OTT Weekend Watch: ఈ వీకెండ్ ఏ ఓటీటీలో ఏ సినిమా, వెబ్ సిరీస్ చూడాలి.. పూర్తి లిస్ట్ ఇక్కడ చూడండి
27 September 2024, 19:34 IST
- OTT Weekend Watch: ఈ వీకెండ్ టైంపాస్ చేయడానికి ఓటీటీల్లోకి ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ అందుబాటులోకి వచ్చాయి. మరి ఏ సినిమా, ఏ వెబ్ సిరీస్ ఏ ఓటీటీలో చూడాలన్న పూర్తి లిస్ట్ ఇక్కడ చూడండి. ఆహా, ఈటీవీ విన్, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్ లాంటి ఓటీటీల్లో ఈ మూవీస్ ఉన్నాయి.
ఈ వీకెండ్ ఏ ఓటీటీలో ఏ సినిమా, వెబ్ సిరీస్ చూడాలి.. పూర్తి లిస్ట్ ఇక్కడ చూడండి
OTT Weekend Watch: వీకెండ్ వస్తుందంటే చాలు.. ఏ ఓటీటీలో ఏ కొత్త సినిమా, వెబ్ సిరీస్ వచ్చిందో తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంటోంది. ఈ వీకెండ్ కూడా మిమ్మల్ని అలరించడానికి తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లిష్ భాషల్లోని ఎన్నో మూవీస్, వెబ్ సిరీస్ సిద్ధంగా ఉన్నాయి. మరి ఏ సినిమా ఏ ఓటీటీలో ఉందో చూసి.. వీకెండ్ ప్లాన్ చేసుకోండి.
ఓటీటీ వీకెండ్ వాచ్
ఈ వీకెండ్ థియేటర్లలో చూడటానికి అందుబాటులో ఉన్న ఏకైక మూవీ దేవర. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా శుక్రవారం (సెప్టెంబర్ 27) ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. అయితే ఓటీటీల్లో మాత్రం ప్రేక్షకులకు ఎన్నో ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. వివిధ భాషల్లో వచ్చిన ఆ సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే.
నెట్‌ఫ్లిక్స్ మూవీస్
నెట్‌ఫ్లిక్స్ లోకి ఈ వారమే నేచురల్ స్టార్ నాని నటించిన బ్లాక్ బస్టర్ మూవీ సరిపోదా శనివారం స్ట్రీమింగ్ కు వచ్చింది. నెల రోజుల్లోపే ఓటీటీలో అడుగు పెట్టిన ఈ సినిమాకు డిజిటల్ ప్లాట్‌ఫామ్ పైనా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక దేవర బ్యూటీ జాన్వీ కపూర్ నటించిన ఉలఝ్ అనే హిందీ మూవీ కూడా శుక్రవారం (సెప్టెంబర్ 27) నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఆహా ఓటీటీ మూవీస్
ఆహా ఓటీటీలోకి ఈ వారం రెండు తెలుగు సినిమాలు వచ్చాయి. అందులో ఒకటి మలయాళం డబ్బింగ్ మూవీ కాగా.. మరొకటి తెలుగు పొలిటికల్ డ్రామా. చాప్రా మార్డర్ కేస్ అంటూ ఓ మలయాళ మర్డర్ మిస్టరీ మూవీ గురువారం (సెప్టెంబర్ 26) నుంచి తెలుగులోనూ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక శుక్రవారం (సెప్టెంబర్ 27) నుంచి నారా రోహిత్ నటించిన ప్రతినిధి 2 మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఆహా తమిళం ఓటీటీలో కాఫీ అనే తమిళ మూవీ రెండేళ్ల తర్వాత రిలీజైంది.
జీ5 ఓటీటీ మూవీస్
జీ5 ఓటీటీలోకి కూడా రెండు ఇంట్రెస్టింగ్ సినిమాలు వచ్చాయి. అందులో ఒకటి తమిళ హారర్ మూవీ డీమాంటే కాలనీ 2. ఇది తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక శుక్రవారం (సెప్టెంబర్ 27) నుంచి శోభిత ధూళిపాళ్ల నటించిన లవ్, సితార మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది కేవలం హిందీలోనే అందుబాటులో ఉంది.
ప్రైమ్ వీడియో ఓటీటీ మూవీస్
అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి ఏకంగా మూడు సినిమాలు వచ్చాయి. అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ మూవీగా చరిత్ర సృష్టించిన హారర్ కామెడీ సినిమా స్త్రీ 2 ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. అయితే ఈ సినిమాను ఫ్రీగా కాకుండా రెంట్ చెల్లించి చూడాల్సి ఉంటుంది. ఇదే కాకుండా అజయ్ దేవగన్ మూవీ ఔరో మే కహా దమ్ థా శుక్రవారం నుంచి ఫ్రీగా అందుబాటులోకి వచ్చింది. అటు తమిళ హిట్ మూవీ కొట్టుక్కాలి కూడా స్ట్రీమింగ్ అవుతోంది.
ఇవే కాకుండా ఈటీవీ విన్ ఓటీటీలోకి ఆర్టీఐ అనే తెలుగు మూవీ వచ్చింది. అటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో తాజాకబర్ వెబ్ సిరీస్ సీజన్ 2 కూడా ఇదే వారం స్ట్రీమింగ్ కు వచ్చింది. జియో సినిమాలో హనీమూన్ ఫొటోగ్రాఫర్ అనే హిందీ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
టాపిక్