Saindhav Twitter Review: సైంధవ్ ట్విటర్ రివ్యూ.. వెంకీ మామ యాక్షన్ అదుర్స్.. కానీ, అదొక్కటే మైనస్!-saindhav movie twitter review and venkatesh action superb ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Saindhav Twitter Review: సైంధవ్ ట్విటర్ రివ్యూ.. వెంకీ మామ యాక్షన్ అదుర్స్.. కానీ, అదొక్కటే మైనస్!

Saindhav Twitter Review: సైంధవ్ ట్విటర్ రివ్యూ.. వెంకీ మామ యాక్షన్ అదుర్స్.. కానీ, అదొక్కటే మైనస్!

Sanjiv Kumar HT Telugu
Jan 13, 2024 06:49 AM IST

Saindhav Twitter Review: విక్టరీ వెంకటేష్ తాజాగా నటించిన సినిమా సైంధవ్. జనవరి 13న శనివారం విడుదల కానున్న ఈ సినిమాపై నెటిజన్స్ రివ్యూ ఇస్తున్నారు. సినిమా ఎలా ఉందో సైంధవ్ ట్విటర్ రివ్యూలో తెలుసుకుందాం.

సైంధవ్ ట్విటర్ రివ్యూ.. వెంకీ మామ యాక్షన్ అదుర్స్..
సైంధవ్ ట్విటర్ రివ్యూ.. వెంకీ మామ యాక్షన్ అదుర్స్..

Saindhav Twitter Review: విక్టరీ వెంకటేష్ (Venkatesh) నటించిన కొత్త సినిమా సైంధవ్. హిట్ మూవీ సిరీస్ డైరెక్టర్ డాక్టర్ శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వం వహించిన సైంధవ్ మూవీని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైంధవ్ మూవీలో శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, తమిళ హీరో ఆర్య, ఆండ్రియా జెర్మియా, నవాజుద్దీన్ సిద్ధిఖీ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

వెంకటేష్ 75వ చిత్రంగా తెరకెక్కిన సైంధవ్ మూవీ జనవరి 13న సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే అమెరికాలో సైంధవ్ ప్రీమియర్ షోలు మొదలు అయ్యాయి. దీంతో ఓవర్సీస్ నుంచి సైంధవ్ ఎలా ఉందో రిపోర్ట్ ఇస్తున్నారు ఎన్నారై ప్రేక్షకులు. సైంధవ్ మూవీకి సంబంధించిన పోస్టులతో ట్విటర్‌లో రివ్యూలు ఇస్తున్నారు.

సైంధవ్ మూవీ స్టైలిష్ యాక్షన్ డ్రామా అని ఒక నెటిజన్ పేర్కొన్నాడు. వెంకటేష్ యాక్షన్ అదుర్స్ అంటున్నారు. "సైంధవ్ ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్. వెంకీ మామ అదరగొట్టాడు. సెకండాఫ్‌లో ఫైట్స్ అయితే మాములుగా లేవు. ఎమోషనల్ సీన్స్‌కు ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతారు. వెంకటేష్ వన్ మ్యాన్ షో. శైలేష్ కొలను ఫ్యాన్ బాయ్ డైరెక్షన్ అంటే ఇలా ఉండాలి" అని ఓ నెటిజన్ టిట్వర్‌లో పేర్కొన్నాడు.

"సైంధవ్ మూవీ ఫస్టాఫ్‌లో వెంకీ మామ ఎప్పుడూ చూడని విధంగా కనిపిస్తాడు. కొన్ని యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి. నేరేషన్ ప్లాట్‌గా ఉంది. ఇంటర్వెల్ బాగుంది. గుడ్ ఫస్టాఫ్. సెకండాఫ్‌లో స్టోరీ బాగుంది. యాక్షన్ సీక్వెన్స్ థియేటర్స్‌లో బ్లాస్ట్ చేస్తాయి. క్లైమాక్స్ కూడా బాగుంది. ఓవరాల్‌గా సైంధవ్ ఎంటర్టైన్ చేస్తుంది. బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది" అంటూ 5కి 3 స్టార్ రేటింగ్ ఇచ్చారు ఒకరు.

"సైంధవ్ మొదటి 30 నిమిషాలు చాలా స్లోగా సాగుతుంది. తర్వాత ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్‌తో పిక్ అప్ అవుతుంది. యాక్షన్ సీక్వెన్స్, పర్ఫామెన్సెస్ బాగున్నాయి. బీజీఎమ్ ఇంకాస్తా బెటర్‌గా ఉండాల్సింది. ఇప్పటివరకు అయితే బాగానే ఉంది" అంటూ సైంధవ్ మూవీ ఫస్టాఫ్‌పై రివ్యూ ఇచ్చారు.

"హీరో కెరీర్‌లోనే బెస్ట్ క్లైమాక్స్ ఇది. వెంకీ ఆన్ డ్యూటి. మొత్తంగా అన్ని రకాల ఎమోషన్స్‌తో యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ. సాన సార్ ఇంకొంచెం డ్యూటి చేసి ఉంటే కొన్ని బ్లాక్స్ నెక్ట్స్ లెవెల్ ఉండేవి" అని ఒకరు రాసుకొచ్చారు. "సైంధవ్‌లో మై హీరో వెంకీ మామ అదరగొట్టాడు. ఫస్ట్ హాఫ్ వెరీ గుడ్. సెకండాఫ్ ఎక్సలెంట్. ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ పక్కా. క్లైమాక్స్ బాగా వర్కౌట్ అయింది. ఫ్యాన్స్‌కు మాత్రం పండగే. యాక్షన్ ప్రియులకు చాలా నచ్చుతుంది" అని వెంకీ ఫ్యాన్ చెప్పుకొచ్చాడు.

Whats_app_banner