Pushpa 2 Collection: పుష్ప 2కి 1050 కోట్లు- కల్కి టోటల్ కలెక్షన్సే టార్గెట్- ఇంకా హిట్ కొట్టని మూవీ- మరి ఎంత రావాలంటే?
12 December 2024, 11:42 IST
Pushpa 2 The Rule 7 Days Worldwide Box Office Collection: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ యాక్ట్ చేసిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప 2 ది రూల్ మూవీ ఆరు రోజుల్లో రూ. 1002 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టి అరుదైన రికార్డ్ సాధించింది. ఈ నేపథ్యంలో పుష్ప 2కి ఏడు రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్స్ వచ్చాయో చూద్దాం.
పుష్ప 2కి 1050 కోట్లు- కల్కి టోటల్ కలెక్షన్సే టార్గెట్- ఇంకా హిట్ కొట్టని మూవీ- మరి ఎంత రావాలంటే?
Pushpa 2 Box Office Collection Day 7: పుష్పరాజ్‌గా అల్లు అర్జున్, శ్రీవల్లిగా రష్మిక మందన్న మరోసారి జంటగా నటించిన సినిమా 'పుష్ప 2: ది రూల్'. సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన పుష్ప 2 చిత్రం ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా రూ. 1,000 కోట్లకుపైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ ఫీట్‌తో ఈ యాక్షన్ డ్రామా చిత్రం అత్యంత వేగంగా 'ఎలైట్ క్లబ్'లో చేరిన భారతీయ చిత్రంగా నిలిచింది.
ఏడో రోజున కలెక్షన్స్
అలాగే, ఇప్పటి వరకు సుమారు అరడజను చిత్రాల మార్కు హిట్‌ను దాటేసింది పుష్ప 2. ఆరు రోజుల్లో పుష్ప 2 ది రూల్ సినిమాకు రూ. 1002 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఇక ఏడో రోజున ఇండియాలో పుష్ప 2 మూవీకి రూ. 42 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి.
వాటిలో తెలుగు నుంచి రూ. 9 కోట్లు, తమిళంలో రూ. 2 కోట్లు, కన్నడ ద్వారా రూ. 60 లక్షలు, మలయాళంలో రూ. 40 లక్షల కలెక్షన్స్ ఉండగా.. ఒక్క హిందీ బెల్ట్ నుంచే రూ. 30 కోట్లు ఉన్నాయి. అంటే, తెలుగులో మించి హిందీ కలెక్షన్స్ ఉన్నాయి. ఇదిలా ఉంటే, ఆరో రోజుతో పోలిస్తే ఏడో రోజున పుష్ప 2 కలెక్షన్స్‌లో తగ్గుదల కనిపించింది. సుమారుగా 18.53 శాతం ఏడో రోజున పడిపోయాయి.
పుష్ప 2 ఫస్ట్ వీక్ బాక్సాఫీస్
ఇక అల్లు అర్జున్ యాక్షన్ ఎంటర్‌టైనర్ పుష్ప 2 మొదటి వారంలోకి అడుగుపెట్టింది. ఏడు రోజుల్లో ఇండియాలో పుష్ప 2 ది రూల్ సినిమాకు రూ. 687 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ సంస్థ సక్నిల్క్ తెలిపింది. ఇందులో తెలుగు నుంచి రూ. 232.75 కోట్లు, హిందీ బెల్ట్ నుంచి రూ. 398.1 కోట్లు, తమిళ వెర్షన్‌కు రూ. 39 కోట్లు, కన్నడలో రూ. 5.05 కోట్లు, మలయాళంలో రూ.12.1 కోట్లు వసూలు చేసింది.
7 రోజుల్లో వచ్చిన పుష్ప 2 ఇండియా నెట్ కలెక్షన్స్‌లో కూడా తెలుగు కంటే హిందీలోనే ఎక్కువ ఉండటం విశేషం. ఇక వరల్డ్ వైడ్‌గా ఏడు రోజుల్లో పుష్ప 2 మూవీ రూ. 1025 నుంచి రూ. 1050 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ అనిలిస్ట్‌లు అంచనా వేస్తున్నారు.
లైఫ్ టైమ్ కలెక్షన్స్‌పై కన్ను
అయితే, షారుక్ ఖాన్ పఠాన్ రూ. 1050 కోట్లు, జవాన్‌కు రూ. 1146 కోట్లు, ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీకి రూ. 1100 నుంచి 1200 కోట్లు లైఫ్ టైమ్ కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు పుష్ప రాజ్ కన్ను పఠాన్, జవాన్, కల్కి 2898 ఏడీ లైఫ్ టైమ్ కలెక్షన్స్‌పై పడినట్లు తెలుస్తోంది. పుష్ప 2 ఏడు రోజుల కలెక్షన్స్ రూ. 1050కి చేరుకుంటే పఠాన్ లైఫ్ టైమ్ కలెక్షన్స్ బ్రేక్ చేసినట్లే అవుతుంది.
ఇక డిసెంబర్ 11న తెలుగులో పుష్ప 2 మూవీకి 29.92 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది. ఇదిలా ఉంటే, పుష్ప 2 మూవీకి వరల్డ్ వైడ్‌గా రూ. 617 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగ్గా.. రూ. 620 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది. ఇప్పటికీ 78 శాతం రికవరీ చేసిన పుష్ప 2 ది రూల్ మూవీ క్లీన్ హిట్ స్టేటస్ సొంతం చేసుకోవాలంటే ఇంకా రూ. 140.80 కోట్లు రాబట్టిల్సి ఉందని సమాచారం.