తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Lal Salaam Ott: ఓటీటీలోకి రజనీకాంత్ లాల్ సలామ్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడే.. ఎందులో అంటే?

Lal Salaam OTT: ఓటీటీలోకి రజనీకాంత్ లాల్ సలామ్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడే.. ఎందులో అంటే?

Sanjiv Kumar HT Telugu

11 February 2024, 8:35 IST

google News
  • Rajinikanth Lal Salaam OTT Streaming: తలైవా రజనీకాంత్ గెస్ట్ రోల్ ప్లే చేసిన లేటెస్ట్ మూవీ లాల్ సలామ్. ఆయన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన లాల్ సలామ్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌పై వచ్చిన అప్డేట్ క్రేజీగా వైరల్ అవుతోంది.

ఓటీటీలోకి రజనీకాంత్ లాల్ సలామ్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడే.. ఎందులో అంటే?
ఓటీటీలోకి రజనీకాంత్ లాల్ సలామ్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడే.. ఎందులో అంటే?

ఓటీటీలోకి రజనీకాంత్ లాల్ సలామ్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడే.. ఎందులో అంటే?

Lal Salaam OTT Release: సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన లేటెస్ట్ మూవీ లాల్ సలామ్. రజనీ కాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ ప్రధాన పాత్రలు పోషించారు. వీళ్లతోపాటు లాల్ సలామ్ మూవీలో భారత దిగ్గజ క్రికెటర్ కపీల్ దేవ్, జీవిత రాజశేఖర్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో లాల్ సలామ్ సినిమాను రూపొందించగా.. ఏ సుభాస్కరన్ నిర్మాతగా వ్యవహరించారు.

ఇక లాల్ సలామ్ మూవీకి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. అయితే ఎంతో బజ్ క్రియేట్ చేసుకున్న లాల్ సలామ్ సినిమా ఎన్నో అంచనాలతో శుక్రవారం (ఫిబ్రవరి 9) నాడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. తమిళంలో ఈ సినిమాపై బజ్ భారీగానే ఉన్న తెలుగులో మాత్రం ఈ మూవీ ఒకటి వస్తుందని చాలా మందికి తెలియదు. తమిళంలో విడుదలైన లాల్ సలామ్ మూవీకి తెలుగులో మొదటగానే షాక్ తగిలింది.

తెలుగు రాష్ట్రాల్లో లాల్ సలామ్ మూవీ మార్నింగ్ షోలు రద్దు అయ్యాయి. అందుకు కారణాలు తెలియవు కానీ, ఫస్ట్ డే ఫస్ట్ షో రజనీకాంత్ సినిమా చూద్దామనుకున్న తెలుగు ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది. ఇదిలా ఉంటే లాల్ సలామ్ సినిమాకు రజనీ కెరీర్‌లోనే ఊహించని విధంగా కలెక్షన్స్ నమోదు అయ్యాయి. రజనీ క్రేజ్‌కు సంబంధం లేకుండా అతి తక్కువ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో లాల్ సలామ్ మూవీని థియేటర్‌లో చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపట్లేదని సినీ వర్గాల టాక్.

ఈ నేపథ్యంలో లాల్ సలామ్ ఓటీటీ స్ట్రీమింగ్ ఆసక్తిగా మారింది. లాల్ సలామ్ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని సమాచారం. భారీ ధరకు లాల్ సలామ్ ఓటీటీ రైట్స్ దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్ చిత్రాన్ని 60 రోజులకు స్ట్రీమింగ్ చేయనుందని టాక్ నడుస్తోంది. కానీ, బాక్సాఫీస్ కలెక్షన్స్, మూవీపై వచ్చే టాక్‌ను దృష్టిలో ఉంచుకుని ఎన్నో సినిమాలను నెలకంటే ముందే ఓటీటీలోకి రిలీజ్ చేశారు.

ఇలా చూసుకుంటే ప్రస్తుతం లాల్ సలామ్‌కు వస్తున్న టాక్‌ అండ్ కలెక్షన్స్ బట్టి 2 నెలలు కాదు కదా నెల పూర్తి కాకముందే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. కాబట్టి మూడు, నాలుగు వారాల్లో నెట్‌ఫ్లిక్స్‌లో లాల్ సలామ్ మూవీ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక లాల్ సలామ్ శాటిలైట్స్ హక్కులను ప్రముఖ టెలివిజన్ నెట్ వర్క్ జెమినీ టీవీ సొంతం చేసుకుంది. తమిళంలో సన్ టీవీ దక్కించుకుందని సమాచారం.

అంటే, తెలుగు బుల్లితెరపై జెమినీ టీవీ ఛానెల్‌లో లాల్ సలామ్ ప్రసారం కానుంది. అయితే లాల్ సలామ్ ఓటీటీ పార్టనర్, శాటిలైట్ రైట్స్‌పై ఇప్పటిరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. లాల్ సలామ్ ఓటీటీ స్ట్రీమింగ్‌పై అధికారిక ప్రకటన వస్తేనే స్పష్టత వస్తుంది. ఇక లాల్ సలామ్ కథ విషయానికొస్తే.. ఒక గ్రామంలో జరిగే హిందూ, ముస్లిం గొడవలను ఆధారంగా చేసుకుని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో మొయీద్దీన్ భాయ్‌గా రజనీకాంత్ చేశారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం