Lal Salaam Twitter Review: లాల్ సలామ్ ట్విటర్ రివ్యూ.. రజనీకాంత్ సినిమాకు ఊహించని టాక్.. మొత్తంగా ఎలా ఉందంటే?
Rajinikanth Lal Salaam Twitter Review Telugu: తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన లేటెస్ట్ మూవీ లాల్ సలామ్. రజనీ కాంత్ కెమియో రోల్ చేసిన లాల్ సలామ్ శుక్రవారం (ఫిబ్రవరి 9) వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో లాల్ సలామ్ ట్విటర్ రివ్యూ వచ్చేసింది.
Rajinikanth Lal Salaam Twitter Review: సూపర్ స్టార్ రజనీ కాంత్ అతిథి పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ లాల్ సలామ్. రజనీ కాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన లాల్ సలామ్ మూవీలో విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ మెయిన్ లీడ్ రోల్స్ చేశారు. అలాగే లాల్ సలామ్ చిత్రంలో భారత దిగ్గజ క్రికెటర్ కపీల్ దేవ్, జీవిత రాజశేఖర్ పలు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పిటికే లాల్ సలామ్ మూవీ టీజర్, ట్రైలర్ ఎంతో ఆకట్టుకున్నాయి.
ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో లాల్ సలామ్ సినిమాను రూపొందించగా.. ఏ సుభాస్కరన్ నిర్మాతగా వ్యవహరించారు. ఇక లాల్ సలామ్ మూవీకి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఎన్నో అంచనాలతో నేడు అంటే శుక్రవారం (ఫిబ్రవరి 9) ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది లాల్ సలామ్ సినిమా. ఇప్పటికే పలు ప్రీమియర్ షోలు చూసిన నెటిజన్స్ లాల్ సలామ్‌పై రివ్యూ ఇచ్చారు.
"లాల్ సలామ్ ఫస్టాఫ్ పూర్తి అయింది. బ్లాక్ బస్టర్ మూవీ. వెట్రిమారన్ స్టైల్ డైరెక్షన్‌ను ఐశ్వర్య రజనీకాంత్ అడాప్ట్ చేసుకుంది. తెర్ తిరువిళ ఎపిసోడ్ చాలా దారుణంగా చిత్రీకరించారు. ఫస్టాఫ్ మొత్తంలో రజనీకాంత్ కేవలం 20 నిమిషాలు మాత్రమే కనిపించారు. లాల్ సలామ్ సెకండాఫ్ అదిరిపోయింది. రజనీకాంత్ గెటప్‌లో మాములుగా లేదు. లాల్ సలామ్ మూవీ ముస్లిం సోదరులందరికి ట్రిబ్యూట్ లాంటిది. ఐశ్వర్య అక్క మనం గెలిచాం. సోషల్ మేసెజ్‌ను చాలా బాగా చూపించాం" అని ఒక నెటిజన్ రివ్యూ ఇచ్చాడు.
"లాల్ సలామ్ ఫస్టాఫ్ పూర్తి అయింది. సినిమా చాలా ఎమోషనల్ సీన్స్‌తో ఉంది. కానీ, ఫ్యాన్స్‌ను ఆకట్టుకునే మూమెంట్స్ ఏం లేవు. పూర్తిగా ఫ్యామిలీ ఆడియెన్స్ చూసే సినిమా. ముఖ్యంగా గ్రామాల్లో ఉండే ప్రజలకు బాగా కనెక్ట్ అవుతుంది. సౌత్ ప్రేక్షకులకు నచ్చుతుంది. ఫస్టాఫ్ బాగుంది" అని ఒకరు లాల్ సలామ్ ఫస్టాఫ్ వరకే రివ్యూ ఇచ్చారు.
"లాల్ సలామ్ మతంపై మానవత్వం కచ్చితంగా గెలుస్తుంది అని చెప్పే మూవీ. సాధరణంగానే సెకండాఫ్ నిరాశపరుస్తుంది. కానీ, పోస్ట్ ఇంటర్వెల్ సీన్ మాత్రం అదిరిపోయింది. క్లైమాక్స్ చాలా కష్టంగా ఉంటుంది. బాక్సాఫీస్ విన్నర్ లాల్ సలామ్" అని ఓ నెటిజన్ లాల్ సలామ్ మూవీపై తన అభిప్రాయం తెలిపారు.
"సినిమా చాలా బాగుంది. రజనీ కాంత్ సినిమాల్లో ఇదొక బెస్ట్ మూవీ. ఫస్టాఫ్‌లో ఒక 20, 30 నిమిషాలు మాత్రమే రజనీ కాంత్ కనిపిస్తారు. ఇంటర్వెల్ తర్వాత నెక్ట్స్ లెవెల్‌లో ఉంది. క్లైమాక్స్‌లో చూపించిన కాన్సెప్ట్ చాలా బ్రిలియంట్‌గా ఉంది. రజనీ కాంత్ ఫ్యాన్స్ తప్పకుండా చూడాల్సిన సినిమా. డిఫరెంట్ డైమెన్షన్‌లో ఉంటుంది. డిఫరెంట్ మాస్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. కచ్చితంగా సాటిస్‌ఫై చేస్తుంది" అని తమిళ ప్రేక్షకులు థియేటర్ల వద్ద రివ్యూ ఇచ్చారు.
లాల్ సలామ్ సినిమాలో రజనీకాంత్ 20 నిమిషాలు మాత్రమే కనిపిస్తారని నెటిజన్స్ చెబుతున్నారు. అయితే, ఆయన ముస్లిం గెటప్‌లో మాత్రం లుక్ అదిరిపోయిందని, అలాగే రజనీకాంత్ యాక్టింగ్ నెక్ట్స్ లెవెల్ ఉందని అంటున్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ స్టైల్‌ను ఐశ్వర్య రజనీకాంత్ అనుసరించిందని పలువురు చెబుతున్నారు. విష్ణు విశాల్, విక్రాంత్ నటన కూడా సినిమాకు చాలా ప్లస్ అయిందని అంటున్నారు. ఇలా రజనీ కెమియో రోల్ చేసిన లాల్ సలామ్ సినిమాకు ఊహించని టాక్ వస్తోంది.
టాపిక్