Shivam Bhaje Review: శివంభజే రివ్యూ - అశ్విన్ బాబు డివోషనల్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
Shivam Bhaje Review: అశ్విన్‌బాబు హీరోగా నటించిన డివోషనల్ థ్రిల్లర్ మూవీ శివం భజే శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. బాలీవుడ్ నటుడు అర్భాజ్ ఖాన్ కీలక పాత్రలో నటించిన ఈ మూవీ ఎలా ఉందంటే?
Shivam Bhaje Review: అశ్విన్ బాబు, దిగంగనా సూర్యవన్షీ జంటగా నటించిన మూవీ శివంభజే. అఫ్సర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్‌ఖాన్ కీలక పాత్రలో నటించాడు. డివోషనల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాతో అశ్విన్‌బాబు ఆడియెన్స్‌ను మెప్పించాడా? లేదా? అంటే?
నాస్తికుడైన చందు పూజలు చేయడం ప్రారంభిస్తాడు. వింతవింత అనుభవాలు ఎదురవ్వడంతో డాక్టర్లను ఆశ్రయిస్తాడు. తనకు అమర్చినవి మనిషి కళ్లు కాదని, డోగ్రా అనే కుక్క కళ్లు అనే నిజం చందుకు తెలుస్తుంది? అసలు ఎలా ఎందుకు జరిగింది? పోలీస్ శిక్షణ పొందిన డోగ్రా మరణానికి కారకులు ఎవరు?
ఇండియాకు వ్యతిరేకంగా ఓ కెమికల్ ల్యాబ్‌లో పాకిస్థాన్, చైనా కలిసి చేస్తోన్న కుట్రల గురించి ఏసీపీ మురళి (అర్భాజ్‌ఖాన్) ఇన్వేస్టిగేషన్‌లో ఎలాంటి నిజాలు బయటపడ్డాయి? మురళికి ఈ ప్రయోగాలకు ఉన్న సంబంధం ఏమిటి? కెమికల్ ల్యాబ్‌లో పనిచేస్తోన్న ఉద్యోగులను చంపుతున్న కిల్లర్ ఎవరు? ఈ సంఘ విద్రోహ శక్తులను శివుడి అండతో చందు ఎలా అడ్డుకున్నాడు? తాను ప్రాణంగా ప్రేమించిన శైలజను(దిగంగాన సూర్యవన్షీ) ఎలా కాపాడుకున్నాడు అన్నదే ఈ మూవీ కథ.
డివోషనల్ టచ్‌తో సాగే థ్రిల్లర్ మూవీ...
ప్రస్తుతం టాలీవుడ్‌లో డివోషనల్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. పురాణాలు, చారిత్రక అంశాలతో కూడిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల పంటను పండిస్తున్నాయి. డివోషనల్ అంశానికి క్రైమ్ థ్రిల్లర్, దేశభక్తి పాయింట్‌ను జోడించి దర్శకుడు అఫ్సర్ శివం భజే కథను రాసుకున్నాడు.
శివుడి అండ లేనిదే...
దేవుడి అండతో దేశానికి ఎదురైన విపత్తును ఓ యువకుడు ఎలా ఎదుర్కొన్నాడన్నదే శివం భజే మూవీ కథ. ఇప్పటివరకు ఎవరూ తెలుగు సినిమాలో టచ్ చేయని యూనిక్ పాయింట్‌తో దర్శకుడు ఈ కథ చెప్పేందుకు ప్రయత్నించాడు డైరెక్టర్. ఈ పాయింట్‌ను కన్వీన్సింగ్‌గా చెప్పేందుకు దర్శకుడు అల్లుకున్న డ్రామా బాగుంది.
ఫస్ట్ హాఫ్ ట్విస్ట్‌తో...
లోన్ రికవరీ ఏజెంట్‌గా చందును పరిచయం చేసే అంశాలతో మాస్ యాంగిల్‌లో ఈ సినిమా మొదలవుతుంది. చందు, శైలేజ ప్రేమకథతో ఫస్ట్ ఫన్, రొమాన్స్ అంశాలతో నడిపించారు. చందు కంటిచూపు కోల్పోవడం...ఆ కళ్లు మనిషివి కాదనే నిజం తెలిసే ట్విస్ట్‌తో ఫస్ట్ హాఫ్‌ను ఎండ్ చేశారు.
డోగ్రా ఎవరు? కెమికల్ ల్యాబ్‌లో జరుగుతోన్న మిస్టరీని ఛేదించేందుకు చందు చేసే ప్రయత్నాలు చుట్టూ సెకండాఫ్ థ్రిల్లింగ్‌గా సాగుతుంది. అర్భాజ్ ఖాన్ క్యారెక్టర్‌కు సంబంధించి క్లైమాక్స్‌లో వచ్చే మలుపును దర్శకుడు బాగా రాసుకున్నాడు. క్లైమాక్స్‌లో శివుడి అజ్ఞ లేకుండా సృష్టిలో ఏది జరగదని డివోషనల్ పాయింట్‌తో సినిమాను ఎండ్ చేశారు డైరెక్టర్.
లవ్ ట్రాక్ రొటీన్...
హీరోహీరోయిన్ల లవ్ ట్రాక్ రొటీన్‌గా సాగుతుంది. ప్రేమకథను కొత్తగా రాసుకుంటే బాగుండేది. పాటు కెమికల్ ల్యాబ్ నేపథ్యం, కుట్రల తాలూకు ఎపిసోడ్స్‌లో ఉత్కంఠ కొన్నిచోట్ల మిస్సయ్యింది.
థ్రిల్లర్ సినిమాకు తగ్గట్లుగా...
చందు పాత్రలో అశ్విన్ బాబు యాక్షన్, ఎమోషనల్ సీన్స్‌లో మెప్పించాడు. థ్రిల్లర్ సినిమాలకు తగ్గట్లుగా అతడి నటన సాగింది. పాజిటివ్‌గా కనిపించే నెగెటివ్ షేడ్ క్యారెక్టర్‌లో సల్మాన్ ఖాన్ బ్రదర్ అర్భాజ్ ఖాన్ సెటిల్డ్ యాక్టింగ్‌ను కనబరిచాడు. దిగంగనా సూర్యవన్షీ పాత్రకు కథలో పెద్దగా ఇంపార్టెన్స్ లేనట్లుగా అనిపిస్తుంది. హీరో ఫ్రెండ్‌గా హైపర్ ఆది పంచ్ డైలాగ్స్ కొన్ని నవ్వించాయి. వికాస్ బాడిస తన బీజీఎమ్ తో డివోషనల్ ఫీల్ కలిగించాడు.
ప్రయోగాలను ఇష్టపడేవారిని...
శివం భజే ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన థ్రిల్లర్ మూవీ. ప్రయోగాలకు ప్రాధాన్యమిచ్చే ఆడియెన్స్‌ను ఈ మూవీ కొంత వరకు మెప్పిస్తుంది.
రేటింగ్: 2.75/5
టాపిక్