(1 / 5)
పోలీస్ ఆఫీసర్, మిలట్రీ రిటైర్డ్ ఉద్యోగి మధ్య ఈగో సమస్యలతో యాక్షన్ కథాంశంతో రూపొందిన మలయాళం మూవీ అయ్యప్పనుమ్ కోషియమ్ కమర్షియల్ హిట్‌గా నిలిచింది. పృథ్వీరాజ్ సుకుమారన్, బిజు మీనన్ హీరోలుగా నటించిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
(2 / 5)
పృథ్వీరాజ్ సుకుమారన్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా జన గనమణ మూవీని చెప్పవచ్చు. కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. సామాజిక అసమానతలపై పోరాడే లాయర్‌గా ఈ మూవీలో తన యాక్టింగ్‌తో పృథ్వీరాజ్ అదరగొట్టాడు.
(3 / 5)
పృథ్వీరాజ్ సుకుమారన్, పార్వతి జంటగా నటించిన బ్యూటీఫుల్ లవ్‌స్టోరీ మూవీ ఎన్ను నింతే మోయిదీన్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఓటీటీ ఆడియెన్స్ చూడొచ్చు. కులమత అంతరాల కారణంగా విషాదాంతంగా ముగిసిన ఓ జంట కథతో దర్శకుడు ఆర్ ఎస్ విమల్ ఈ మూవీని తెరకెక్కించాడు.
(4 / 5)
పృథ్వీరాజ్ సుకుమార్ హీరోగా దృశ్యం ఫేమ్ జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన మెమోరీస్ బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల మన్ననల్ని అందుకున్నది. మెమోరీస్ మూవీని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఓటీటీ ఆడియెన్స్ చూడొచ్చు.
(5 / 5)
మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోలుగా నటించిన బ్రో డాడీ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజైంది. ఈ కామెడీ డ్రామా మూవీలో హీరోగా నటిస్తూనే ఈ సినిమాకు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించాడు.
ఇతర గ్యాలరీలు