OTT Action Drama: ఓటీటీలోకి వస్తున్న మరో తెలుగు యాక్షన్ డ్రామా.. మూడు వారాల్లోనే.. ఐఎండీబీలో మంచి రేటింగ్
OTT Action Drama: ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ తెలుగు యాక్షన్ డ్రామా మూవీ వస్తోంది. థియేటర్లలో రిలీజైన మూడు వారాల్లోనే ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైనా.. ఐఎండీబీలో మాత్రం మంచి రేటింగ్ సొంతం చేసుకుంది.
OTT Action Drama: ఓటీటీలోకి ఈ వారమే ఓ తెలుగు యాక్షన్ డ్రామా మూవీ రాబోతోంది. ఈ సినిమా పేరు పరాక్రమం. ఆగస్ట్ 22న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా మూడు వారాల్లోనే డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. ఈ సినిమాను ఆహా వీడియో ఓటీటీ స్ట్రీమింగ్ చేయబోతోంది. అయితే పరాక్రమం మూవీకి ఐఎండీబీలో 7.7 రేటింగ్ ఉండటం విశేషం.
పరాక్రమం ఓటీటీ రిలీజ్ డేట్
పరాక్రమం మూవీని బండి సరోజ్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా ఇప్పుడు ఆహా వీడియోలో శనివారం (సెప్టెంబర్ 14) నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
"పులి వస్తే చెట్టెక్కుతావ్.. మగర్ మచ్చీ వస్తే ఒడ్డెక్కుతావ్.. యముడొస్తే ఏడికి పోతావ్.. బండి సరోజ్ పరాక్రమం ఆహాలో.. పరాక్రమం ప్రీమియర్ సెప్టెంబర్ 14న మీ ఆహాలో.." అనే క్యాప్షన్ తో మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని తెలిపింది. ఐ మి మైసెల్ఫ్ అనే క్యాప్షన్ తో ఈ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది.
పరాక్రమం ఎలా ఉందంటే?
పరాక్రమం మూవీలో బండి సరోజ్ కుమార్ తోపాటు శృతి సామాన్వి, నిఖిల్ గోపులాంటి వాళ్లు నటించారు. ఈ మూవీ లోవరాజు అనే ఓ థియేటర్ ఆర్టిస్ట్ చుట్టూ తిరుగుతుంది. గల్లీ క్రికెటర్ కూడా అయిన అతడు.. పెద్ద హీరో కావాలని కలలు కంటూ ఉంటాడు.
ఈ సినిమాలో డైరెక్టర్ బండి సరోజ్ కూడా సత్తి బాబు అనే థియేటర్ ఆర్టిస్ట్ పాత్ర పోషించాడు. తను చేయలేనిది తన కొడుకు లోవరాజు చేస్తాడంటూ అతడు తన ప్రాణం తీసుకుంటాడు.
మరోవైపు ఎప్పటికైనా రవీంద్ర భారతిలో నాటకాన్ని ప్రదర్శిస్తానని చెప్పుకొని తిరిగే ఆ లోవరాజు.. పరాక్రమం అనే తన తండ్రి నాటకంలో యముడిగా చేస్తాడు. ఈ క్రమంలో అతని జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయన్నది ఈ పరాక్రమం మూవీలో చూడొచ్చు.
ఈ సినిమా గురువారం (సెప్టెంబర్ 12) నుంచే ఆహా వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇక ఆహా ఒరిజినల్ మూవీ బాలు గాని టాకీస్ కూడా శుక్రవారం (సెప్టెంబర్ 13) నుంచి స్ట్రీమింగ్ కావాల్సి ఉన్నా.. ఈ మూవీ రిలీజ్ వాయిదా వేశారు. కొత్త స్ట్రీమింగ్ డేట్ గురించి ఇంకా వెల్లడించలేదు.