తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2 Success Meet: కల్యాణ్ బాబాయ్.. థ్యాంక్యూ: పుష్ప 2 సక్సెస్ మీట్‌లో పవన్ కల్యాణ్‌కు అల్లు అర్జున్ థ్యాంక్స్

Pushpa 2 Success Meet: కల్యాణ్ బాబాయ్.. థ్యాంక్యూ: పుష్ప 2 సక్సెస్ మీట్‌లో పవన్ కల్యాణ్‌కు అల్లు అర్జున్ థ్యాంక్స్

Hari Prasad S HT Telugu

07 December 2024, 20:49 IST

google News
    • Pushpa 2 Success Meet: పుష్ప 2 సక్సెస్ మీట్ లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు థ్యాంక్స్ చెప్పాడు అల్లు అర్జున్. మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలు అన్న వార్తల నేపథ్యంలో బన్నీ చేసిన ఈ కామెంట్స్ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
కల్యాణ్ బాబాయ్.. థ్యాంక్యూ: పుష్ప 2 సక్సెస్ మీట్‌లో పవన్ కల్యాణ్‌కు అల్లు అర్జున్ థ్యాంక్స్
కల్యాణ్ బాబాయ్.. థ్యాంక్యూ: పుష్ప 2 సక్సెస్ మీట్‌లో పవన్ కల్యాణ్‌కు అల్లు అర్జున్ థ్యాంక్స్

కల్యాణ్ బాబాయ్.. థ్యాంక్యూ: పుష్ప 2 సక్సెస్ మీట్‌లో పవన్ కల్యాణ్‌కు అల్లు అర్జున్ థ్యాంక్స్

Pushpa 2 Success Meet: పుష్ప 2 మూవీ రిలీజ్ అయినప్పటి నుంచీ మూవీ సక్సెస్ కంటే కూడా అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య వార్ తీవ్ర స్థాయికి చేరిందన్న వార్తలే వైరల్ అయ్యాయి. మూవీలో మెగా ఫ్యామిలీని ఉద్దేశించి పరోక్షంగా డైలాగ్స్ ఉన్నాయని, బయట కూడా బన్నీ ఆ కుటుంబానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నాడన్న వార్తల నేపథ్యంలో తాజాగా పుష్ప 2 సక్సెస్ మీట్ లో పవన్ కల్యాణ్ కు అర్జున్ థ్యాంక్స్ చెప్పాడు.

కల్యాణ్ బాబాయ్.. థ్యాంక్యూ

పుష్ప 2 మూవీ రిలీజై రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకుపైగా వసూలు చేసింది. మూడు రోజుల్లో ఈ మొత్తం రూ.600 కోట్లు దాటుతుందని ముందస్తు అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పుష్ప 2 మూవీ టీమ్ గ్రాండ్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఇందులో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు థ్యాంక్స్ చెప్పాడు.

ఏపీలో పుష్ప 2 మూవీ టికెట్ల ధరలను పెంచుకోవడానికి అనుమతిస్తూ జారీ చేసిన జీవోకు బన్నీ కృతజ్ఞతలు చెప్పాడు. మొదట ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారికి థ్యాంక్స్ అని చెప్పిన అల్లు అర్జున్.. తర్వాత వ్యక్తిగతంగా కల్యాణ్ బాబాయ్.. థ్యాంక్యూ.. మీరు చూపించిన ఈ ప్రేమకు రుణపడి ఉంటాను అని అనడం విశేషం. అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య విభేదాలు అన్న వార్తల నేపథ్యంలో బన్నీ చేసిన ఈ కామెంట్స్ కు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.

ఏపీలో పుష్ప 2కి రాజకీయ రంగు

ఏపీలో ఇప్పటికే పుష్ప 2 మూవీకి రాజకీయ రంగు పులుముకున్న విషయం తెలిసిందే. ఏపీ ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి తరఫున అల్లు అర్జున్ ప్రచారం చేయడంతో.. ఈ పుష్ప 2 మూవీకి మద్దతిస్తూ ఆ పార్టీ ఏపీలో పోస్టర్లు తీసుకొచ్చింది. అటు మెగా ఫ్యామిలీ అభిమానులు కొందరు సోషల్ మీడియా ద్వారా మూవీకి నెగటివ్ రివ్యూలు ఇచ్చే ప్రయత్నం చేశారు. అంతేకాదు మెగా ఫ్యామిలీని లక్ష్యంగా చేసుకుంటూ పుష్ప 2 మూవీలో కొన్ని డైలాగ్స్ ఉన్నాయంటూ కొందరు ఫేక్ డైలాగ్స్ ను కూడా తెరపైకి తీసుకొచ్చారు.

ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ కు అల్లు అర్జున్ థ్యాంక్స్ చెప్పడం నిజంగా విశేషమే. నిజానికి ఇటు తెలంగాణలోనూ టికెట్ల ధరల పెంపుకు అనుమతి ఇవ్వడంతో సీఎం రేవంత్ రెడ్డికి మూవీ రిలీజ్ కు ముందు కూడా అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు చెప్పాడు. తాజాగా మరోసారి సక్సెస్ మీట్ లో రేవంత్ రెడ్డితోపాటు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కూడా బన్నీ థ్యాంక్స్ చెప్పాడు. అయితే ఈ టికెట్ల ధరలను భారీగా పెంచడం కూడా తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 కలెక్షన్లపై ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది. హిందీతో పోలిస్తే.. ఇప్పటికీ తెలుగు వెర్షన్ వసూళ్ల కాస్త తక్కువగానే ఉన్నాయి.

తదుపరి వ్యాసం