ రాహి అనిల్ బార్వే దర్శకత్వం వహిస్తోన్నాడు.
Fri, 20 Sep 202406:11 AM IST
Devara Run Time: దేవర మూవీ రన్‌టైమ్ విషయంలో ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ రన్‌టైమ్‌ను పదిహేను నిమిషాల పాటు తగ్గించినట్లు సమాచారం. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో రాబోతున్న ఈ మూవీలో జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
Fri, 20 Sep 202404:21 AM IST
Malayalam Thriller OTT: సీనియర్ హీరోయిన్ మీనా లీడ్ రోల్‌లో నటించిన మలయాళం థ్రిల్లర్ మూవీ ఆనందపురం డైరీస్ ఓటీటీలోకి వస్తోంది. మనోరమా మ్యాక్స్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ థ్రిల్లర్ మూవీలో టాలీవుడ్ యాక్టర్ శ్రీకాంత్ కీలక పాత్రలో నటించాడు.
Fri, 20 Sep 202403:26 AM IST
Gundeninda Gudigantalu:గుండెనిండా గుడి గంటలు సెప్టెంబర్ 20 ఎపిసోడ్‌లో రవిని ప్రేమిస్తున్న సంగతి మీనాతో చెబుతుంది శృతి. తమ పెళ్లి జరిగేలా చేయమని మీనా సహాయం అడుగుతుంది. రవి, శృతిల పెళ్లి జరిపిస్తే తన కాపురం చిక్కుల్లో పడటం ఖాయమని మీనా భయపడుతుంది. రవి ప్రేమకు బాలు అడ్డుచెబుతాడు.
Fri, 20 Sep 202402:13 AM IST
Brahmamudi September 20th Episode: బ్రహ్మముడి సెప్టెంబర్ 20 ఎపిసోడ్‌లో కళ్యాణ్, అప్పులైఫ్‌లోకి మళ్లీ అనామిక రీఎంట్రీ ఇస్తుంది. వారిపై పగతో దుగ్గిరాల కుటుంబానికి ప్రత్యర్థి అయిన సామంత్ అనే వ్యక్తికి దగ్గరవుతుంది. కళ్యాణ్, అప్పు రోడ్డుపై నడిచిరావడం చూసి అవమానిస్తూ మాట్లాడుతుంది.
Fri, 20 Sep 202401:40 AM IST
- Karthika deepam 2 serial september 20th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. కార్తీక్, కాశీ ఎవరు అనే విషయాల గురించి శ్రీధర్ కావేరికి నిజం చెప్పేస్తాడు. ఈ పెళ్లి జరిగితే కాంచన చచ్చిపోతుందని అంటాడు. స్వప్నతో శ్రీకాంత్ పెళ్లి జరిగేలా కూతురిని ఒప్పించమని కావేరితో చెప్తాడు.
Fri, 20 Sep 202412:48 AM IST
Bigg Boss 8 : ఈ వీక్ నామినేషన్స్‌లో ఆరుగురు కంటెస్టెంట్స్ డేంజర్ జోన్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సారి షాకింగ్ ఎలిమినేషన్ ఉండొచ్చని అంటున్నారు. నైనిక, అభయ్‌లలో ఒకరు హౌజ్ నుంచి వెళ్లిపోయే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు గురువారం నాటి ఎపిసోడ్‌లో బిగ్‌బాస్‌పైనే చీఫ్ అభయ్ ఫైర్ అయ్యాడు.
Fri, 20 Sep 202412:30 AM IST
- NNS 20th September Episode: నిండు నూరేళ్ల సావాసం శుక్రవారం (సెప్టెంబర్ 20) ఎపిసోడ్లో అరుంధతి ఆత్మను మనోహరి తనలోకి తీసుకురావాలని ఘోరా చెబుతాడు. అటు మిస్సమ్మ ఎంతో సంబరపడిపోతూ కనిపించగా.. ఆరుకు గుప్త క్షమాపణ చెబుతాడు.
Fri, 20 Sep 202412:00 AM IST
- Star Maa Serials TRP Ratings: స్టార్ మా, జీ తెలుగు సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. ఎప్పటిలాగే ఆ రెండు సీరియల్స్ మధ్య టాప్ ప్లేస్ కోసం హోరాహోరీ పోరు నడుస్తోంది. ఇక ఓవరాల్ గా స్టార్ మాదే స్పష్టమైన పైచేయిగా కనిపిస్తోంది.