Notice To Raj Tarun: హీరో రాజ్ తరుణ్‌కు పోలీసుల నోటీసులు.. రెండ్రోజుల గడువు!
16 July 2024, 13:08 IST
Notice To Raj Tarun On Lavanya Cheating Case: రాజ్ తరుణ్‌కు పెద్ద షాక్ తగిలింది. తనను విచారణను హాజరుకావాలంటూ పోలీసులు హీరో రాజ్ తరుణ్‌కు నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా గడువు కూడా విధించారు. తనను మోసం చేశాడని రాజ్ తరుణ్‌పై లావన్య చీటింగ్ కేసు పెట్టిన విషయం తెలిసిందే.
హీరో రాజ్ తరుణ్‌కు పోలీసుల నోటీసులు.. రెండ్రోజుల గడువు!
Notice To Raj Tarun: గత కొన్ని రోజులుగా హీరో రాజ్ తరుణ్-లావణ్య కేసు తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారుతోంది. మొదటి నుంచి ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. తనను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని లావణ్య ఆరోపిస్తే.. తనే పెద్ద చీటర్ అని, డ్రగ్స్ వాడటంతో రిలేషన్‌కు గుడ్ బై చెప్పానని రాజ్ తరుణ్ క్లారిటీ ఇస్తూ వచ్చాడు.
రోజుకో కొత్త మలుపు తిరిగిన ఈ కేసులో తాజాగా హీరో రాజ్ తరుణ్‌కు పెద్ద షాక్ తగిలినట్లు అయింది. రాజ్ తరుణ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు వెంటనే హాజురు కావాల్సిందేనని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. అంతేకాకుండా తాను ఎక్కడున్న జూలై 18 లోపు అంటే మరో రెండ్రోజుల్లో పోలీసుల ముందు విచారణకు హాజరుకావాలని గడువు విధించారు.
అయితే, రాజ్ తరుణ్‌పై తన లవర్ అని చెబుతున్న లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు పెట్టిన విషయం తెలిసిందే. లావణ్య ఇచ్చిన ఆధారాల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు నార్సింగీ పోలీసులు. ఈ కేసులో రాజ్ తరుణ్‌తోపాటు తిరగబడరా సామీ హీరోయిన్ మాల్వీ మల్హోత్రాపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు.
ఈ కేసులో ఏ1 నిందితుడిగా రాజ్ తరుణ్‌ను, ఏ2గా మాల్వీ మల్హోత్రాను చేర్చారు. ఈ క్రమంలోనే కేసు విషయమై విచారణకు హాజరు కావాల్సిందిగా రాజ్ తరుణ్‌కు బీఎన్ఎస్ఎస్ 45 కింద నార్సింగి పోలీసులు నోటీసులు జారీ చేస్తూ ఆదేశించారు. అయితే, ప్రస్తుతం రాజ్ తరుణ్ ఎక్కడ ఉన్నాడు అనేది తెలియకుండా ఉంది.
లావణ్య చీటింగ్ కేసు పెట్టినప్పుడు ఒకసారి మీడియా ముందుకు వచ్చాడు రాజ్ తరుణ్. అప్పుడు తనను తాను డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత మళ్లీ రాజ్ తరుణ్ మీడియా ముందుకు రాలేదు. ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడనేది ప్రశ్నార్థకంగా మారింది. అందుకే ఈ నేపథ్యంలో రెండ్రోజుల్లో విచారణకు హాజరుకావాలని పోలీసులు గడువు విధించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, హీరో రాజ్ తరుణ్ ప్రేమించి మోసం చేశాడని, ఓసారి అబార్షన్ కూడా చేయించాడని, హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో ఎఫైర్ పెట్టుకుని తనను దూరం పెడుతున్నాడంటూ జూలై 5న కోకాపేటకు చెందిన లావణ్య కేసు పెట్టింది. తాము ఇద్దరు 11 ఏళ్లుగా రిలేషన్లో ఉన్నట్లు, గుడిలో పెళ్లి కూడా చేసుకున్నట్లు, అది ఇంట్లో వాళ్లకు కూడా తెలుసని చెప్పుకొచ్చింది లావణ్య.
అలాగే రాజ్ తరుణ్ తనకు అబార్షన్ కూడా చేయించడమే కాకుండా హీరోయిన్ మాల్వీ మల్హోత్రా మోజులో పడి తనను డ్రగ్స్ కేసులో కూడా ఇరికించాడని లావణ్య ఆరోపణలు చేసింది. రాజ్‌ను వదిలిపెట్టమని హీరోయిన్ మాల్వీ, ఆమె సోదరుడు తనను బెదిరించినట్లు కూడా చెప్పింది. దానికి సంబంధించిన ఫోన్ కాల్ రికార్డింగ్స్ కూడా ఆధారాలుగా పోలీసులకు అందించినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే లావణ్యకు మస్తాన్ సాయి అనే వ్యక్తితో సంబంధం ఉందని, తన కోసం పోలీస్ స్టేషన్‌కు ఎందుకు వెళ్లిందని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు. మాల్వీ మల్హోత్రా ముంబైలో ఉంటుందని, తనతో తాను ఎలా సహజీవనం చేస్తానని రాజ్ తరుణ్ తెలిపాడు. కాగా మరి రాజ్ తరుణ్ పోలీసుల ముందుకు విచారణకు వస్తే కొంతవరకు నిజాలు తెలిసే అవకాశం ఉంది.