Lal Salaam Tv Premiere: ఓటీటీ కంటే ముందుగా టీవీలోకి రజనీకాంత్ లాల్‌సలామ్ - వరుసగా రెండు రోజులు టెలికాస్ట్
03 December 2024, 11:17 IST
Lal Salaam Tv Premiere: రజనీకాంత్ లాల్ సలామ్ మూవీ ఓటీటీ కంటే ముందుగా టీవీలోకి రాబోతోంది. లాల్ సలామ్ హిందీ వెర్షన్ డిసెంబర్ 14 జీ సినిమా ఛానెల్‌లో, డిసెంబర్ 15న జీ జీవీలో టెలికాస్ట్ కాబోతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది.
లాల్ సలామ్ టీవీ ప్రీమియర్ డేట్
Lal Salaam Tv Premiere: రజనీకాంత్ లాల్‌సలామ్ మూవీ ఓటీటీ కంటే ముందుగా టీవీలోకి రాబోతోంది. ఈ సినిమా హిందీ టీవీ ప్రీమియర్ డేట్ ఫిక్సయింది. డబుల్ ప్రీమియర్ పేరుతో వరుసగా రెండు రోజులు లాల్ సలామ్ హిందీ వెర్షన్ టీవీలో టెలికాస్ట్ కాబోతోంది. డిసెంబర్ 14న రాత్రి తొమ్మిది గంటలకు జీ సినిమా ఛానెల్‌లో లాస్ సలామ్ మూవీ ప్రసారం కానుంది.
డిసెంబర్ 15న సాయంత్రం నాలుగు గంటలకు జీ టీవీలోనూ మరోసారి టెలికాస్ట్ చేయబోతున్నారు. లాల్ సలామ్ టీవీ ప్రీమియర్ డేట్స్‌ను జీ నెట్‌వర్క్ అఫీషియల్‌గా అనౌన్స్‌చేసింది. ఓటీటీలో రిలీజ్ కాకుండానే రజనీకాంత్ మూవీ ముందుగా టీవీలోకి రాబోతుండటం ఆసక్తికరంగా మారింది.
రజనీకాంత్ కూతురు...
స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన లాల్ సలామ్ మూవీకి రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించింది. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటించిన ఈ మూవీలో రజనీకాంత్ కీలక పాత్రలో నటించాడు.
థియేటర్లలో డిజాస్టర్...
ఈ ఏడాది ఫిబ్రవరిలో థియేటర్లలో రిలీజైన లాల్‌సలామ్ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ ఇరవై కోట్ల లోపే కలెక్షన్స్‌ను సాధించింది. భారీ నష్టాల కారణంగా థియేటర్లలో రిలీజై పది నెలలు దాటినా ఇప్పటివరకు మూవీ ఓటీటీలో రిలీజ్ కాలేదు. లాల్‌సలామ్ షూటింగ్ ఫుటేజీ తాలూకు హార్డ్‌డిస్క్ కనిపించకుండాపోయిందంటూ, సినిమా పరాజయానికి అది ఓ కారణమంటూ రిలీజ్ తర్వాత ఐశ్వర్య రజనీకాంత్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
రెండు ఓటీటీలు..
లాల్‌సలామ్ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌తో పాటు సన్ నెక్స్ట్ ఓటీటీ సొంతం చేసుకున్నట్లు సమాచారం. కానీ ఇప్పటివరకు ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఈ రెండు ప్లాట్‌ఫామ్స్ ఎలాంటి ప్రకటనను చేయలేదు.
లాల్‌సలామ్ కథ రొటీన్‌గా ఉండటం, రజనీకాంత్ పాత్రను పవర్‌ఫుల్‌గా స్క్రీన్‌పై ప్రజెంట్ చేయడంలో డైరెక్టర్ ఐశ్వర్య విఫలం కావడం కూడా లాల్ సలామ్ ఫెయిల్యూర్‌కు కారణాలుగా నిలిచాయి. తొలుత రజనీకాంత్ క్యారెక్టర్ లాల్ సలామ్‌లో ఐదు నుంచి పది నిమిషాల లోపే ఉండనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ క్రేజ్ కోసం రజనీకాంత్ క్యారెక్టర్ లెంగ్త్ పెంచడం కూడా సినిమాకు మైనస్ అయ్యింది.
లాల్ సలామ్ స్టోరీ ఇదే...
కసుమూరుకు చెందిన మొయుద్దీన్ (రజనీకాంత్) ఓ బిజినెస్‌మెన్. తన కొడుకు శంషుద్దీన్‌ను (విక్రాంత్) క్రికెటర్‌గా చూడాలన్నది మొయుద్దీన్ కల. ఊళ్లో క్రికెట్ మ్యాచ్ లో జరిగిన గొడవ మతకల్లోలానికి దారితీస్తుంది. ఈ గొడవలో శంషుద్దీన్ చేయిని గురు (విష్ణు విశాల్) నరికేస్తాడు. అసలు గురు ఎవరు? తన కొడుకుకు జరిగిన అన్యాయంపై మెయిద్దీన్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? ప్రాణస్నేహితులుగా ఉన్న మొయిద్దీన్, గురు తండ్రి ఎందుకు శత్రువులుగా మారారు అన్నదే లాల్ సలామ్ మూవీ కథ.