తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2 Record: ఇండియన్ సినిమాలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన పుష్ప 2.. కళ్లు చెదిరే ఓటీటీ డీల్‌తో..

Pushpa 2 Record: ఇండియన్ సినిమాలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన పుష్ప 2.. కళ్లు చెదిరే ఓటీటీ డీల్‌తో..

Hari Prasad S HT Telugu

18 April 2024, 21:59 IST

google News
    • Pushpa 2 Record: ఇండియన్ సినిమాలో కనీవినీ ఎరగని రికార్డును సొంతం చేసుకుంది పుష్ప 2 మూవీ. తొలి రూ.1000 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ మూవీగా అల్లు అర్జున్ సినిమా నిలిచింది.
ఇండియన్ సినిమాలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన పుష్ప 2.. కళ్లు చెదిరే ఓటీటీ డీల్‌తో..
ఇండియన్ సినిమాలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన పుష్ప 2.. కళ్లు చెదిరే ఓటీటీ డీల్‌తో..

ఇండియన్ సినిమాలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన పుష్ప 2.. కళ్లు చెదిరే ఓటీటీ డీల్‌తో..

Pushpa 2 Record: పుష్ప 2 మూవీకి ఉన్న క్రేజ్ ను మేకర్స్ ఓ రేంజ్ లో వాడుకుంటున్నారు. ఈ ఏడాది మోస్ట్ అవేటెడ్ మూవీగా నిలుస్తున్న పుష్ప ది రూల్ సినిమా.. ఇప్పటి వరకూ ఇండియన్ సినిమాలో ఏ ఇతర మూవీకి సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకుంది. అధికారికంగా ఇప్పుడీ పుష్ప 2 మూవీ రూ.1000 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన తొలి ఇండియన్ మూవీగా నిలిచింది.

పుష్ప 2 రికార్డు

అల్లు అర్జున్, రష్మిక మందన్నా నటిస్తున్న పుష్ప మూవీ రెండున్నరేళ్ల కిందట బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది. అప్పటి నుంచే ఈ మూవీ సీక్వెల్ పై ఆసక్తి నెలకొంది. కేజీఎఫ్ 2 మూవీ సూపర్ హిట్ అయిన తర్వాత పుష్ప సీక్వెల్ ను మరింత జాగ్రత్తగా సుకుమార్ తీస్తుండటంతో చాలా ఆలస్యమైంది. మొత్తానికి ఈ ఏడాది ఆగస్ట్ 15న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ మధ్యే సినిమా టీజర్ కూడా రిలీజ్ చేశారు. అందులో కాళీ అవతారంలో చీర కట్టుకొని అల్లు అర్జున్ చూపించిన విశ్వరూపం అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఇదొక్క సీన్ తో మూవీపై ఉన్న అంచనాలను మరింత పెరిగాయి. ఇదే అదునుగా పుష్ప 2 ఊహకందని రీతిలో ప్రీరిలీజ్ బిజినెస్ చేస్తోంది. ఇప్పటి వరకూ బాహుబలి 2, కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్ సినిమాలకు కూడా సాధ్యం కాని రీతిలో రూ.1000 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది.

రికార్డు ధరకు ఓటీటీ హక్కులు

పుష్ప 2 మూవీ హిందీ బెల్ట్ హక్కులను రూ.200 కోట్లకు అమ్మిన విషయం తెలిసిందే. ఇక సౌత్ఇండియాలో మిగతా భాషల మొత్తం బిజినెస్ రూ.270 కోట్ల వరకూ ఉండనుంది. ఓవర్సీస్ మార్కెట్ హక్కులకు మరో రూ.100 కోట్లు రానున్నాయి. ఈ లెక్కన థియేట్రికల్ హక్కుల ద్వారానే ఈ సినిమాకు రూ.550 కోట్లు రానున్నాయి.

తాజాగా వస్తున్న వార్తల ప్రకారం నెట్‌ఫ్లిక్స్ ఈ పుష్ప 2 డిజిటల్ హక్కులను ఏకంగా రూ.275 కోట్లకు సొంతం చేసుకుంది. ఇది గతంలో ఏ ఇండియన్ సినిమాకూ సాధ్యం కాని రికార్డు. బాక్సాఫీస్ రిపోర్టును బట్టి ఇది రూ.300 కోట్ల వరకూ వెళ్లే అవకాశం కూడా ఉంది. ఇక మూవీ ఆడియో, శాటిలైట్ హక్కులకు మరో రూ.450 కోట్లు లెక్కగడుతున్నారు.

దీంతో అన్నీ కలిపి ప్రీరిలీజ్ బిజినెస్ రూపంలోనే పుష్ప 2 మూవీకి రూ.1000 కోట్లు రానున్నాయి. రిలీజ్ కు ముందే ఈ రేంజ్ లో సంచలనం సృష్టించిన సినిమా మరొకటి లేదు. రిలీజ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఈ సినిమా క్రేజ్ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఊహించినట్లే భారీ ఓపెనింగ్స్ వచ్చి, మూవీకి పాజిటివ్ రివ్యూలు కూడా వస్తే మాత్రం బాక్సాఫీస్ దగ్గర కూడా రికార్డులు బ్రేక్ చేయడం ఖాయం.

మొత్తానికి పుష్ప మూవీతో నేషనల్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్.. ఇప్పుడీ సీక్వెల్ తో పాన్ ఇండియా స్థాయిలో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు.

తదుపరి వ్యాసం