Aha OTT Comedy Movie: ఆహా ఓటీటీలోకి రావాల్సిన కామెడీ మూవీ రిలీజ్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?-aha ott comedy movie balu gani talkies release postponed new steaming date yet to be announced ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aha Ott Comedy Movie: ఆహా ఓటీటీలోకి రావాల్సిన కామెడీ మూవీ రిలీజ్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?

Aha OTT Comedy Movie: ఆహా ఓటీటీలోకి రావాల్సిన కామెడీ మూవీ రిలీజ్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?

Hari Prasad S HT Telugu
Sep 11, 2024 01:03 PM IST

Aha OTT Comedy Movie: ఆహా ఓటీటీలోకి రావాల్సిన కామెడీ మూవీ బాలు గాని టాకీస్ రిలీజ్ వాయిదా పడింది. ఈ విషయాన్ని బుధవారం (సెప్టెంబర్ 11) సదరు ఓటీటీ తమ ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

ఆహా ఓటీటీలోకి రావాల్సిన కామెడీ మూవీ రిలీజ్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?
ఆహా ఓటీటీలోకి రావాల్సిన కామెడీ మూవీ రిలీజ్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?

Aha OTT Comedy Movie: బాలు గాని టాకీస్.. నేరుగా ఆహా ఓటీటీలోకి రావాల్సిన కామెడీ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమా శుక్రవారం (సెప్టెంబర్ 13) నుంచి స్ట్రీమింగ్ కానుందంటూ గతంలోనే ఆ ఓటీటీ వెల్లడించింది. గత శుక్రవారం ట్రైలర్ కూడా రిలీజ్ చేసింది. అయితే తాజాగా బుధవారం (సెప్టెంబర్ 11) ఇచ్చిన అప్డేట్ ప్రకారం.. ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.

బాలు గాని టాకీస్ రిలీజ్ వాయిదా

బాలు గాని టాకీస్ మూవీ రిలీజ్ వాయిదా పడినట్లు కూడా ఆహా ఓటీటీ ఓ పోస్టర్ ద్వారా వెల్లడించింది. "టాకీస్ లో షో టైమ్ మారింది.. ఎంటర్టైన్మెంట్ కాదు" అనే క్యాప్షన్ తో ఆహా ఓటీటీ ఈ విషయం చెప్పింది. ఈ సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది.

బాలు గాని టాకీస్ మూవీ పోస్టర్ లోనే ముఖ్య గమనిక అంటూ ఓ ప్రకటన జారీ చేసింది. అందులో రిలీజ్ తేదీ వాయిదా పడింది.. డేటు మారొచ్చేమో కానీ, మూవీ చూస్తే వచ్చే కిక్కు మారదు అని ఆ పోస్టర్ పై రాసి ఉంది. బాలు గాని టాకీస్ కొత్త స్ట్రీమింగ్ తేదీని మాత్రం ఆహా వీడియో వెల్లడించలేదు.

బాలు గాని టాకీస్ మూవీ గురించి..

ఆహా వీడియో ఒరిజినల్ మూవీ బాలు గాని టాకీస్. కొన్ని రోజుల కిందట సినిమా రీల్ ఉండే పెట్టె.. దానిపై జై బాలయ్య అక్షరాలతో ఈ బాలు గాని టాకీస్ మూవీ అనౌన్స్ చేసింది సదరు ఓటీటీ. గత వారం మూవీ ట్రైలర్ రిలీజ్ కాగా.. అది ఆసక్తికరంగా ఉంది.

ఒక నిమిషం 51 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ ఫస్ట్ హాఫ్ కామెడీని పంచగా.. సెకండాఫ్ అంతా ఇంటెన్స్ మ్యూజిక్ తో థ్రిల్లింగా సాగింది. బూతు సినిమాలతోనే తన పాతకాలం నాటి థియేటర్ ను నడిపించే బాలు.. తన టాకీస్ లో బాలయ్య సినిమాను ఆడించాలని కలలు కంటుంటాడు.

నిజానికి ట్రైలర్ మొదలయ్యేది కూడా ఆ డైలాగుతోనే. వచ్చే వారం రిలీజయ్యే బాలయ్య సినిమా మన థియేటర్లోకే రావాలని అక్కడ పని చేసే వ్యక్తితో హీరో అంటుండగా ట్రైలర్ ప్రారంభమవుతుంది. తర్వాత అతని కోసం పోలీసులు వెతకడం, ట్రైలర్ సెకండాఫ్ లో అసలు డైలాగులే లేకుండా సాగడం చూస్తుంటే ఈ మూవీ ఓ కామెడీ థ్రిల్లర్ గా కనిపిస్తోంది.

అసలు బాలు గాని టాకీస్ కు ఏం జరిగింది? అతని జీవితం ఎలాంటి మలుపు తిరిగింది అన్నది సినిమాలోనే చూడాలి. ట్రైలర్ చివర్లో రక్తం మరకలు ఉన్న పాతకాలం నాటి నాణేలను చూపించి మూవీపై మరింత ఆసక్తి రేపారు. బాలు గాని టాకీస్ మూవీలో శివ రామచంద్రరావు హీరోగా నటించాడు. అతడు గతంలో హీరోగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా తెలుగులో ప‌లు సినిమాలు చేశాడు.

బాలుగాని టాకీస్ మూవీకి విశ్వ‌నాథ్ ప్ర‌తాప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. శ్రీనిధి సాగ‌ర్ ప్రొడ్యూస్ చేస్తోన్న ఈ మూవీకి స్మ‌ర‌ణ్ మ్యూజిక్ అందిస్తోన్నాడు. అశ్విత్ గౌత‌మ్ స్క్రీన్‌ప్లే అందిస్తోండ‌గా ఆదిత్య బీఎన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ స‌మ‌కూర్చుతున్నాడు.