Sheesh Mahal Movie: ఈ వారం థియేటర్లలో...నెక్ట్స్ వీక్ ఓటీటీలో రిలీజ్ కాబోతోన్న రాహుల్ రామకృష్ణ ఆంథాలజీ మూవీ
13 February 2024, 9:30 IST
Sheesh Mahal Movie: రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన శీష్ మహల్ మూవీ థియేటర్లలో ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. వారం గ్యాప్‌లోనే ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.
శీష్ మహల్ మూవీ
Sheesh Mahal Movie: టాలీవుడ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన శీష్ మహల్ మూవీ థియేటర్లలో ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతోంది. ఆ తర్వాత వారం గ్యాప్‌లోనే ఓటీటీలో శీష్ మహాల్ స్ట్రీమింగ్ కానుంది. ఈ అంథాలజీ మూవీని ఫిబ్రవరి 14 నుంచి హైదరాబాద్‌లోని ఐమాక్స్ థియేటర్‌లో స్క్రీనింగ్ చేయబోతున్నారు. ఫిబ్రవరి 22 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో శీష్ మహాల్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ ట్రైలర్‌ను ఈటీవీ విన్ ఓటీటీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. శీష్ మహల్ మూవీకి క్యాంప్ శశి దర్శకత్వం వహించాడు.
నాలుగు కథలతో...
హైదరాబాద్‌లోని ఓ ఫిల్మ్ ఫెస్టివల్ బ్యాక్‌డ్రాప్‌లో నాలుగు కథలతో అంథాలజీగా శీష్ మహల్ మూవీ తెరకెక్కుతోంది. ఫిలిం ఫెస్టివల్ కోసం సినిమా చేయాలని సంకల్పించిన కొందరు ఎలాంటి కష్టాలు పడ్డారు? తమ కలను ఎలా సాకారం చేసుకున్నరన్నది రియలిస్టిక్‌గా ఈ ట్రైలర్‌లో చూపించారు. రాహుల్ రామకృష్ణ డైలాగ్‌తో ఫన్నీగా శీష్ మహల్ ట్రైలర్ ప్రారంభమైంది. కెమెరామెన్‌కు సెన్సిబిలిటీ ఉండదారా...కెమెరా పట్టుకొని కింద దొర్లుతడారా అంటూ చెప్పడం ఆకట్టుకుంటుంది.
క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాను అంటూకెమెరామెన్ రాహుల్ రామకృష్ణతో చెప్పడం నవ్వులను పంచుతోంది. చిత్తు కాగితాలు ఏరుకునే పిల్లలకు సినిమా రీల్ దొరకడం, ఓ టీనేజ్ జంట మధ్య లవ్ స్టోరీని ఇందులో చూపించారు. తెలంగాణ యాసతో పాటు హైదరాబాదీ యాసలో హిందీ, ఉర్దూ మిక్స్‌తో శీష్ మహాల్‌లో వినిపించేడైలాగ్స్ ఆసక్తిని పంచుతోన్నాయి.
పదిహేను లక్షల్లో కంప్లీట్...
2013లోనే శీష్ మహల్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. కేవలం పదిహేను లక్షల బడ్జెట్‌తో 5డీ కెమెరాతో హైదరాబాద్‌లోనే ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేశారు. ఏడు లక్షలు షూటింగ్ పూర్తిచేయగా...మరో ఎనిమిది లక్షల్లో పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం .వెచ్చించినట్లు డైరెక్టర్ తెలిపాడు. శీష్ మహల్ సినిమాకు పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది ఫేమ్ వివేక్ సాగర్ మ్యూజిక్ అందించాడు. ఫిల్మ్స్ ఫెస్టివల్స్ కోసమే ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీలో కొత్త నటీనటులు కీలక పాత్రలు పోషించినట్లు సమాచారం.
అర్జున్ రెడ్డికి ముందు...
అర్జున్‌రెడ్డికి ముందు రాహుల్ రామకృష్ణ నటించిన మూవీ ఇది. అర్జున్‌రెడ్డితో టాలీవుడ్‌లో ఫేమస్ అయ్యాడు. భరత్ అనే నేను, సమ్మోహనం, హుషారు, ఆరఆర్ఆర్‌తో పాటు తెలుగులో పలు విజయవంతమైన సినిమాల్లో కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాహుల్ రామకృష్ణ కనిపించాడు. ఇంటింటి రామాయణం, మిఠాయితో పాటు మరికొన్ని సినిమాల్లో హీరోగా నటించాడు.
తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన కీడాకోలా సినిమాలో ఓ పాటను రాశాడు రాహుల్ రామకృష్ణ. ఖుషి తర్వాత యాక్టింగ్‌కు బ్రేక్ తీసుకున్నాడు రాహుల్ రామకృష్ణ. గ్యాంగ్‌స్టర్స్ అనే వెబ్‌సిరీస్ కూడా చేశాడు. అమెజాన్ ప్రైమ్‌లో ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.
టాపిక్