Aadujeevitham Telugu: మలయాళంలో వంద కోట్ల కలెక్షన్స్ - తెలుగులో ఫస్ట్ వీక్‌లోనే ది గోట్‌లైఫ్ థియేటర్ల నుంచి ఔట్
06 April 2024, 9:39 IST
Aadujeevitham Telugu: పృథ్వీరాజ్ సుకుమారన్ ఆడుజీవితం మూవీ తెలుగు వెర్షన్ ఫస్ట్ వీక్ కాకముందే థియేటర్లలో కనిపించకుండాపోయింది. ఈ మూవీ మలయాళంలో 45 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టగా తెలుగులో మాత్రం కోటిలోపే వసూళ్లు వచ్చాయి.
పృథ్వీరాజ్ సుకుమారన్ ఆడుజీవితం
Aadujeevitham Telugu: పృథ్వీరాజ్ సుకుమారన్‌కు తెలుగు ప్రేక్షకులు ఊహించని షాకిచ్చారు. అతడి లేటెస్ట్ మూవీ ఆడుజీవితం (ది గోట్‌లైఫ్) తెలుగు వెర్షన్‌ను వారం కూడా కాకముందే థియేటర్ల నుంచి ఎత్తేశారు. మలయాళంలో ఫస్ట్ వీక్ తర్వాత కూడా 200లకుపైగా థియేటర్లలో ఆడుతోన్న ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సింగిల్ థియేటర్‌లో కూడా ఆడటం లేదు.
వంద కోట్ల క్లబ్‌లో...
శుక్రవారం నాటితో ఆడుజీవితం వంద కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టినట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. ఇందులో మలయాళ వెర్షన్ 90 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. తెలుగులో మాత్రం రిజల్ట్ రివర్స్‌గా ఉంది. కోటిలోపే ది గోట్‌లైఫ్ మూవీ కలెక్షన్స్ దక్కించుకున్నట్లు చెబుతున్నారు.
పృథ్వీరాజ్ ప్రమోషన్స్ చేసినా...
ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే ది గోట్ లైఫ్ తెలుగు వెర్షన్‌కు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. సినిమా చాలా స్లోగా ఉందనే విమర్శలొచ్చాయి. కథలో ఎలాంటి ట్విస్ట్‌లు, టర్న్‌లు లేకుండా ఫ్లాట్‌గా ఉండంటం కూడా మైనస్‌గా మారింది. ది గోట్‌లైఫ్ తెలుగు వెర్షన్ కోసం హీరో పృథ్వీరాజ్ సుకుమార్ గట్టిగానే ప్రమోషన్స్ చేశాడు. ప్రభాస్‌తో పాటు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీస్ సినిమా బాగుందంటూ సోషల్ మీడియాలో ట్వీట్లు, పోస్ట్‌లు చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థ ది గోట్‌లైఫ్‌ను రిలీజ్ చేసినా తెలుగు ప్రేక్షకులు మాత్రం పెద్దగా ఈ మూవీని పట్టించుకోలేదు.
టిల్లు స్క్వేర్ దెబ్బకు...
గోట్‌లైఫ్ రిలీజైన తర్వాత రోజు టిల్లు స్క్వేర్ ప్రేక్షకుల ముందుకు రావడం కూడా పృథ్వీరాజ్ సుకుమారన్ మూవీపై ఎఫెక్ట్ పడింది. టిల్లు స్క్వేర్ కు పాజిటివ్ టాక్ రావడంతో గోట్‌లైఫ్ ను థియేటర్ల నుంచి ఎత్తేసి వాటిని సిద్దు జొన్నలగడ్డ మూవీకి కేటాయించారు.
2009లో అనౌన్స్ --2024లో రిలీజ్..
ఆడు జీవితం సినిమాకు బ్లెస్సీ దర్శకత్వం వహించాడు. బెన్యామిన్ రాసిన గోట్‌లైఫ్ నవల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. 2009లో గోట్‌లైఫ్ అనౌన్స్‌చేసిన ఈ మూవీ 2024లో రిలీజైంది. 1990వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళను అరబ్ దేశానికి వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి కథతో వాస్తవ ఘటనల ఆధారంగా "ది గోట్ లైఫ్ష మూవీ తెరకెక్కింది.
నజీబ్ పాత్ర కోసం పృథ్వీరాజ్ సుకుమారన్ ట్రాన్స్‌ఫర్మేషన్, యాక్టింగ్‌కు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ పాత్ర కోసం అతడు 31 కిలోల బరువు తగ్గినట్లు సమాచారం. ఆడుజీవితం సినిమాకుగాను పృథ్వీరాజ్‌కు నేషనల్ అవార్డ్ రావడం పక్కా అని సినీ వర్గాలు చెబుతోన్నాయి.
అమలాపాల్ హీరోయిన్...
ఆడుజీవితం సినిమాలో అమలాపాల్ హీరోయిన్‌గా నటించింది. ఆమె క్యారెక్టర్ లెంగ్త్ కూడా తక్కువ కావడంతో ఆడియెన్స్ డిసపాయింట్ అయ్యారు. హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, కేఆర్ గోకుల్, అరబ్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే కీలక పాత్రల్లో నటించారు. సలార్ సినిమాలో ప్రభాస్ స్నేహితుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటించాడు. గత ఏడాది డిసెంబర్‌లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ 600 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. సలార్ 2లో పృథ్వీరాజ్ సుకుమారన్ క్యారెక్టర్ నెగెటివ్ షేడ్స్‌లో కనిపించబోతున్నట్లు సమాచారం.