Under 19 World Cup: అండర్ 19 వరల్డ్ కప్‌లో టీమిండియా రికార్డులు ఇవే - కోహ్లి కెప్టెన్‌గా టైటిల్ ఎప్పుడు వచ్చిందంటే?
U19 World Cup 2024 : అండర్ 19 వరల్డ్ కప్‌లో టీమిండియా ఫైనల్‌లో అడుగుపెట్టింది. మంగళవారం జరిగిన సెమీస్‌లో ఆతిథ్య సౌతాఫ్రికాను చిత్తు చేసింది. అండర్ 19 వరల్డ్ కప్‌లో తొమ్మిదోసారి ఫైనల్ చేరి టీమిండియా రికార్డ్ క్రియేట్ చేసింది.
(1 / 8)
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 244 పరుగులు చేసింది. ప్రిటోరియస్ 76 రన్స్, సెలెట్‌స్వాన్ 64 పరుగులు చేశారు. మరో ఓవర్ మిగిలుండగానే టీమిండియా టార్గెట్‌ను ఛేదించింది. రెండు వికెట్ల తేడాతో సౌతాఫ్రికాపై విజయాన్ని సాధించింది.
(2 / 8)
32 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియాను సచిన్ దాస్, ఉదయ్ సహరాన్ గెలిపారు. సచిన్ దాస్ 96 రన్స్, ఉదయ్ సహరాన్ 81 రన్స్ చేశారు.
(3 / 8)
టీమిండియా అండర్ 19 వరల్డ్ కప్‌లో ఫైనల్ చేరడం వరుసగా ఇది ఐదోసారి. మొత్తంగా తొమ్మిదిసార్లు టీమిండియా అండర్ 19 వరల్డ్ కప్‌లో ఫైనల్ చేరుకున్నది
(4 / 8)
2000 ఏడాదిలో మహ్మద్ కైఫ్ కెప్టెన్సీలో ఫస్ట్ టైమ్ టీమిండియా అండర్ 19 వరల్డ్ కప్‌ను గెలుచుకున్నది. ఈ వరల్డ్ కప్‌లో యువరాజ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాణించాడు.
(5 / 8)
విరాట్ కోహ్లి కెప్టెన్సీలో 2008లో టీమిండియా అండర్ 19 వరల్డ్ కప్ టైటిల్ సాధించింది. ఫైనల్‌లో సౌతాఫ్రికాను చిత్తుచేసింది.
(6 / 8)
ఉన్ముక్త్ చంద్ సారథ్యంలో 2012లో మూడోసారి టీమిండియా వరల్డ్ కప్ అండర్ 19 విన్నర్‌గా నిలిచింది. ఫైనల్‌లో ఆస్ట్రేలియా 225 రన్స్ చేయగా...నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి టీమిండియా టార్గెట్ ఛేదించింది. ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
(7 / 8)
2018లో నాలుగోసారి అండర్ 19 వరల్డ్ కప్ విజేతగా భారత్ నిలిచింది. ఈ వరల్డ్ కప్‌లో భారత్‌కు పృథ్వీషా కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2018 అండర్ 19 వరల్డ్ కప్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా శుభ్‌మన్ గిల్ నిలిచాడు.
ఇతర గ్యాలరీలు