Pushpa 2: పుష్ప 2 థియేటర్లలో ‘జాట్’ మూవీ సందడి.. అల్లు అర్జున్ క్రేజ్‌ను వాడుకోబోతున్న బాలీవుడ్ సినిమా
04 December 2024, 19:49 IST
Pushpa 2 The Rule: ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 మూవీ 12,500 థియేటర్లలో రిలీజ్‌కాబోతోంది. ఈ అన్ని థియేటర్లలోనూ జాట్ మూవీ సందడి చేయనుంది. ఎలా అంటే?
పుష్ప 2 థియేటర్లలో జాట్ మూవీ
దేశవ్యాప్తంగా ఇప్పుడు పుష్ప-2 మేనియా నడుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 : ది రూల్ మూవీ డిసెంబరు 5 (గురువారం) థియేటర్లలోకి రాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్లలో పుష్ప 2 విడుదలకానుండటంతో.. ఈ క్రేజ్‌ను ‘జాట్’ అనే బాలీవుడ్ మూవీ వాడుకునేందుకు సిద్ధమైంది.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సన్నీ డియోల్ నటించిన ‘జాట్’ సినిమా ట్రైలర్‌ను పుష్ప 2 మూవీ థియేటర్లలో ప్రదర్శించనున్నారు. అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్‌కి సౌత్‌లో ఉన్న క్రేజ్‌ని వాడుకోవాలని జాట్ మూవీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
జాట్ సినిమాలో సన్నీ డియోల్, రణ్ దీప్‌తో పాటు వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్, రెజీనా కసాండ్రా తదితరులు నటించారు. ఈ మూవీకి థమన్ సంగీతం అందించారు.
హాట్‌కేకుల్లా పుష్ప 2 టికెట్లు
పుష్ప 2 మూవీ రిలీజ్‌కి ముందే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో రూ.100 కోట్లకి పైగా వసూళ్లని రాబట్టింది. 2021లో పుష్ప: ది రైజ్ తర్వాత అల్లు అర్జున్ నుంచి వస్తున్న సినిమా కావడంతో.. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాంతో దేశ వ్యాప్తంగా హాట్‌కేకుల్లా టికెట్లు అమ్ముడుపోతున్నాయి.
ఇప్పటికే ముంబయి, ఢిల్లీ వంటి నగరాల్లో టికెట్ రేట్లు రూ.1500 దాటిపోగా.. హైదరాబాద్‌లో రూ.800-1,000 పలుకుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ మూవీ టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఆరు భాషల్లో పుష్ప సినిమా రిలీజ్ అవుతోంది.
టాపిక్