తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kalki: నా తల కొట్టేసినట్లు అయింది.. అమితాబ్ బచ్చన్ చేసిన పనిపై కల్కి నిర్మాత కామెంట్స్

Kalki: నా తల కొట్టేసినట్లు అయింది.. అమితాబ్ బచ్చన్ చేసిన పనిపై కల్కి నిర్మాత కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

02 July 2024, 5:57 IST

google News
  • Kalki 2898 AD Producer Ashwini Dutt Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్ చేసిన పనికి తన తల కొట్టేసినంత పని అయిందని కల్కి 2898 ఏడీ నిర్మాత సి. అశ్వనిదత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోన్న కల్కి ప్రమోషనల్ ఇంటర్వ్యూలో నిర్మాత ఈ వ్యాఖ్యలు చేశారు.

నా తల కొట్టేసినట్లు అయింది.. అమితాబ్ బచ్చన్ చేసిన పనిపై కల్కి నిర్మాత కామెంట్స్
నా తల కొట్టేసినట్లు అయింది.. అమితాబ్ బచ్చన్ చేసిన పనిపై కల్కి నిర్మాత కామెంట్స్

నా తల కొట్టేసినట్లు అయింది.. అమితాబ్ బచ్చన్ చేసిన పనిపై కల్కి నిర్మాత కామెంట్స్

Kalki 2898 AD Ashwini Dutt Amitabh Bachchan: విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన సైన్స్ ఫిక్షన్ ఎపిక్ మాగ్నం ఓపస్ ‘కల్కి 2898 ఏడీ’. ఈ విజువల్ వండర్‌లో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె లీడ్ రోల్స్‌లో నటించిన విషయం తెలిసిందే.

రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్

వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సి. అశ్వనీదత్ ప్రతిష్టాత్మకంగా కల్కి సినిమాను నిర్మించారు. మైథాలజీ -ఇన్స్‌స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ ‘కల్కి 2898 ఏడీ’ జూన్ 27న గ్రాండ్‌గా విడుదలై ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షులను మహా అద్భుతంగా అలరిస్తోంది. దాంతో యునానిమస్ ఎపిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని అందుకొని.. రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో హౌస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.

అమితాబ్ అలా చేయడంపై

ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత అశ్వినీదత్ కల్కి 2898 ఏడీ విశేషాలని పంచుకున్నారు. అలాగే, బిగ్ బి అమితాబ్ బచ్చన్ చేసిన ఓ పనిపై తనకు కలిగిన అనుభూతిని అశ్వనీదత్ చెప్పుకొచ్చారు.

కల్కి 2898 ఏడీపై మీ అంచనాలు ఏంటీ? దానికి తగ్గ రిజల్ట్ ఎలా వచ్చింది? ఎంత హ్యాపీగా ఉన్నారు ?

చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. నిన్న మార్నింగ్ షో నుంచే.. తెలుగు రాష్ట్రాలు, ముంబై, మద్రాస్, బెంగళూరు, ప్రపంచవ్యాప్తంగా రెవల్యూషనరీ రిపోర్ట్ వచ్చింది. నేను ఏదైతే అనుకున్నానో అలాంటి అఖండ విజయం వచ్చింది. హ్యాట్సప్ టు నాగ్ అశ్విన్. ఐయామ్ వెరీ వెరీ హ్యాపీ.

నాగ్ అశ్విన్ ఇలాంటి వైల్డ్ డెప్త్ ఉన్న సబ్జెక్ట్‌ని హ్యాండిల్ చేయగలడనే కాన్ఫిడెన్స్ మీకు ఎప్పుడు వచ్చింది?

తన మొదటి సినిమా నుంచి తనతో జర్నీ చేస్తున్నాం. తను ఎంత పెద్ద సినిమా అయినా తీయగలడనే కాన్ఫిడెన్స్ నాకు మొదటి నుంచి ఉంది. అదే మా అమ్మాయిలతో చెప్పాను. తను ఏ సబ్జెక్ట్ చెప్పినా వెంటనే దూకేయమని అన్నాను. ఈ శతాబ్దంలో ఒక దర్శకుడు మా ఇంట్లోనే దొరికాడు ( నవ్వుతూ).

నా మొదటి సినిమా ఎదురులేని మనిషి నుంచి ఇప్పటివరకూ దర్శకుడు చెప్పింది వినడం, తనకు కావల్సినది సమకూర్చడం తప్పా మరో డిస్కర్షన్ పెట్టను. ఇది అందరికీ తెలుసు. కల్కి 2898 ఏడీ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ ఇంకా ఏం కావాలని అడగడం తప్పా నేను ఎప్పుడు ఎక్కడ ఇంటర్ఫియర్ కాలేదు.

అమితాబ్ గారిని అలాంటి పాత్రలో చూడటం మీకు ఎలా అనిపించింది?

డైరెక్టర్ గారు ఏం అనుకున్నారో అలానే తీస్తారని తెలుసు. అలానే తీశారు కూడా. హ్యాట్సాప్ టు హిమ్. అంతకన్న ఏం చెప్పలేను.

అమితాబ్ గారు, నిర్మాతగా మీకు గౌరవం ఇస్తూ మీ కాళ్లకి నమస్కరించినప్పుడు మీ ఫీలింగ్ ఏంటీ?

నాకు తలకాయ కొట్టేసినంత పనైయింది (నవ్వుతూ). మేము కలిసినప్పుడు పరస్పరం నమస్కరించుకుంటాం. అక్కడితో ఆగిపోతాం. అయితే స్టేజ్ మీద మాత్రం ఆయన అలా చేయడం నేను అస్సలు ఊహించలేదు. అమితాబ్ గారు లెజెండ్. హ్యాట్సాప్ టు హిమ్.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం