Gopichand: చాలా మంది ఆర్టిస్టులకు క్షమాపణలు చెప్పాను.. హీరో గోపీచంద్ కామెంట్స్
Gopichand Comments On Viswam Movie: గోపీచంద్ హీరోగా నటిస్తున్న మరో కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ విశ్వం. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ శ్రీన వైట్ల దర్శకత్వంలో మాచో స్టార్ గోపీచంద్ నటించిన విశ్వం అక్టోబర్ 11న విడుదల కానుంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో చాలా మంది ఆర్టిస్టులకు గోపీచంద్ సారీ చెప్పినట్లు తెలిపాడు.
Gopichand Sorry To Artists: మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'విశ్వం'. ఇందులో గోపీచంద్‌కు జోడీగా హీరోయిన్ కావ్యా థాపర్ నటిస్తోంది. ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
దోనేపూడి చక్రపాణి ఈ విశ్వం సినిమాను సమర్పిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్‌తో సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. దసరా కానుకగా అక్టోబర్ 11న విశ్వం మూవీ గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో గోపీచంద్ విలేకరుల సమావేశంలో విశ్వం మూవీ విశేషాలని పంచుకున్నారు.
శ్రీను వైట్ల గారు ఈ కథ నేరేట్ చేసినప్పుడు మీ ఫస్ట్ ఫీలింగ్ ఏంటీ?
- శ్రీను వైట్ల గారితో సినిమా చేయాలని చాలా బ్యాక్ అనుకున్నాం. గతంలో ఓ రెండు లైన్స్ చెప్పారు. అవి బావున్నాయి. కానీ నాకు సరిపోవనిపిస్తుందని చెప్పాను. తర్వాత 'విశ్వం' కథ లైన్‌గా చెప్పారు. పాయింట్, గ్రాఫ్‌గా చాలా బావుంది. ఇందులో అన్నీ చక్కగా కుదురుతాయనిపించింది. తర్వాత అన్నీ తన స్టయిల్‌కి తగ్గట్టుగా చేసుకోవడానికి ఆయన 7 నెలలు సమయం తీసుకొని విశ్వం కథని ఫామ్ చేశారు. ఇందులో కంప్లీట్‌గా శ్రీనువైట్ల గారి మార్క్‌తో పాటు యాక్షన్ ఫన్, కామెడీ అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయి.
విశ్వం షూటింగ్‌లో మిమ్మల్ని ఎగ్జైట్ చేసిన ఎలిమెంట్స్ ఏంటీ?
- శ్రీను వైట్ల గారితో వర్క్ చేయడం ఎగ్జైటింగ్‌గా అనిపించింది. 24 గంటలు ఆయన సినిమా తప్పితే వేరేది ఆలోచించరు. ఆయనకి సహజంగా కోపం రాదు. ఒక ఆర్టిస్ట్‌కి కంఫర్ట్ జోన్ ఇచ్చి కావాల్సిన పర్ఫార్మెన్స్‌ని రాబట్టుకోవడంలో ఆయన మాస్టర్. లౌక్యం తర్వాత అంత మంచి ఎంటర్టైన్మెంట్ విశ్వంలో కుదిరింది. షూటింగ్ చేసేటప్పుడు నేనే కొన్ని సీన్స్‌కి నవ్వు ఆపుకోలేకపోయేవాడిని. చాలామంది ఆర్టిస్టులకి సారీ కూడా చెప్పాను. సీన్స్ అంత హిలేరియస్‌గా వచ్చాయి.
ఇందులో ట్రైన్ ఎపిసోడ్ హైలెట్‌గా ఉంటుందని విన్నాం?
-శ్రీను వైట్ల గారి వెంకీ సినిమాలో పాపులర్ ట్రైన్ ఎపిసోడ్ ఉంది కాబట్టి డెఫినెట్‌గా ఆయన నుంచి మరో ట్రైన్ ఎపిసోడ్ వస్తుందంటే కంపారిజన్ ఉంటుంది. అయితే అది వేరే జోనర్, ఇది వేరే జోనర్. అయితే ఈ కంపేరిజన్‌కి విశ్వం ట్రైన్ సీక్వెన్స్ రీచ్ అవుతుంది. ఎంటర్టైన్మెంట్ చాలా అద్భుతంగా వచ్చింది. వెన్నెల కిషోర్, వీటి గణేష్, నరేష్ గారు, ప్రగతి గారు.. ఇలా అందరూ చాలా అద్భుతంగా చేశారు. ట్రైన్ సీక్వెన్స్‌లో ఎంటర్టైన్మెంట్‌తో పాటు చిన్న టెన్షన్ కూడా రన్ అవుతుంది. అది చాలా బాగుంటుంది.
ఇందులో పాప చుట్టూ కథ ఉంటుందా?
బేసిక్‌గా ఇది హీరో స్టోరీ. పాపది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్. పాపకి ఏడేళ్లు ఉంటాయి. కానీ, పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా చేసింది. ఆ పర్ఫామెన్స్ చూసి షాక్ అయ్యాను. ఆ పాప కూడా ఈ సినిమాకి చాలా ప్లస్. ఇందులో ఫాదర్ ఎమోషన్, మదర్ ఎమోషన్ అన్ని బాగా వర్కౌట్ అయ్యాయి. శ్రీనువైట్ల గారు ఎమోషన్‌ని చాలా అద్భుతంగా తీశారు.