తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hari Hara Veera Mallu: పవన్ కల్యాణ్ హరి హర వీర మల్లు అటకెక్కినట్లేనా? డైరెక్టరూ వదిలేశాడు!

Hari Hara Veera Mallu: పవన్ కల్యాణ్ హరి హర వీర మల్లు అటకెక్కినట్లేనా? డైరెక్టరూ వదిలేశాడు!

Hari Prasad S HT Telugu

08 February 2024, 7:25 IST

    • Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న హరి హర వీర మల్లు మూవీ ఇక అటకెక్కినట్లేనా? ఈ మూవీ డైరెక్టర్ క్రిష్ కూడా తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
పవన్ కల్యాణ్ హరి హర వీర మల్లు మూవీ అటకెక్కినట్లేనని వస్తున్న వార్తలు
పవన్ కల్యాణ్ హరి హర వీర మల్లు మూవీ అటకెక్కినట్లేనని వస్తున్న వార్తలు (Twitter)

పవన్ కల్యాణ్ హరి హర వీర మల్లు మూవీ అటకెక్కినట్లేనని వస్తున్న వార్తలు

Hari Hara Veera Mallu: టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి మరో సినిమాను మధ్యలోనే వదిలేసినట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ నటిస్తున్న హరి హర వీర మల్లు మూవీ నుంచి క్రిష్ తప్పుకున్నాడట.

ట్రెండింగ్ వార్తలు

Kalki 2898 AD Event: కల్కి ఈవెంట్‍కు డేట్, టైమ్ ఫిక్స్.. అత్యంత గ్రాండ్‍గా కార్యక్రమం.. ఆ విషయంపై క్లారిటీ వస్తుందా!

Sarkaar 4 OTT: సుధీర్ గేమ్ షోకు వైష్ణవి చైతన్య.. ఎంటర్‌టైనింగ్‍గా ప్రోమో: చూసేయండి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Rathnam OTT Release Date: విశాల్ రత్నం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. అనుకున్నదాని కంటే ముందుగానే..

Prasanth Ranveer Movie: ఆ వార్తల్లో నిజం లేదు.. ప్రశాంత్ వర్మ, రణ్‌వీర్ సింగ్ మూవీ షూటింగ్ ప్రారంభమైంది కూడా..

గతంలో మణికర్ణిక మూవీని ఇలాగే సగానికిపైగా షూట్ చేసిన తర్వాత ఆ మూవీ లీడ్ కంగనా రనౌత్ తో పడకపోవడంతో మధ్యలోనే వదిలేశాడు. ఇప్పుడు హరి హర వీర మల్లు విషయంలోనూ అదే జరిగినట్లు కనిపిస్తోంది.

హరి హర వీర మల్లు.. చేతులెత్తేసిన క్రిష్

హరి హర వీర మల్లు మూవీ ఎప్పుడో నాలుగేళ్ల కిందట ప్రారంభమైంది. ఇప్పుడు అప్పుడు అంటూ ఆరు నెలలకోసారి ఏదో అప్డేట్ వచ్చినా సినిమా మాత్రం అక్కడే ఉండిపోయింది. ఈలోపు పవన్ నటించిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో మూవీస్ రిలీజయ్యాయి. తాజాగా ఈ ఏడాది సెప్టెంబర్ 27న ఓజీ మూవీ కూడా రాబోతోందని మేకర్స్ అనౌన్స్ చేశారు.

అయినా హరి హర వీర మల్లు పరిస్థితి ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. తాజాగా డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వస్తున్న వార్తలు పవన్ అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే అతడు అనుష్క శెట్టితో ఓ కొత్త సినిమా ప్రారంభించాడు. ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ అయిన ఈ ప్రాజెక్ట్ ఓ భారీ బడ్జెట్ సినిమా అని తెలుస్తోంది.

గతంలో వేదం సినిమాలో క్రిష్ డైరెక్షన్ లో నటించిన అనుష్క.. అందులో ఇరగదీసింది. ఈ మధ్యే మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీతో మళ్లీ సినిమాలు మొదలుపెట్టిన అనుష్క.. ఇప్పుడు క్రిష్ తో మరో మూవీ చేస్తోంది. ఇక అతడు హరి హర వీర మల్లు ప్రాజెక్ట్ కు తిరిగి రాడని, మిగిలిపోయిన షూటింగ్ ను మరో డైరెక్టర్ పూర్తి చేస్తాడనీ వార్తలు వస్తున్నాయి.

హరి హర వీర మల్లు.. అసలు ఏమైంది?

నాలుగేళ్లుగా సాగుతున్నా హరి హర వీర మల్లు షూటింగ్ పూర్తి కాకపోవడం ఎవరికీ అంతుబట్టని విషయమే. ఈ మూవీ ప్లానింగ్ ను క్రిష్ సరిగా చేయలేదని, ఓవైపు రాజకీయాల్లో బిజీ అయిన పవన్ కల్యాణ్ డేట్స్ ను క్రిష్ సద్వినియోగం చేసుకోలేకపోయాడన్న విమర్శలు ఉన్నాయి. మధ్యమధ్యలో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోందన్న వార్తలూ వచ్చాయి.

మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ వీడియోలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో పవన్ తనయుడు అకీరా కూడా నటిస్తున్నాడన్న వార్తలు మరింత ఆసక్తి రేపాయి. అయితే నిర్మాత ఆర్థిక కష్టాలు, పవన్ బిజీ షెడ్యూల్, ఇప్పటికే పూర్తయిన షూటింగ్ లో కొన్ని సీక్వెన్స్ లు పవన్ కు నచ్చకపోవడం వాటిని తిరిగి రీషూట్ చేయడంలాంటి ఎన్నో సమస్యలు హరి హర వీర మల్లు ఎదుర్కొంటోంది.

ఇప్పుడు క్రిష్ కూడా తప్పుకున్నాడన్న వార్తల నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తు మరింత గందరగోళంలో పడిపోయినట్లు తెలుస్తోంది. దీనిపై మేకర్స్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. ఏపీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఇక వచ్చే రెండు, మూడు నెలలు పవన్ పూర్తిగా రాజకీయాల్లోనే బిజీ కానున్నాడు. ఆ తర్వాత ఓజీ, ఉస్తాద్ భగత్‌సింగ్ మూవీస్ పై దృష్టి సారించనున్నాడు. దీంతో హరి హర వీర మల్లు ఇక పూర్తిగా అటకెక్కినట్లేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం