Mangalavaram Trp Rating: పాయల్ రాజ్‌పుత్ బోల్డ్ మూవీని టీవీల్లో తెగ చూసేశారు - విజయ్, పవన్ సినిమాలను దాటేసింది
23 February 2024, 8:05 IST
Mangalavaram Trp Rating: పాయల్ రాజ్‌పుత్ బోల్డ్ మూవీ మంగళవారం బుల్లితెరపై దుమ్ములేపింది. దళపతి విజయ్ లియో, పవన్ కళ్యాణ్ బ్రో కంటే ఎక్కువగా టీఆర్పీ రేటింగ్ సాధించింది.
మంగళవారం టీఆర్పీ రేటింగ్
Mangalavaram Trp Rating: పాయల్ రాజ్‌పుత్ బోల్డ్ మూవీ మంగళవారం ఇటీవల స్టార్‌మాలో ఫస్ట్ టైమ్ టెలికాస్ట్ అయ్యింది. ఈ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు అదిరిపోయే టీఆర్పీ రేటింగ్ వచ్చింది. మంగళవారం మూవీకి అర్బన్ ఏరియాలో 7.21 టీఆర్పీ రేటింగ్ రాగా...అర్బన్, రూరల్ కలిపి 6.51 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. బోల్డ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీకి బుల్లితెరపై అంతగా రెస్సాన్స్ రాదని టీవీ వర్గాలు అనుకున్నాయి.
కానీ వారి అంచనాలను మించి టీవీల్లో ఈ సినిమా హిట్టయింది. రీసెంట్గా స్టార్‌లో టెలికాస్ట్ అయిన సినిమాల్లో హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్‌ను దక్కించుకున్న మూవీగా మంగళవారం నిలిచింది. దళపతి విజయ్ లియో, పవన్ కళ్యాణ్ బ్రో కంటే మంగళవారం సినిమా ఎక్కువగా టీఆర్పీ రేటింగ్ దక్కించుకున్నది.
ఆర్ఎక్స్ 100 తర్వాత ....
ఆర్ ఎక్స్ 100 తర్వాత పాయల్ రాజ్‌పుత్ దర్శకుడు అజయ్ భూపతి కాంబినేషన్లో మంగళవారం మూవీ తెరకెక్కింది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రివేంజ్ థ్రిల్లర్‌గా అజయ్ భూపతి ఈ సినిమా కథను రాసుకున్నారు. ఓ సెక్సువల్ డిజార్డర్ పాయింట్‌ను టచ్ చేశారు. గత ఏడాది నవంబర్‌లో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ కమర్షియల్ సక్సెస్‌గా నిలిచింది.
పాయల్‌కు ఓ హిట్టు...
మానసిక సమస్యతో బాధపడే యువతిగా ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ నటనకు ప్రశంసలు దక్కాయి. గ్లామర్ పాత్రలకు భిన్నంగా పాయల్ రాజ్‌పుత్‌లోని యాక్టింగ్ టాలెంట్‌ను ఈ మూవీ చాటిచెప్పింది. లాంగ్ గ్యాప్ తర్వాత మంగళవారంతో పాయల్ రాజ్‌పుత్ ఖాతాలో హిట్టుపడింది. అజయ్ భూపతి టేకింగ్‌తో పాటు అజనీష్ లోకనాథ్ బీజీఎమ్ బాగుందనే పేరొచ్చింది.
మంగళవారం కలెక్షన్స్...
దాదాపు 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో థియేటర్లలో రిలీజైన మంగళవారం మూవీ 20 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. యూత్‌ను టార్గెట్ చేస్తూ తెరకెక్కిన సినిమా ఓటీటీ, శాటిలైట్ హక్కులు భారీ రేట్‌కు అమ్ముడుపోయాయి. మంగళవారం సినిమాలో ప్రియదర్శి, చైతన్య కృష్ణ, అజయ్ ఘోష్ కీలక పాత్రలు పోషించారు.
వెంకటేష్‌తో వెంకీ మామా...
ఆర్ఎక్స్ 100తోనే టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది పాయల్ రాజ్‌పుత్. బోల్డ్ రోల్లో గ్లామర్‌తో యూత్ ఆడియెన్స్‌ను మెప్పించింది. ఆర్ ఎక్స్ 100 బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో పాయల్ రాజ్‌పుత్‌కు బోలేడు అవకాశాలు వచ్చాయి. వెంకటేష్ తో వెంకీ మామ, రవితేజతో డిస్కోరాజాతో పాటు చాలా సినిమాలు చేసింది. కానీ ఈ సినిమాలు డిజాస్టర్స్‌గా నిలవడంతో పాయల్ రాజ్‌పుత్ కెరీర్ డైలామాలో పడింది. మంచు విష్ణు జిన్నా, మాయపేటిక, తీస్మార్ఖాన్ లాంటి చిన్న సినిమాలు చేసినా ఆమె కెరీర్‌కు ఏ మాత్రం ఉపయోగపడలేదు. దాంతో తమిళంపై ఫోకస్ పెడుతోంది పాయల్ రాజ్‌పుత్. కోలీవుడ్‌లో రెండు సినిమాలు చేసింది.
ఓ వైపు సిల్వర్ స్క్రీన్‌పై కనిపిస్తూనే ఓటీటీవైపు దృష్టిసారిస్తోంది పాయల్ రాజపుత్. తెలుగులో త్రీ రోజెస్ అనే వెబ్‌సిరీస్ చేసింది.
టాపిక్