Amala Paul Second Marriage: హీరోయిన్ అమలాపాల్ రెండో పెళ్లికి సిద్ధమైంది. ప్రియుడు జగత్ దేశాయ్‌తో త్వరలోనే ఆమె ఏడడుగులు వేయబోతున్నది. గురువారం అమలాపాల్ పుట్టినరోజు సందర్భంగా పెళ్లిపై జగత్ దేశాయ్ క్లారిటీ ఇచ్చారు.
అమలాపాల్ బర్త్‌డేను ఓ రిసార్ట్‌లో ఘనంగా సెలబ్రేట్ చేశాడు జగత్ దేశాయ్. ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈ వీడియోలో డ్యాన్సర్స్‌తో కలిసి స్టెప్పులు వేసిన జగత్ దేశాయ్... అమలాపాల్‌ను ఇంప్రెస్ చేశాడు. ఆ తర్వాత అమలాపాల్‌కు రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేశాడు.
అతడి ప్రపోజల్‌కు అమలాపాల్ ఓకే చెప్పింది. జగత్‌దేశాయ్‌కి లిప్ కిస్ ఇచ్చింది. ఈ వీడియోను ఉద్దేశించి నా రాణి ఓకే చెప్పింది. త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. హ్యాపీ బర్త్ డే మై లవ్ అంటూ జగత్ దేశాయ్ పేర్కొన్నాడు. జగత్ దేశాయ్ పోస్ట్‌తో చూస్తుంటే త్వరలోనే వీరిద్దరు పెళ్లిపీటలెక్కబోతుండటం ఖాయంగానే కనిపిస్తోంది. జగత్ దేశాయ్ వ్యాపారవేత్త అని సమాచారం. స్నేహితుల ద్వారా జగత్ దేశాయ్‌తో అమలాపాల్‌కు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారినట్లు చెబుతోన్నారు.
కాగా అమలాపాల్‌కు ఇది రెండో వివాహం కావడం గమనార్హం. గతంలో తమిళ డైరెక్టర్ ఏఎల్ విజయ్‌ని పెళ్లి చేసుకున్నది అమలపాల్.. మనస్పర్థల కారణంగా పెళ్లైన మూడేళ్లకే విజయ్ నుంచి విడాకులు తీసుకున్నది. విడాకుల తర్వాత యాక్టింగ్‌పై ఫోకస్ పెట్టింది అమలాపాల్. ప్రస్తుతం మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్‌తో ఆడుజీవితం సినిమా చేస్తోంది.