Deadpool Wolverine Collection: మూడు రోజుల్లో 3650 కోట్లు - బాక్సాఫీస్ వద్ద కుమ్మేస్తోన్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ
Deadpool Wolverine Collection: హాలీవుడ్ సూపర్ హీరో మూవీ డెడ్‌పుల్ అండ్ వాల్వరిన్ మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా 3650 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ ఏడాది హాలీవుడ్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
Deadpool Wolverine Collection: హాలీవుడ్ సూపర్ హీరో మూవీ డెడ్ పుల్ అండ్ వాల్వరిన్ బాక్సాఫీస్ వద్ద కుమ్మేస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ 3650 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ ఏడాది హాలీవుడ్‌లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాల్లో ఎనిమిదో స్థానంలో నిలిచింది.
మూడు రోజుల్లో అరవై అరు కోట్లు...
ఇండియాలోనూ ఈ మూవీ భారీగా వసూళ్లను రాబడుతోంది. మూడు రోజుల్లోనే 66 కోట్ల కలెక్షన్స్ దక్కించుకున్నది, తొలిరోజు ఇండియాలో 21 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా, శని, ఆదివారాల్లో కలిసి దాదాపు 45 కోట్ల వరకు కలెక్షన్స్ సొంతం చేసుకున్నది. ఇండియాలో హిందీతో పాటు తెలుగు, హిందీతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో ఈ మూవీ రిలీజైంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ లో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న పలు పదాలను ఉపయోగించి రాసిన డైలాగ్స్ అభిమానులను మెప్పిస్తోన్నాయి.
200 మిలియన్ల బడ్జెట్…
డెడ్‌పుల్ అండ్ వాల్వరిన్ మూవీని మార్వెల్ స్టూడియోస్ నిర్మించింది. ఇందులో రయాన్ రెనాల్డ్స్, హ్యూ జాక్ మన్ హీరోలుగా నటించారు. షాన్ లేవీ దర్శకత్వం వహించాడు. దాదాపు 200 మిలియన్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ మూడు రోజుల్లోనే మేకర్స్‌కు రెండింతల లాభాలను తెచ్చిపెట్టింది. ఇందులో రయాన్ రెనాల్డ్స్, హ్యూ జాక్‌మన్ యాక్షన్ ఎపిసోడ్స్ అభిమానులను ఆకట్టుకుంటోన్నాయి. ముఖ్యంగా డెడ్‌పుల్ పాత్రలో రయాన్ రెనాల్డ్స్ తన కామెడీ టైమింగ్‌తో మెప్పిస్తోన్నాడు.
డెడ్‌ఫుల్ వాల్వరిన్ కథ ఏదంటే?
గర్ల్‌ఫ్రెండ్ వెనెసాతో బ్రేకప్ చెప్పిన డెడ్‌పుల్ కార్ల సేల్స్ మెన్‌గా కొత్త జీవితాన్ని మొదలుపెడతాడు. డెడ్‌పుల్ ను పారాడాక్స్ మనుషులు కిడ్నాప్ చేస్తారు. ఎర్త్ 616లో జాయిన్ కావాలని డిమాండ్ చేస్తారు. డెడ్‌పుల్‌ను హ్యాపీ హోగన్ అలియాస్ వాల్వరిన్‌ను ఎలా కలిశాడు? పారాడాక్స్ నుంచి టెమ్‌ప్యాడ్‌ను డెడ్‌పుల్ ఎందుకు దొంగిలించాడు? మల్టీవెర్స్‌లో డెడ్‌పుల్, వాల్వరిన్ కలిసి ఎలాంటి సాహసాలు చేశారన్నదే డెడ్‌పుల్ అండ్ వాల్వరిన్ మూవీ కథ.
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్...
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ఈ మూవీ తెరకెక్కింది. డెడ్‌పుల్, డెడ్‌పుల్ 2 సినిమాలకు సీక్వెల్‌గా డెడ్‌పుల్ అండ్ వాల్వరిన్ మూవీ రూపొందింది. ఈ మూవీకి రయాన్ రెనాల్డ్స్ కూడా స్క్రీన్‌ప్లేను సమకూర్చడం గమనార్హం. హాలీవుడ్ మూవీకి రయాన్ రెనాల్డ్స్ రైటర్‌గా వ్యవహరించడం ఇదే మొదటిసారి కాదు. ఎక్స్‌మెన్ వాల్వరిన్, నో గుడ్ డీడ్‌తో పాటు మరికొన్ని సినిమాలకు రైటర్‌గా, డైలాగ్ రైటర్‌గా రెనాల్డ్స్ పనిచేశాడు. ప్రొడ్యూసర్‌గా పలు సినిమాలను నిర్మించాడు.