Bhagavanth Kesari OTT Platform: రిలీజ్‌కుముందే భ‌గ‌వంత్ కేస‌రి ఓటీటీ, శాటిలైట్ డీల్ క్లోజ్ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?-balakrishna bhagavanth kesari ott and satellite rights sold for record price details here ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bhagavanth Kesari Ott Platform: రిలీజ్‌కుముందే భ‌గ‌వంత్ కేస‌రి ఓటీటీ, శాటిలైట్ డీల్ క్లోజ్ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Bhagavanth Kesari OTT Platform: రిలీజ్‌కుముందే భ‌గ‌వంత్ కేస‌రి ఓటీటీ, శాటిలైట్ డీల్ క్లోజ్ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Bhagavanth Kesari OTT Platform: రిలీజ్‌కు ముందే బాల‌కృష్ణ భ‌గ‌వంత్ కేస‌రి ఓటీటీ, శాటిలైట్ బిజినెస్ క్లోజ్ అయిన‌ట్లు స‌మాచారం. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో, శాటిలైట్‌ హ‌క్కుల‌ను జీ తెలుగు సొంతం చేసుకున్న‌ట్లు తెలిసింది.

బాల‌కృష్ణ భ‌గ‌వంత్ కేస‌రి

Bhagavanth Kesari OTT Platform: బాల‌కృష్ణ భ‌గ‌వంత్ కేస‌రి సినిమా ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 19న రిలీజ్ కానుంది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తండ్రీకూతుళ్ల అనుబంధం నేప‌థ్యంలో డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ఈ సినిమాను తెర‌కెక్కిస్తోన్నారు.

ఆదివారం రిలీజైన ట్రైల‌ర్ బాల‌కృష్ణ అభిమానుల‌తో పాటు తెలుగు ఆడియెన్స్‌ను మెప్పిస్తోంది. ఈ ట్రైల‌ర్‌లో తెలంగాణ స్లాంగ్‌లో బాల‌కృష్ణ చెప్పిన డైలాగ్స్‌, అత‌డిపై చిత్రీక‌రించిన యాక్ష‌న్ సీక్వెన్స్ హైలైట్‌గా నిలుస్తోన్నాయి. రిలీజ్‌కు ముందే భగవంత్ కేసరి ఓటీటీ, శాటిలైట్ బిజినెస్ పూర్త‌యిన‌ట్లు స‌మాచారం.

ఈ సినిమా ఓటీటీ హ‌క్కుల‌ను అమెజాన్ ప్రైమ్ 18 కోట్ల‌కు ద‌క్కించుకోన్న‌ట్లు తెలిసింది. బాల‌కృష్ణ అఖండ‌, వీర‌సింహారెడ్డి సినిమాలు స‌క్సెస్‌లుగా నిల‌వ‌డం, అనిల్ రావిపూడికి ఇప్ప‌టివ‌ర‌కు ఫ్లాప్ అన్న‌ది లేక‌పోవ‌డంతో భ‌గ‌వంత్ కేస‌రి ఓటీటీ హ‌క్కుల కోసం భారీ పోటీ ఏర్ప‌డిన‌ట్లు తెలిసింది. చివ‌ర‌కు అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను కొనుగోలు చేసిన‌ట్లు స‌మాచారం.

భ‌గ‌వంత్ కేస‌రి శాటిలైట్‌ హ‌క్కుల‌ను జీ తెలుగు ఛానెల్ సొంతం చేసుకున్న‌ట్లు తెలిసింది. ఈ సినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోండ‌గా, శ్రీలీల కీల‌క పాత్ర పోషిస్తోంది.

బాల‌కృష్ణ‌, కాజ‌ల్ కాంబినేష‌న్‌లో తెలుగులో వ‌స్తోన్న ఫ‌స్ట్ మూవీ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. భ‌గ‌వంత్ కేస‌రి సినిమాకు త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తోన్నాడు. బాలీవుడ్ న‌టుడు అర్జున్ రాంపాల్ విల‌న్‌గా ఈ సినిమాతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు.