Aha OTT Top Movies: ఆహా ఓటీటీలోకి ఈ మధ్యే వచ్చిన టాప్ 5 తెలుగు మూవీస్ ఇవే.. అస్సలు మిస్ కావద్దు.. మరో రెండూ వస్తున్నాయ్-aha ott top movies must watch movies shivam bhaje parakramam purushothamudu aaha simbaa ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aha Ott Top Movies: ఆహా ఓటీటీలోకి ఈ మధ్యే వచ్చిన టాప్ 5 తెలుగు మూవీస్ ఇవే.. అస్సలు మిస్ కావద్దు.. మరో రెండూ వస్తున్నాయ్

Aha OTT Top Movies: ఆహా ఓటీటీలోకి ఈ మధ్యే వచ్చిన టాప్ 5 తెలుగు మూవీస్ ఇవే.. అస్సలు మిస్ కావద్దు.. మరో రెండూ వస్తున్నాయ్

Hari Prasad S HT Telugu
Sep 18, 2024 10:28 AM IST

Aha OTT Top Movies: ఆహా ఓటీటీలోకి ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలే వచ్చాయి. అందులో కొన్ని స్ట్రెయిట్ తెలుగు మూవీస్ కాగా.. మరికొన్ని డబ్బింగ్ కూడా ఉన్నాయి. వీటిలో టాప్ 5 మూవీస్ ఏవి? మరికొన్ని రోజుల్లో రాబోతున్న మరో రెండు సినిమాలు ఏవన్నది చూడండి.

ఆహా ఓటీటీలోకి ఈ మధ్యే వచ్చిన టాప్ 5 తెలుగు మూవీస్ ఇవే.. అస్సలు మిస్ కావద్దు.. మరో రెండూ వస్తున్నాయ్
ఆహా ఓటీటీలోకి ఈ మధ్యే వచ్చిన టాప్ 5 తెలుగు మూవీస్ ఇవే.. అస్సలు మిస్ కావద్దు.. మరో రెండూ వస్తున్నాయ్ (aha video)

Aha OTT Top Movies: ఆహా వీడియో ఓటీటీ.. ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకుల కోసమే మంచి కంటెంట్ అందిస్తున్న డిజిటల్ ప్లాట్‌ఫామ్. ఈ మధ్యకాలంలో దూకుడు పెంచింది. కొత్త సినిమాల స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకోవడానికి గట్టిగానే పోటీ పడుతోంది. అలా కొన్ని టాప్ సినిమాలను కొన్ని రోజుల నుంచి తన ప్లాట్‌ఫామ్ పై స్ట్రీమింగ్ చేస్తోంది. మరి వాటిలో టాప్ 5 మూవీస్ ఏంటో ఒకసారి చూద్దాం.

ఆహా వీడియో ఓటీటీ టాప్ మూవీస్

ఆహా వీడియో ఓటీటీలో గత రెండు, మూడు వారాలుగా వచ్చిన సినిమాలు టాప్ ట్రెండింగ్స్ లోకి దూసుకెళ్లాయి. వాటిలో టాప్ 5 మూవీస్ ఇవే.

ఆహా - మలయాళం డబ్బింగ్ మూవీ

ఆహా ఓ మలయాళం స్పోర్ట్స్ డ్రామా. థియేటర్లలో రిలీజైన మూడేళ్ల తర్వాత ఇప్పుడు తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చింది. టగ్ ఆఫ్ వార్ అనే ఆట నేపథ్యంలో సాగే మూవీ ఇది. ఆహా ఓటీటీలోకి వచ్చీ రాగానే ట్రెండింగ్ లో టాప్ 2గా నిలవడం విశేషం. ఈ స్పోర్ట్స్ డ్రామాను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు.

పరాక్రమం - తెలుగు యాక్షన్ డ్రామా

ఆహా ఓటీటీలోకి గత శనివారం (సెప్టెంబర్ 14) స్ట్రీమింగ్ కు వచ్చిన మూవీ పరాక్రమం. ఇదొ యాక్షన్ డ్రామా. ఈ సినిమా ఆహా ట్రెండింగ్ లో నాలుగో స్థానంలో ఉంది. ఈ మూవీ లోవరాజు అనే ఓ థియేటర్ ఆర్టిస్ట్ చుట్టూ తిరుగుతుంది.

గల్లీ క్రికెటర్ కూడా అయిన అతడు.. పెద్ద హీరో కావాలని కలలు కంటూ ఉంటాడు. ఈ సినిమాలో డైరెక్టర్ బండి సరోజ్ కూడా సత్తి బాబు అనే థియేటర్ ఆర్టిస్ట్ పాత్ర పోషించాడు. తను చేయలేనిది తన కొడుకు లోవరాజు చేస్తాడంటూ అతడు తన ప్రాణం తీసుకుంటాడు.

శివమ్ భజే - తెలుగు డివోషనల్ థ్రిల్లర్

అశ్విన్ బాబు నటించిన శివమ్ భజే మూవీ థియేటర్లలో పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ ఒకేసారి రెండు ఓటీటీల్లోకి వచ్చి దూసుకెళ్తోంది. ప్రైమ్ వీడియోతోపాటు ఆహా వీడియోలోకీ వచ్చిన ఈ సినిమా.. ప్రస్తుతం టాప్ ట్రెండింగ్ మూవీస్ లో 5వ స్థానంలో ఉంది.

దేవుడి అండ‌తో దేశానికి ఎదురైన విప‌త్తును ఓ యువ‌కుడు ఎలా ఎదుర్కొన్నాడ‌న్న‌దే శివం భ‌జే మూవీ క‌థ‌. ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రూ తెలుగు సినిమాలో ట‌చ్ చేయ‌ని యూనిక్‌ పాయింట్‌తో ద‌ర్శ‌కుడు ఈ క‌థ‌ చెప్పేందుకు ప్ర‌య‌త్నించాడు డైరెక్ట‌ర్‌.

పురుషోత్తముడు - రాజ్ తరుణ్ మూవీ

రాజ్ తరుణ్ నటించిన మూవీ పురుషోత్తముడు. ఈ సినిమాకు కూడా థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాలేదు. అయితే ఆహా ఓటీటీలో మాత్రం ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. ప్రస్తుతం ఆహా టాప్ 10 ట్రెండింగ్ లో ఆరో స్థానంలో ఉంది.

సింబా - అనసూయ, జగపతి బాబు మర్డర్ మిస్టరీ

సింబా ఓ మర్డర్ మిస్టరీ మూవీ. అనసూయ, జగపతి బాబు నటించిన ఈ సినిమా ఆహా వీడియోలో అడుగుపెట్టి చాలా రోజులే అవుతున్నా.. టాప్ 10 ట్రెండింగ్ లో ఏడో స్థానంలో కొనసాగుతోంది.

ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించుకోవాల‌నే మెసేజ్‌కు బ‌యోలాజిక‌ల్ మెమోరీ అనే సైంటిఫిక్ అంశాల‌ను జోడించి ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది ఈ క‌థ‌ను రాశాడు. ఓ సాధారణ రివేంజ్ స్టోరీకి మర్డర్ మిస్టరీని జోడించడంతో సింబా మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఈ సినిమాలు ప్రస్తుతం ఆహా టాప్ ట్రెండింగ్ లో ఉండగా.. త్వరలోనే ఈ ఓటీటీలోకి మరో రెండు ఇంట్రెస్టింగ్ సినిమాలు అడుగుపెడుతున్నాయి. రావు రమేష్ నటించిన మారుతీనగర్ సుబ్రమణ్యం మూవీ శుక్రవారం (సెప్టెంబర్ 20) నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక రాజ్ తరుణ్ నటించిన తిరగబడరా సామీ మూవీ త్వరలోనే రానున్నట్లు ఆహా వీడియో వెల్లడించింది.