Prabhas Hashtag: ట్విటర్ ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్‌లో ప్రభాస్ టాప్.. ఏకైక ఇండియన్ హీరోగా అరుదైన ఘనత!
14 March 2024, 11:03 IST
Prabhas Top In Hashtags Of India: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి తానేంటో నిరూపించకున్నాడు. తాజాగా వినోదంలో ఇండియాలో మోస్ట్ యూజ్‌డ్ హ్యాష్ ట్యాగ్స్‌లో ప్రభాస్ టాప్ ప్లేస్ దక్కించుకున్నాడు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ అంతా ఖుషీ అవుతున్నారు.
ట్విటర్ ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్‌లో ప్రభాస్ టాప్.. ఏకైక ఇండియన్ హీరోగా అరుదైన ఘనత!
Prabhas Top In Hashtags Handles: పాన్ ఇండియా అండ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాపులర్ యాక్టర్ కృష్ణంరాజు సినీ వారసుడిగా సినిమాల్లోకి ఈశ్వర్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఛత్రపతి మూవీతో మాస్ హీరోగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు. ఇక బాహుబలి చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని గ్లోబల్ స్టార్ అయ్యాడు ప్రభాస్.
బాహుబలి తర్వాత ప్రపంచస్థాయిలో అభిమానులను సంపాదిచంకున్న ప్రభాస్ ఇప్పుడు మరో అరుదైన ఘనత అందుకున్నాడు. స్టార్ హీరోలు ఎందరున్న తాను ప్రత్యేకమని ఎన్నో రికార్డులు, ఘనతల ద్వార నిరూపించుకుంటూ వస్తున్న ప్రభాస్ టాప్‌లో స్థానం సంపాదించుకున్నాడు. రేర్ కాంబినేషన్స్, రికార్ట్ స్థాయి బాక్సాఫీస్ నెంబర్స్, భారీ పాన్ వరల్డ్ సినిమా లైనప్స్ ఇలా ఎందులో చూసిన మిగతా స్టార్స్ అందుకోలేనంత దూరంలో ఉంటున్నాడు ప్రభాస్.
తాజాగా ప్రభాస్ ఎక్స్ (ట్విటర్)లో టాప్ హ్యాష్ ట్యాగ్స్ ఆఫ్ ఇండియా జాబితాలో చోటు సంపాదించుకున్నాడు. అది కూడా టాప్ 10 ప్లేసులో. ఇలా ట్విటర్ హ్యాష్ ట్యాగ్స్ ఆఫ్ ఇండియా లిస్టులో స్థానం సంపాదించుకున్న ఏకైక ఇండియన్ హీరోగా ప్రభాస్ అరుదైన రికార్డ్ సాధించాడు. ఎంటర్టైన్‌మెంట్ విభాగంలో ఇండియాలో టాప్ 10 మోస్ట్ యూజ్‌డ్ హ్యాష్ ట్యాగ్స్‌లో ప్రభాస్ టాప్ 7 స్థానం దక్కించుకన్నాడు. దీనికి సంబంధించిన వివరాలను ట్విటర్ రిలీజ్ చేసింది.
జనవరి 1, 2023 నుంచి జనవరి 1, 2024 మధ్య కాలంలో ఏడాదిపాటు మన దేశంలో ప్రజలు ఎక్కువగా ఉపయోగించిన హ్యాష్ ట్యాగ్స్‌ను ట్విటర్ అనౌన్స్ చేసింది. ఇలా ఎంటర్టైన్‌మెంట్‌లో ప్రభాస్ ఏడో స్థానంలో ఉండగా.. డార్లింగ్ రాముడిగా నటించిన ఆదిపురుష్ సినిమా 9వ స్థానంలో నిలిచింది. దీన్ని బట్టి ప్రభాస్ రేంజ్, స్టార్ డమ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రభాస్ ట్విటర్ హ్యాష్ ట్యాగ్ ప్లేస్ చూసి అభిమానులు సంతోషంతో ఖుషీ అవుతున్నారు.
ఈ ఇండియా మోస్ట్ యూజ్‌డ్ ట్విటర్ హ్యాష్ ట్యాగ్‌లో మొదటి స్థానంలో న్యూ ప్రొఫైల్ పిక్, రెండో ప్లేసులో క్రిప్టో, మూడో స్థానంలో లియో ఉన్నాయి. అలాగే ఎన్‌ఎఫ్‌టీ, జవాన్, పఠాన్, ప్రభాస్, ఎల్విష్ యాదవ్, ఆదిపురుష్, బిగ్ బాస్ తర్వాతి స్థానాల్లో వరుసగా ఉన్నాయి. అంటే ప్రభాస్ కంటే ముందు స్థానాల్లో షారుక్ ఖాన్ నటించిన జవాన్, పఠాన్ సినిమాలు ఉండటం విశేషం. ఇక ఆఖరి స్థానంలో అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ స్థానం సంపాదించుకుంది.
ఇదిలా ఉంటే ప్రభాస్ ఇటీవల ఆదిపురుష్‌తో ప్లాప్ అందుకోగా.. సలార్ మూవీతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఏడీ, మారుతి తెరకెక్కిస్తున్న రాజా సాబ్, యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. వీటిలో ముందుగా మే 9న కల్కి 2898 ఏడీ సినిమా ప్రేక్షకుల మందుకు రానుంది. ఇందులో బాలీవుడ్ సుందరాంగులు దీపికా పదుకొణె, దిశా పటానీ హీరోయిన్స్‌గా చేస్తున్నారు.
టాపిక్