తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2 Collection: 1500 కోట్లకు దగ్గరిలో పుష్ప 2.. అల్లు అర్జున్ మూవీ 14 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్, లాభాలు ఇవే!

Pushpa 2 Collection: 1500 కోట్లకు దగ్గరిలో పుష్ప 2.. అల్లు అర్జున్ మూవీ 14 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్, లాభాలు ఇవే!

Sanjiv Kumar HT Telugu

19 December 2024, 11:18 IST

google News
    • Pushpa 2 Worldwide Box Office Collection Day 14: అల్లు అర్జున్, రష్మిక మందన్నా పుష్ప 2 కలెక్షన్స్‌లలో తగ్గేదే లే అన్నట్లు సాగుతున్నాయి. 14వ రోజున ఇండియాలో పుష్ప 2 నెట్ కలెక్షన్స్ రూ. 973 కోట్లకు చేరుకున్నాయి. మరి 14 రోజుల్లో పుష్ప 2 ది రూల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్, లాభాలు ఎంతో లుక్కేద్దాం.
అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ మూవీ 14 రోజుల వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్, లాభాలు!
అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ మూవీ 14 రోజుల వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్, లాభాలు! (Photo: X)

అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ మూవీ 14 రోజుల వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్, లాభాలు!

Pushpa 2 The Rule 14 Days Box Office Collection: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 2: ది రూల్ ఈ బుధవారమే (డిసెంబర్ 18) బాక్సాఫీస్ వద్ద రెండు వారాల రన్ పూర్తి చేసుకుంది. అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇంకా జోరు చూపిస్తోంది.

పుష్ప 2 డే 14 కలెక్షన్స్

భారతదేశంలో పుష్ప 2 మూవీకి 14వ రోజున రూ. 20.8 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. వాటిలో తెలుగు నుంచి రూ. 3.25 కోట్లు రాగా హిందీ బెల్ట్‌లో అత్యధికంగా 16.25 కోట్లు వచ్చాయి. ఇక తమిళం నుంచి కోటి వస్తే.. కన్నడ, మలయాళం నుంచి చెరో 15 లక్షలు మాత్రమే వసూలు అయింది. అయితే, 13వ రోజుతో పోల్చుకుంటే 14వ రోజు ఇండియాలో పుష్ప 2 కలెక్షన్స్ 10.92 శాతం తగ్గాయి.

ఇండియాలో నెట్ కలెక్షన్స్

అంటే, 13వ రోజున 10 శాతం తగ్గిన కలెక్షన్స్ 14వ రోజు వచ్చేసరికి సుమారుగా 11 శాతం పడిపోయాయని తెలుస్తోంది. ఇక 14 రోజుల్లో ఇప్పటివరకు పుష్ప 2 ది రూల్ మూవీ ఇండియాలో రూ. 973.2 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. అయితే, తొలివారంలో రూ. 725.8 కోట్ల నెట్‌ను రాబట్టిన పుష్ప 2 రెండో వారంలో ఒక్కసారిగా కలెక్షన్లు పెరిగాయి.

హిందీలోనే ఎక్కువగా

దాంతో పుష్ప 2 కలెక్షన్స్ భారత్ మార్కెట్‌లో 973.2 కోట్లకు చేరుకుంది. ఈ కలెక్షన్స్‌లో తెలుగు నుంచి రూ. 293.3 కోట్లు వస్తే హిందీ ద్వారా 607.35 కోట్లు వచ్చాయి. తమిళం నుంచి 51.6 కోట్లు రాబట్టిన పుష్ప రాజ్ కన్నడ నుంచి 7.02 కోట్లు, మలయాళంలో 13.93 కోట్లు వసూలు చేశాడు. అంటే, ఒక్క హిందీలోనే 14 రోజుల్లో రూ. 607.35 కోట్ల నెట్ కలెక్షన్స్ రావడం విశేషం.

స్త్రీ 2 ఓవరాల్ కలెక్షన్స్‌కు

అంటే, బాలీవుడ్ హారర్ కామెడీ బ్లాక్ బస్టర్ మూవీ స్త్రీ 2 ఓవరాల్ ఇండియా నెట్ కలెక్షన్స్‌ (రూ. 627.50)కు దగ్గరిలో పుష్ప 2 హిందీ కలెక్షన్స్ ఉన్నాయి. 14వ రోజు అయిన బుధవారం నాడు తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 ది రూల్ మూవీకి 20.58 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది. విదేశాల్లో కూడా పుష్ప 2 కలెక్షన్స్ అదిరిపోతున్నాయి.

వరల్డ్ వైడ్ కలెక్షన్స్-ప్రాఫిట్

ఇప్పటికే ఆస్ట్రేలియాలో పుష్ప 2కి నాలుగు మిలియన్ డాలర్లకుపైగా (సుమారుగా 21.16 కోట్లు) కలెక్షన్స్ నమోదు అయ్యాయి. ఇక వరల్డ్ వైడ్‌గా పుష్ప 2కి 14 రోజుల్లో సుమారుగా రూ. 1500 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లుగా బాలీవుడ్ మీడియా చెబుతోంది. ఇదిలా ఉంటే, ఇప్పటికే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసుకున్న పుష్ప 2 మూవీకి రూ. 50 కోట్ల వరకు లాభాలు వచ్చినట్లు సమాచారం.

తదుపరి వ్యాసం