Viswam Twitter Review: విశ్వం ట్విట్టర్ రివ్యూ - గోపీచంద్, శ్రీనువైట్ల కామెడీ మూవీ ప్రీమియర్స్ టాక్ ఏంటంటే?
Viswam Twitter Review: హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీనువైట్ల కాంబోలో యాక్షన్ ఎంటర్‌టనర్‌గా తెరకెక్కిన విశ్వం మూవీ శుక్రవారం రిలీజైంది. ఈ సినిమా ఓవర్‌సీస్ ప్రీమియర్ టాక్ ఎలా ఉందంటే?
Viswam Twitter Review: పెద్ద సక్సెస్‌తో కమ్‌బ్యాక్ ఇవ్వాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు హీరో గోపీచంద్. డైరెక్టర్ శ్రీనువైట్ల పరిస్థితి కూడా అలాంటిదే. హిట్టు అనే మాట వినిచాలా కాలమే అయ్యింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన తాజా మూవీ విశ్వం. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. కావ్య థాపర్ హీరోయిన్‌గా నటించింది. విశ్వం ప్రీమియర్స్ టాక్ ఎలా ఉంది? ఈ సినిమాతో హీరోగా గోపీచంద్, దర్శకుడిగా శ్రీనువైట్ల కు హిట్టు దక్కిందా? లేదా?అంటే?
టిఫికల్ శ్రీను వైట్ల మార్కు కామెడీ…
ఒకప్పుడు టాలీవుడ్‌లో కామెడీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు డైరెక్టర్ శ్రీనువైట్ల . తనదైన మార్కు ఫార్ములా కథలతో పెద్ద విజయాల్ని అందుకున్నాడు. మరోసారి తనకు అచ్చొచ్చిన కామెడీని నమ్ముకొని శ్రీనువైట్ల విశ్వం మూవీని తెరకెక్కించినట్లు నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. పక్కా శ్రీనువైట్ల మార్కు కామెడీ మూవీ ఇదని అంటున్నారు.
ఫస్ట్ హాఫ్ ఫన్‌రైడ్...
విశ్వం ఫస్ట్ హాఫ్ ఫన్‌రైడ్‌లా ఉంటుందని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. పృథ్వీ కనిపంచిన ప్రతిసీన్ హిలేరియస్‌గా నవ్విస్తుందని పేర్కొన్నాడు. హీరోహీరోయిన్ల లవ్ ట్రాక్‌ను ఫన్నీగా సాగుతుందని చెబుతోన్నారు. గోపీచంద్‌తో కావ్య థాపర్ కెమిస్ట్రీ మాస్, క్లాస్ ఆడియెన్స్‌ను మెప్పిస్తుందని అంటున్నారు.
ట్రైన్ ఎపిసోడ్...
విశ్వం సినిమాలోని ట్రైన్ ఎపిసోడ్ నాన్‌స్టాప్‌గా థియేటర్లలో నవ్విస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఎపిసోడ్‌లో వెన్నెలకిషోర్ తన కామెడీ టైమింగ్‌తో కుమ్మేశాడని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ ఇరవై నిమిషాలు, సెకండాఫ్‌లో చివరి నలభై నిమిషాలు కామెడీ బాగా వర్కవుట్ అయ్యిందట.
బోయపాటిని తలపిస్తూ...
యాక్షన్ ఎపిసోడ్స్ విషయంలో కొన్ని సీన్స్‌లో శ్రీనువైట్ల...డైరెక్టర్ బోయపాటి శ్రీనును తలపించాడని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ డిజైన్ చేసిన తీరు బాగుందని చెబుతున్నారు. కీలకమైన సెకండాఫ్‌లో శ్రీనువైట్ల తడబడ్డాడనే అంటున్నారు. అయితే ప్రీ క్లైమాక్స్ సీన్స్‌ను ఇంకాస్త బాగా తీసుంటే బాగుండేదనే నెగెటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. క్లైమాక్స్ లెంగ్తీగా ఉండటం, రొటీన్‌గా ఎండ్ కావడం అంతగా ఆకట్టుకోదని అంటున్నారు. కామెడీ కూడా అనుకున్న స్థాయిలో పండలేదంట.
కామెడీ, యాక్షన్ కలబోసిన పాత్రలో గోపీచంద్ నటన బాగుందని, స్టైలిష్ కనిపించాడని ఓ నెటిజన్ అన్నాడు. స్టైలిస్‌గా కనిపించాడని చెబుతున్నారు. విశ్వం మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేశాడు. ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్, భీమ్స్ మ్యూజిక్ అందించారు.