OTT Comedy Thriller: నేరుగా ఓటీటీలోకి వస్తున్న తెలుగు కామెడీ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే-ott comedy thriller balu gani talkies trailer released aha ott to stream the movie from september 13th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Comedy Thriller: నేరుగా ఓటీటీలోకి వస్తున్న తెలుగు కామెడీ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

OTT Comedy Thriller: నేరుగా ఓటీటీలోకి వస్తున్న తెలుగు కామెడీ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Hari Prasad S HT Telugu
Sep 06, 2024 04:12 PM IST

OTT Comedy Thriller: ఓటీటీలోకి ఇప్పుడో కామెడీ థ్రిల్లర్ మూవీ వస్తోంది. ఆహా వీడియో ఒరిజినల్ అయిన ఈ సినిమా ట్రైలర్ శుక్రవారం (సెప్టెంబర్ 6) రిలీజ్ చేశారు. అంతేకాదు ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీని కూడా అనౌన్స్ చేయడం విశేషం.

నేరుగా ఓటీటీలోకి వస్తున్న తెలుగు కామెడీ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
నేరుగా ఓటీటీలోకి వస్తున్న తెలుగు కామెడీ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

OTT Comedy Thriller: తెలుగు కామెడీ థ్రిల్లర్ మూవీ నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతోంది. ఈ సినిమా పేరు బాలు గాని టాకీస్. కొన్నాళ్ల కిందట ఈ సినిమాను అనౌన్స్ చేసిన ఆహా వీడియో.. తాజాగా శుక్రవారం (సెప్టెంబర్ 6) ట్రైలర్ లాంచ్ చేసింది. కామెడీతోపాటు కావాల్సినంత థ్రిల్ కూడా సినిమాలో ఉండబోతోందని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.

బాలు గాని టాకీస్ ట్రైలర్

ఆహా వీడియో ఒరిజినల్ మూవీ బాలు గాని టాకీస్. కొన్ని రోజుల కిందట సినిమా రీల్ ఉండే పెట్టే.. దానిపై జై బాలయ్య అక్షరాలతో ఈ బాలు గాని టాకీస్ మూవీ అనౌన్స్ చేసింది సదరు ఓటీటీ. అయితే ఈరోజు (సెప్టెంబర్ 6) మూవీ స్ట్రీమింగ్ తేదీని కూడా ప్రకటిస్తూ.. ట్రైలర్ రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 13 నుంచి ఆహా ఓటీటీలో మూవీ స్ట్రీమింగ్ కానుంది.

ఇక ట్రైలర్ కూడా ఆసక్తికరంగా సాగింది. ఒక నిమిషం 51 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ ఫస్ట్ హాఫ్ కామెడీని పంచగా.. సెకండాఫ్ అంతా ఇంటెన్స్ మ్యూజిక్ తో థ్రిల్లింగా సాగింది. బూతు సినిమాలతోనే తన పాతకాలం నాటి థియేటర్ ను నడిపించే బాలు.. తన టాకీస్ లో బాలయ్య సినిమాను ఆడించాలని కలలు కంటుంటాడు.

ట్రైలర్ ఎలా ఉందంటే?

నిజానికి ట్రైలర్ మొదలయ్యేది కూడా ఆ డైలాగుతోనే. వచ్చే వారం రిలీజయ్యే బాలయ్య సినిమా మన థియేటర్లోకే రావాలని అక్కడ పని చేసే వ్యక్తితో హీరో అంటుండగా ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత సడెన్ గా నీకోసం పోలీసోళ్లు వచ్చారనగానే నిద్రలో నుంచి లేచి కూర్చొంటాడు హీరో.

కట్ చేస్తే కొన్ని ఘాటు రొమాన్స్ సీన్లు బ్యాక్‌గ్రౌండ్లో కనిపిస్తుండగా.. బాలుకి పిల్లనివ్వడానికి వచ్చిన వాళ్లు అతని కోసం ఎంక్వైరీ చేస్తుంటారు. కానీ ఊళ్లో అతనికి చాలా అప్పులు ఉన్నాయని, బూతు సినిమాలు ఆడించడానికే అతడు అప్పులు చేశాడని ఆ ఊళ్లో వాళ్లు చెబుతారు.

ఆ వెంటనే అసలు మనకీ టాకీస్ అచ్చొచ్చేటట్లు లేదంటూ బాలు తల్లి అనే మాటలతో ట్రైలర్ ఒక్కసారి కామెడీ నుంచి ట్రాక్ మార్చి థ్రిల్లర్ జానర్ లోకి మారిపోతుంది. తర్వాత ట్రైలర్ మొత్తం డైలాగులు లేకుండా ఇంటెన్స్ మ్యూజిక్ తోనే సాగిపోతుంది.

అసలు బాలు గాని టాకీస్ కు ఏం జరిగింది? అతని జీవితం ఎలాంటి మలుపు తిరిగింది అన్నది సినిమాలోనే చూడాలి. ట్రైలర్ చివర్లో రక్తం మరకలు ఉన్న పాతకాలం నాటి నాణేలను చూపించి మూవీపై మరింత ఆసక్తి రేపారు.

బాలు గాని టాకీస్

బాలు గాని టాకీస్ మూవీలో శివ రామచంద్రరావు హీరోగా నటించాడు. అతడు గతంలో హీరోగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా తెలుగులో ప‌లు సినిమాలు చేశాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌కీల్‌సాబ్‌, నితిన్ భీష్మ‌, ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్‌, మజిలీ, హిట్ 2 తో పాటు ఇరవైకిపైగా సినిమాల్లో డిఫ‌రెంట్ రోల్స్ చేశాడు. కొన్ని వెబ్ సిరీస్‌ల‌లో క‌నిపించాడు. న‌రుడి బ్ర‌తుకు న‌ట‌న స‌హా మ‌రికొన్ని చిన్న సినిమాల్లో హీరోగా క‌నిపించాడు.

బాలుగాని టాకీస్ మూవీకి విశ్వ‌నాథ్ ప్ర‌తాప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. శ్రీనిధి సాగ‌ర్ ప్రొడ్యూస్ చేస్తోన్న ఈ మూవీకి స్మ‌ర‌ణ్ మ్యూజిక్ అందిస్తోన్నాడు. అశ్విత్ గౌత‌మ్ స్క్రీన్‌ప్లే అందిస్తోండ‌గా ఆదిత్య బీఎన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ స‌మ‌కూర్చుతున్నాడు.